ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(కృత్రిమ మేధస్సు) కొత్త పుంతలు తొక్కుతుంది. పెరుగుతున్న టెక్నాలజీని ఉపయోగించుకుని మనిషి చేసే దాదాపు అన్ని పనులను యంత్రాలు చేయగలిగేలా తయారు చేస్తున్నారు. ఇప్పుడు వైద్య రంగంలోనూ సరికొత్త ట్రెండ్ సెట్టర్‌గా నిలుస్తుంది ఏఐ. ఎందుకంటే ఇప్పుడు అనారోగ్యంగా అనిపిస్తే డాక్టర్ వద్దకు వెళ్లాల్సిన పనిలేదు. బీపీ, షుగర్ నుంచి స్కానింగ్ వరకు అన్ని రకాల ట్రీట్‌మెంట్‌లను కృత్రిమంగా అందిస్తుంది.
మనకు ఏదైనా జ్వరం వచ్చినా, అనారోగ్యంగా అనిపించినా ఏం చేస్తాం? వెంటనే డాక్టర్ వద్దకు పరుగులు తీస్తాం. సమస్యను బట్టి ఆయా డాక్టర్‌ను ఎంచుకుంటాం. కానీ ఇప్పుడు హాస్పిటల్ వరకు వెళ్లాల్సిన అవసరం లేకుండానే మొభైల్‌లోనే మన హెల్త్ అప్‌డేట్స్ అన్నీ తెలుసుకోవచ్చు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ద్వారా ఆధారితమైన వినూత్న హెల్త్ క్లినిక్ ఫ్లాట్‌ఫారమ్‌ను ఇప్పుడు పరిశోధకులు అభివృద్ది చేశారు. జిమ్, మాల్స్, ఆఫీసుల్లో ఏఐ ఆధారిత కేర్‌పాడ్స్‌ను అమెరికాలో ఈమధ్యే ప్రారంభించారు.
పేషెంట్స్ లోపలికి అడుగుపెట్టగానే రొబాటిక్ వాయిస్ మెసేజ్‌తో గైడెన్స్ లభిస్తుంది. మన మొబైల్‌లో లాగిన్ అయ్యి స్క్రీన్‌పై చూపిస్తున్న ఫీచర్లలో మన అనారోగ్యానికి సంబంధించిన వాటిని ఎంచుకోవచ్చు. ఉదాహరణకు మీకు బాడీ స్కానింగ్ చేయించుకోవాలనిపిస్తే స్క్రీన్‌పై కనిపించే ఆఫ్షన్‌ను ఎంచుకొని చెకప్ చేయించుకోవచ్చు. మన బాడీలో సూది గుచ్చకుండానే బ్లాడ్ సాంపిల్స్ కలెక్ట్ తీసుకొనే అరుదైన ఫీచర్ ఇందులో ఉంది. హార్ట్ హెల్త్, బ్రెయిన్, బీపీ.. ఇలా మీ సమస్యకు సరిపోయే వైద్య సహకారం క్షణాల్లో లభిస్తుంది.
కేర్ పాడ్స్‌లో నమోదైన పేషెంట్ డేటాను డాక్టర్‌కు పంపిస్తుంది. నిమిషాల్లో మీ పరిస్థితిని సమీక్షించి మొభైల్‌లో రిపోర్ట్స్‌ను పంపిస్తారు. ప్రైమరీ డాక్లర్ల కొరతను కేర్ పాడ్స్ రిప్లేస్ చేస్తుందన్నమాట. నెలకు 8200 మెంబర్ షిప్ కట్టి ఎప్పుడైనా మీ హెల్త్ అప్‌డేట్‌ను తెలుసుకోవచ్చు. ఇప్పటికే అమెరికాలో కొన్ని మాల్స్‌లో ఈ సదుపాయం అందుబాటులోకి వచ్చింది.
రానున్న రోజుల్లో చాండ్లర్, అరిజోనా,చికాగో సహా మరిన్ని ప్రాంతాల్లో చేరువ చేసేందుకు ప్రణాళికులు సిద్దం చేస్తున్నారు. అయితే ఈ ఆర్టిఫిషియల్ డాక్టర్ కేర్‌ను కొందరు కొట్టిపారేస్తున్నారు. ప్రత్యక్షంగా డాక్టర్‌ను కలిసినప్పుడే పేషెంట్స్ చెప్పే కొన్ని విషయాలను బట్టి సమస్యను తెలుసుకోవచ్చు. కొన్నిసార్లు తీవ్రమైన ఇబ్బందులు కూడా బయటకొచ్చిన సందర్భాలు ఎన్నో. కానీ ఇలా మెషీన్ సహాయంతో పేషెంట్ పరిస్థితి పూర్తిగా అంచనా వేయకపోవచ్చు అనే కొందరు విమర్శిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment