
‘సల్మాన్, సలీంలది అవకాశవాదం’
అలీగఢ్: నరేంద్ర మోడీని పొగడ్తలతో ముంచెత్తిన బాలీ వుడ్ నటుడు సల్మాన్‌ఖాన్, ఆయన తండ్రి సలీంఖాన్‌లపై ముస్లిం మేధావులు మండిపడ్డారు. రాజకీయ అవకాశవా దం, పక్కా వ్యాపార లబ్ధి కోసమే మోడీని పొగిడారని విరుచుకుపడ్డారు. ఈ మేరకు అలీగఢ్ ముస్లిం వర్సిటీకి చెందిన ఫోరం ఫర్ ముస్లిం స్టడీస్ అండ్ అనాలిసిస్ (ఎఫ్‌ఎంఎస్‌ఏ)మేధావుల బృందం గురువారం ఓ తీర్మానాన్ని ఆమోదించింది. మోడీకి చెందిన ఉర్దూ వెబ్‌సైట్ ప్రారంభించిన సందర్భంగా సల్మాన్‌ఖాన్ మోడీని పొగడడం, గుజరాత్‌లో అభివృద్ధి మోడీవల్లే సాధ్యమైందని ఆయన తండ్రి పేర్కొనడంపై ఎఫ్‌ఎంఎస్‌ఏ అభ్యంతరం వ్యక్తం చేసింది.