బాకీ తీర్చలేదని బట్టలూడదీసి.. మర్మాంగాల మీద తన్నుతూ.. | Police Action On Kanpur Harassment Viral Video | Sakshi
Sakshi News home page

బాకీ తీర్చలేదని బట్టలూడదీసి.. మర్మాంగాల మీద తన్నుతూ..

Published Wed, May 8 2024 11:16 AM | Last Updated on Wed, May 8 2024 12:11 PM

Police Action On Kanpur Harassment Viral Video

బాకీ తీర్చని ఓ టీనేజర్‌పై సీనియర్లు దాష్టికానికి దిగారు.  తీర్చాల్సిన బాకీ కంటే ఎన్నో రెట్ల డబ్బులివ్వాలంటూ బెదిరించారు. ఇవ్వలేనని చెప్పడంతో వేధింపులకు దిగారు. ఆ వేధించడం మరీ హింసాత్మకంగా ఉండడం.. ఆ వీడియో కాస్త వైరల్‌ కావడంతో పోలీసులు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది.

ఉత్తరప్రదేశ్‌ ఎటావాకు చెందిన టీనేజర్‌.. నీట్‌ కోచింగ్‌ కోసం కాన్పూర్‌ వచ్చాడు. కోచింగ్‌ సెంటర్‌లో సీనియర్లతో స్నేహం కుదిరి..వాళ్లు ఉంటున్న ప్లాట్‌కి మకాం మార్చాడు. ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ గేమ్‌ కోసం వాళ్ల దగ్గరి నుంచి రూ.20 వేలు తీసుకున్నాడు. అయితే గేమ్‌లో ఆ డబ్బంతా పొగొట్టుకున్నాడు.

దీంతో.. ఆ సీనియర్లు 20 వేలకు బదులు రూ.2 లక్షలు ఇవ్వాలంటూ బెదిరింపులకు దిగారు. సదరు విద్యార్థి చెల్లించకలేకపోయేసరికి.. అతన్ని చిత్రహింసలు పెడుతూ ఆ తతంగం అంతా వీడియో తీశారు. ఆ విద్యార్థినిని కింద పడేసి చితకబాదారు. కాళ్లు మొక్కుతున్నా విడిచిపెట్టకుండా.. బలవంతంగా అతని దుస్తులు విప్పించారు. మర్మాంగానికి ఇటుకను కట్టి వేలాడదీస్తూ వేధించారు. ఈ దాష్టీకం ఇంతటితోనే ఆగలేదు. అతని వెంట్రుకల్ని తగలబెట్టే ప్రయత్నమూ చేశారు.

చివరకు బాధితుడు తల్లిదండ్రులకు ఈ విషయం చెప్పడంతో.. వాళ్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఎటావా పోలీసులు నిందితులను పిలిపించి.. కేవలం మందలించి వదిలేశారు. ఈలోపు టీనేజర్‌ను వేధించిన వీడియోలు వాట్సాప్‌ ద్వారా బయటకు వచ్చాయి. దీంతో పోలీసులు  ఈసారి సీరియస్‌ యాక్షన్‌ తీసుకున్నారు. వీడియోలో ఉన్న ఆరుగురు నిందితులను గుర్తించి.. అరెస్ట్‌ చేశారు. ఒక ముఠాగా మారి కోచింగ్‌సెంటర్‌కు వచ్చే విద్యార్థులను వీళ్లు టార్గెట్‌ చేసినట్లు పోలీసులు చెబుతున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement