వర్షాకాలం, లేదా తీపి వంటకాల ఘుమఘమలకు ఈగలు ముసురుతుంటాయి. వాటితో సమస్య అంత ఇంత కాదు. ఈగల వల్లే పలు అనారోగ్య సమస్యలు వస్తుంటాయని మనందరికీ తెలిసిందే. వాటి నివారణ కోసం పలు క్రిమి సంహరక నివారణలు వాడుతుంటాం కూడా. అయినా ఎక్కడొక చోట ఒక్క ఈగ అయినా ఉంటూనే ఉంటుంది. ఉన్న ఒక్క ఈగ ఒక్కోసారి మన చుట్టూ తిరుగుతూ ముఖంపై వాలుతూ విసిగిస్తూ ఉంటుంది. చిర్రెత్తుకొస్తే చంపందేకు యత్నిస్తాం. ఇలానే ఓ వ్యక్తి చేసి ఏకంగా కంటినే పోగొట్టుకున్నాడు. ఎలాగంటే..
వివరాల్లోకెళ్తే..చైనాలో ఈ దిగ్బ్రాంతికర ఘటన చోటు చేసుకుంది. చైనాలోని గ్వాంగ్‌డాంగ్‌లోని దక్షిణ ప్రావిన్స్‌లోని షెన్‌జెన్‌లో నివశిస్తున్న వ్యక్తికి ఒకరోజు ఈగ అతడి చుట్టూ తిరుగుతూ సందడి చేస్తుంది. దీంతో విసుగొచ్చి దాన్ని చంపాడు. అంతే ఒక గంట తర్వాత ఎడమ కన్ను ఎర్రగా అయ్యి వాపు వచ్చేసింది. ఆ తర్వాత ఒకటే నొప్పిపుట్టడంతో తాళ్లలేక వైద్యులను సంప్రదించాడు. వైద్యులు మందుల ఇచ్చిన తర్వాత కూడా పరిస్థితి మెరుగవ్వకపోగ, పరిస్థితి మరింత దిగజారింది. వైద్య పరీక్షల్లో అతడికి కండ్లకలక వచ్చినట్లు నిర్థారణ అయ్యింది.
అంతేగాదు అతడి కంటి చుట్టూ ఉన్న ప్రాంతం వ్రణాలు వచ్చి ఇన్ఫెక్షన్ ఎక్కువైపోయింది. ఆ ఇన్ఫెక్షన్ కాస్త మెదడుకు వ్యాపించే అవకాశం ఉందని భావించి ఎడమ కనుబొమ్మను మొత్తం తొలగించారు. ఈ మేరకు వైద్యులు మాట్లాడుతూ..ఈగలాంటి కీటకాలు బాత్‌రూమ్‌లు, బాత్‌టబ్‌లు, సింక్‌లు, కిచెన్‌లలో ఎక్కువగా ఉంటాయి. ఇవి ఎక్కువగా తడిప్రదేశాల్లో కనిపిస్తాయి. ఈ కీటకాలు కళ్ల దగ్గరే తచ్చాడుతున్నప్పుడూ ప్రశాంతంగా ఉండాలి.
దాని వద్దకు వెళ్లొద్దని సూచిస్తున్నారు. బదులుగా అది తాకిన ప్రాంతాన్ని పరిశుభ్రమైన నీరు లేదా సెలైన్ ద్రావణంతో కడగాలని అన్నారు. ప్రస్తుతం ఈ ఘటన చైనా ప్రజలందర్నీ కలవరపాటుకి గురిచేసింది. ఈ విషయం నెట్టింట వైరల్ అవ్వడంతో నెటిజన్లు ఇది చాలా భయనకంగా ఉంది. తాము కూడా తరుచు బాత్రూంలలో ఇలాంటివి చూస్తామని, దేవుడు దయ వల్ల ఇలాంటి పరిస్థితి ఎదురుకాలేదంటూ పోస్టులు పెట్టారు.
(చదవండి: అనంత్ పెళ్లిలో హైలెట్‌గా ఏనుగు ఆకారపు డైమండ్ బ్రూచ్..ఆ డిజైన్‌లోనే ఎందుకంటే..!)
Comments
Please login to add a commentAdd a comment