seniors harrassment
-
బాకీ తీర్చలేదని బట్టలూడదీసి.. మర్మాంగాల మీద తన్నుతూ..
బాకీ తీర్చని ఓ టీనేజర్‌పై సీనియర్లు దాష్టికానికి దిగారు. తీర్చాల్సిన బాకీ కంటే ఎన్నో రెట్ల డబ్బులివ్వాలంటూ బెదిరించారు. ఇవ్వలేనని చెప్పడంతో వేధింపులకు దిగారు. ఆ వేధించడం మరీ హింసాత్మకంగా ఉండడం.. ఆ వీడియో కాస్త వైరల్ కావడంతో పోలీసులు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది.ఉత్తరప్రదేశ్ ఎటావాకు చెందిన టీనేజర్.. నీట్ కోచింగ్ కోసం కాన్పూర్ వచ్చాడు. కోచింగ్ సెంటర్లో సీనియర్లతో స్నేహం కుదిరి..వాళ్లు ఉంటున్న ప్లాట్‌కి మకాం మార్చాడు. ఆన్లైన్ బెట్టింగ్ గేమ్ కోసం వాళ్ల దగ్గరి నుంచి రూ.20 వేలు తీసుకున్నాడు. అయితే గేమ్‌లో ఆ డబ్బంతా పొగొట్టుకున్నాడు.దీంతో.. ఆ సీనియర్లు 20 వేలకు బదులు రూ.2 లక్షలు ఇవ్వాలంటూ బెదిరింపులకు దిగారు. సదరు విద్యార్థి చెల్లించకలేకపోయేసరికి.. అతన్ని చిత్రహింసలు పెడుతూ ఆ తతంగం అంతా వీడియో తీశారు. ఆ విద్యార్థినిని కింద పడేసి చితకబాదారు. కాళ్లు మొక్కుతున్నా విడిచిపెట్టకుండా.. బలవంతంగా అతని దుస్తులు విప్పించారు. మర్మాంగానికి ఇటుకను కట్టి వేలాడదీస్తూ వేధించారు. ఈ దాష్టీకం ఇంతటితోనే ఆగలేదు. అతని వెంట్రుకల్ని తగలబెట్టే ప్రయత్నమూ చేశారు.#UttarPradesh: Students preparing for #NEET in #Kanpur brutally beat up their classmate. He was hung by tying a rope around his private part. They tried to burn his hair with fire spray.Actually, the victim student lost 20K in an online game. pic.twitter.com/TO1MhtAt0y— Siraj Noorani (@sirajnoorani) May 7, 2024చివరకు బాధితుడు తల్లిదండ్రులకు ఈ విషయం చెప్పడంతో.. వాళ్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఎటావా పోలీసులు నిందితులను పిలిపించి.. కేవలం మందలించి వదిలేశారు. ఈలోపు టీనేజర్‌ను వేధించిన వీడియోలు వాట్సాప్ ద్వారా బయటకు వచ్చాయి. దీంతో పోలీసులు ఈసారి సీరియస్ యాక్షన్ తీసుకున్నారు. వీడియోలో ఉన్న ఆరుగురు నిందితులను గుర్తించి.. అరెస్ట్ చేశారు. ఒక ముఠాగా మారి కోచింగ్‌సెంటర్‌కు వచ్చే విద్యార్థులను వీళ్లు టార్గెట్ చేసినట్లు పోలీసులు చెబుతున్నారు. -
ర్యాగింగ్ పేరుతో వికృత చేష్టలు.. హాస్టల్లో అమ్మాయిలపై పైశాచికత్వం!
Seniors ragging.. కాలేజ్ డేస్ అనగానే చాలా మందికి హ్యాపీడేస్ సినిమా గుర్తుకు వస్తుంది. ఆ సినిమాలో జూనియర్లను సీనియర్లు ర్యాగింగ్ చేసే సీన్స్ నవ్వుతో పాటుగా కోపాన్ని కూడా తెప్పిస్తుంది. అలాగే, కొందరు విద్యార్థులు తాము కాలేజీలో చేరిన మొదటి రోజుల్లో సీనియర్ల ర్యాగింగ్‌ను గుర్తు చేసుకుని కొందరు నవ్వుకుంటే.. మరికొందరు మాత్రం భయంతో వణికిపోతారు. తాజాగా ఇలాంటి ఘటనే ఓ మెడికల్‌లో చోటుచేసుకుంది. మానవత్వం మరిచిన సీనియర్స్.. జూనియర్ల పట్ల వికృత చర్యలకు దిగారు. జూనియర్ అమ్మాయిలతో కూడా అసభ్యకరంగా ప్రవర్తిస్తూ, ఇష్టం వచ్చిన రీతిలో ప్రవర్తించారు. దీంతో పోలీసులు వారిపై కేసు నమోదు చేశారు. ఈ ఘటన మధప్రదేశ్‌లో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. ఇండోర్‌లోని మహాత్మాగాంధీ మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ పేరుతో సీనియర్లు రెచ్చిపోయారు. హాస్టల్లో జూనియర్లను తమ రూమ్స్‌లోకి పిలిపించుకుని ఓవర్‌గా బిహేవ్ చేశారు. దిండ్లతో శృంగారం చేయాలని వారిని బలవంతం చేశారు. ఈ క్రమంలోనే జూనియర్ అమ్మాయిలతో అసభ్యకరంగా ప్రవర్తించారు. ఒకరికొకరు కొట్టుకోవాలని బెదిరించారు. దీంతో, సీనియర్ల వేధింపులు భరించలేక జూనియర్లు.. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్‌కు చెందిన యాంటీ ర్యాగింగ్ హెల్ప్‌లైన్ నంబర్‌కు కాల్ చేసి జరిగిన దారుణాన్ని వివరించారు. విద్యార్థుల ఫిర్యాదులో ర్యాగింగ్ ఘటనను సీరియస్‌గా తీసుకున్న యూజీసీ.. రంగంలోకి దిగి విచారణ జరిపింది. విద్యార్థులను వేధింపులకు గురిచేసిన సీనియర్లను గుర్తించి, కఠిన చర్యలు తీసుకోవాలని కళాశాల యాజమాన్యానికి యూజీసీ ఆదేశించింది. దీంతో, పోలీసులు యాంటీ ర్యాగింగ్ యాక్ట్ -2009 కింద సీనియర్లపై కేసులు నమోదు చేసినట్టు తెలిపారు. ‘Have sex with pillows, abuse girls’: Freshers allege ragging in Indore's MGM Medical College#indorenews #MadhyaPradesh #CollageRagging #nvbcnews pic.twitter.com/fRiQUIX2gP — NVBC News (@NewsNvbc) July 30, 2022 ఇది కూడా చదవండి: రైల్వే స్టేషన్లో పోలీస్ వీరంగం.. వృద్ధుడ్ని తన్ని ఈడ్చుకెళ్లి టార్చర్.. వీడియో వైరల్ -
ఎస్పీ నన్ను వేధించారు: మాజీ మహిళా డీఎస్పీ
సీనియర్లు తనను వేధింపులకు గురిచేశారంటూ కర్ణాటకలోని కుదిల్గి మాజీ డీఎస్పీ అనుపమా షెనాయ్ కర్ణాటక రాష్ట్ర మహిళా కమిషన్‌ను ఆశ్రయించారు. ఈ మేరకు ఆమె కమిషన్‌కు ఏడు పేజీల లేఖ రాశారు. జిల్లా ఎస్పీ ఆర్. చేతన్ తనను వేధిస్తున్నారని తెలిపారు. సరిగ్గా తాను రాజీనామా చేసిన జూన్ 4వ తేదీనే ఆమె ఈ లేఖను పంపారు. తన సమీప బంధువులతో ఈ లేఖను పంపినట్లు తెలిసింది. తన కింద పనిచేసేవాళ్లు అసలు సహకరించేవారు కారని, తన రాజీనామాకు కూడా ఎస్పీయే కారణమని ఆమె ఆరోపించారు. తాను 19 రోజుల సెలవులో వెళ్లినపుడు పోలీసు స్టేషన్‌లోని రహస్య డాక్యుమెంట్లను ఎస్పీ విడుదల చేశారని, వాటివల్ల తాను తీవ్ర మానసిక వేదనకు గురయ్యానని అన్నారు. సెలవు నుంచి తిరిగొచ్చిన తర్వాత చిన్న చిన్న కారణాలకే తనపై పలు మెమోలు జారీచేశారన్నారు. తాను సెలవు పెడితే.. ఆ లేఖను ఎస్పీ మెడికల్ బోర్డుకు పంపారని చెప్పారు. ఈ వ్యవహారంపై పోలీసులకు బదులు మహిళా కమిషనే విచారణ జరపాలని కోరారు. అయితే తాను షెనాయ్ విషయంలో నిబంధనల ప్రకారమే నడుచుకున్నానని ఎస్పీ చేతన్ తెలిపారు. తాను ఆమెను వేధించాలనుకుంటే ఆమెపై సీనియర్లకు వ్యతిరేకంగా నివేదిక పంపేవాడినని అన్నారు.