ఆజాద్‌ వ్యాఖ్యలపై మండిపడ్డ బీజేపీ | BJP Slams Ghulam Nabi Azad Abuse Comments In AMU | Sakshi
Sakshi News home page

Published Fri, Oct 19 2018 8:26 AM | Last Updated on Fri, Oct 19 2018 8:30 AM

BJP Slams Ghulam Nabi Azad Abuse Comments In AMU - Sakshi

న్యూఢిల్లీ: తనను ఎన్నికల ప్రచారానికి పిలిచే హిందువుల సంఖ్య తగ్గిపోయిందని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత గులాంనబీ ఆజాద్‌ చేసిన వ్యాఖ్యలు వివాదస్పదంగా మారాయి. ఆయన చేసిన వ్యాఖ్యలపై స్పందించిన ప్రతిపక్ష పార్టీ హిందువుల మనోభావాలను కించపరిచే విధంగా వ్యవహారిస్తుందని  విమర్శించింది. బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్‌ పాత్ర మాట్లాడుతూ.. ఆజాద్‌ను తక్కువ మంది ప్రచారానికి పిలువడానికి.. ఆయన హిందూ, ముస్లింలను వేరుగా చూడటమే కారణమని ఆరోపించారు. బీజేపీ అలీగఢ్‌ ముస్లిం యూనివర్సిటీని ప్రతిష్టను దెబ్బతీసేవిధంగా ప్రయత్నిస్తుందనే ఆరోపణలను కూడా ఆయన ఖండించారు.  

కాగా, అలీగఢ్‌ ముస్లిం యూనివర్సిటీ వార్షికోత్సవంలో పాల్గొన్న ఆజాద్‌ మాట్లాడుతూ.. ‘ నేను యూత్‌ కాంగ్రెస్‌ నాయకునిగా ఉన్నప్పటి నుంచి దేశవ్యాప్తంగా వివిధ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల తరఫున ప్రచారం చేశాను. గతంలో నన్ను 95 శాతం హిందూ సోదరులు, 5శాతం ముస్లిం సోదరులు ప్రచారానికి పిలిచేవారు. కానీ గత నాలుగేళ్లలో నన్ను ప్రచారానికి పిలిచే హిందూ సోదరుల సంఖ్య 20 శాతం పడిపోయింది. నేను వారి తరఫున ప్రచారం చేస్తే ఓట్లు రావాని వారు భయపడుతున్నారు.  అందుకే నన్ను పిలవడానికి ఇష్టపడటంలేద’ని అన్నారు. అదేవిధంగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై కూడా ఆజాద్‌ పలు విమర్శలు చేశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement