Items
-
‘క్విక్’ డెలివరీతో పోటీ కిరాణా హైరానా
సాక్షి, హైదరాబాద్: బస్తీలు, కాలనీలు, సందుల్లో ఉండే కిరాణా దుకాణాలు తెరుచుకోకముందే పొద్దుపొద్దునే అవసరమయ్యే టూత్పేస్ట్లు, సబ్బులు, ఇతర చిన్నాచితకా సరుకు లు మొదలు నిత్యావసరాలు సైతం నిమిషాల్లోనే ఇళ్లకు చేరిపోతున్నాయి. టెక్నాలజీ అందుబాటులోకి రావడంతో ఈ– కామర్స్, క్విక్ (క్యూ)–కామర్స్ ద్వారా ’ఆన్–డిమాండ్ డెలివరీ’’ఇ–కిరాణా’తో వంటి వాటితో నిమిషాల వ్యవధిలోనే వేగంగా సరుకులు వచ్చిపడుతున్నాయి. చిల్లర సామాన్లు మొదలు అన్నీ ఈ–కామర్స్ వ్యాప్తితో జెప్టో, బీబీ(బిగ్ బా స్కెట్), జొమాటో(బ్లింకిట్), ఇన్‌స్టా మార్ట్ (స్విగ్గీ) తదితరాలతో కిరాణా దుకాణాలకు పోటీ తప్పడం లేదు. నిమిషాల్లోనే డెలివరీ చేసే ఈ–కామర్స్ బిజినెస్ క్ర మంగా దేశంలో పుంజుకుంటోంది. ప్రపంచవ్యాప్తంగా వేగంగా చోటుచేసుకుంటున్న మార్పుచేర్పుల్లో భాగంగా ఫాస్ట్ ఫుడ్ నుంచి ఫాస్ట్ ఇంటర్నెట్ వరకు.. ఇన్స్టంట్ మెసేజింగ్ నుంచి ఆన్–డిమాండ్ స్ట్రీమింగ్ వరకు వివిధరకాల వినియోగదారులు వేగవంతమైన సేవలు కోరుకుంటున్నారు. ఈ–కామర్స్, క్యూ–కామర్స్ ద్వారా కిరాణా వస్తువులు మొదలు ఎల్రక్టానిక్ పరికరాలు, వస్తువులు, రెడిమేడ్ దుస్తులు, అత్యవసరమైన మందుల దాకా కొద్దినిమిషాల వ్యవధిలోనే డోర్ డెలివరీ కావాలని కస్టమర్లు ఆశిస్తున్నారు. దీంతో ఈ తరహా వేగవంతమైన డెలివరీ సిస్టమ్ అందిస్తున్న ఈ–కామర్స్ సంస్థల నుంచి ప్రధానంగా సంప్రదాయ కుటుంబపరమైన వ్యాపారంలో భాగంగా ఉన్న కిరాణా మర్చంట్స్, వ్యాపారులు తీవ్రమైన పోటీని ఎదుర్కోక తప్పడం లేదు. సాంకేతికత సాయంతో సత్వరమే... క్యూ–కామర్స్ ఆన్–డిమాండ్ విధాన వినియోగంతోపాటు కృత్రిమమేధ ఆధారంగా అల్గారిథమ్‌లు, ఇతర అత్యాధునిక సాంకేతికతలను ఉపయోగించడం ద్వారా అత్యంత వేగంగా వినియోగదారులకు ఆర్డర్లు చేరవేస్తున్నారు. స్థానిక మైక్రో– వేర్‌హౌస్‌లను ఉపయోగించడం ద్వారా రిటైలర్లు వేగంగా డె లివరీ చేయడంతోపాటు రవాణా ఖర్చులను తగ్గించేందుకు దోహదపడుతున్నారు. కస్టమర్ల నుంచి వచ్చే ఆర్డర్ల ప్రాసెసింగ్ వేగవంతం చేసి, లోటుపాట్లు, లోపాల తగ్గింపునకు ఈ విధానం రో»ొటిక్లను కూడా ఉపయోగిస్తున్నాయి, కచ్చితమైన డిమాండ్ అంచనా క్యూ–కామర్స్ ప్లాట్‌ఫామ్‌లు వినియోగదారు ప్రవర్తనను అంచనా వేయడానికి మెషీన్ లెరి్నంగ్ అల్గారిథమ్‌లను ఉపయోగిస్తాయి. క్యూ–కామర్స్ డిమాండ్ రాబోయే రోజుల్లో మరింత వేగంగా పుంజుకుంటుందని మెకన్సీ 2020 నివేదిక వెల్లడించింది. దీని ప్రకారం మొత్తం వినియోగదారుల రిటైల్ వ్యయంలో 10 శాతం వాటాను ఇది సాధించే అవకాశాలున్నాయని, ఈ మార్కెట్ 2025 నాటికి 5 బిలియన్ల విలువకు చేరుకుంటుందని అంచనా. ఆన్–డిమాండ్ ఎకానమీ పెరుగుదలతో సంప్రదాయ సరఫరా గొలుసు విధానాన్ని అనుసరించే బదులు, క్విక్ కామర్స్ కంపెనీలు అత్యాధునిక సాంకేతికతను ఉపయోగించుకుంటున్నాయి. క్విక్ కామర్స్ ఇప్పటికే ఉన్న పరిశ్రమలను విజయవంతంగా ఏకీకృతం చేశాయి. జనసాంద్రత అధికంగా ఉన్న నగరాల్లో వ్యూహాత్మక హైపర్–లోకల్ మైక్రో–ఫుల్ఫిల్మెంట్ సెంటర్ల నెట్‌వర్క్‌ను పెంచడం ద్వారా క్విక్ కామర్స్ సంప్రదాయ కిరాణా వ్యాపారాన్ని అధిగమిస్తోంది.క్యూ–కామర్స్ వారానికి ఏడురోజులు, 24 గంటలు పనిచేస్తుండడంతో ఆధునిక జీవనశైలి డిమాండ్లకు అనుగుణంగా వినియోగదారులు ఎప్పుడైనా, ఎక్కడి నుంచైనా కొనుగోళ్లు చేసే సౌలభ్యం ఉంది. పోటీని తట్టుకునేలా ‘కిరాణా’ కొత్త ఆలోచనలు దేశవ్యాప్తంగా ఉన్న 1.20 కోట్ల సంప్రదాయ కిరాణాస్టోర్లలో సగం దాకా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నాయి. దేశవ్యాప్తంగా క్యూ–కామర్స్ చురుగ్గా సాగుతున్న పది నగరాల్లో దాదాపు మూడోవంతు రిటైలర్ల వ్యాపారాలు 35 శాతం దాకా వీటి ద్వారా ప్రభావితమైనట్టు ఆన్లైన్ కమ్యూనిటీ నైబర్హుడ్షాప్స్ కిరణ్క్లబ్ నివేదిక తేల్చింది. ప్రస్తుతానికి కిరాణా వ్యాపారాలపై క్యూ–కామర్స్ ప్రభావం పరిమితంగా ఉన్న రానున్న రోజుల్లో ఇది పెరిగితే తట్టుకునేందుకు వీలుగా కిరాణా దుకాణదారులు కొత్త ఆలోచనలు చేస్తున్నారు. క్యూ–కామర్స్, ఇతర డెలివరీ యాప్‌లను నియంత్రించేలా సిద్ధమయ్యారు. ► కస్టమర్లకు ఉచిత హోండెలివరీ సౌకర్యం పెంచడం, ఎక్కువ మంది పనివారిని నియమించుకొని వేగంగా వినియోగదారుల ఇళ్లకు (గంటలోపే) వస్తువుల చేరవేత వంటివాటిపై దృష్టిపెడుతున్నాయి. ► మరికొందరు తమ పాత కస్టమర్లతో వాట్సాప్ గ్రూప్‌లు ఏర్పాటు చేసుకొని కొత్త వస్తువులు, ఉత్పత్తులకు సంబంధించిన అప్డేట్స్ పంపిస్తూ ఆఫర్లు, డిసౌంట్లు వంటివి అందుబాటులోకి తెస్తున్నారు. ► వాట్సాప్‌పైనే కస్టమర్లకు కావాల్సిన వస్తువుల ఆర్డర్లు స్వీకరించి వ్యాపారం కాపాడుకునే ప్రయత్నాల్లో కిరాణా షాప్ యాజమానులు నిమగ్నమయ్యారు. ► క్యూ–కామర్స్ ద్వారా అందించలేని కొత్త కొత్త ఉత్పత్తులు, విభిన్నరకాల వస్తువులు, ఫ్లేవర్లు అందించేందుకు, వీటికి సంబంధించిన సమాచారం కస్టమర్లకు చేరవేసి వారిని ఆకర్షించే ప్రయత్నాల్లో నిమగ్నమవుతున్నారు. -
ఇదేం వ్యాధి.. తినకూడనివన్నీ లాగించేస్తోంది..
ఇలాంటి రుగ్మతలు రాకుండా ఉంటే బాగుండనిపించే భయానక వ్యాధులు కొన్ని ఉన్నాయి. ఆ వ్యాధి పరిస్థితి చూస్తే చాలా బాధగా అనిపిస్తుంది. వాటికి సరైన చికిత్స కూడా ఉండదు. ఇదేం కర్మ అనేంత విచిత్రమైన వ్యాధుల్లా ఉంటాయి. అలాంటి అరుదైన రుగ్మతతోనే మూడేళ్ల చిన్నారి బాధపడుతోంది. ఆమె పరిస్థితి ఎంత ఘోరంగా ఉందంటే..తల్లిదండ్రులకు నిత్యం ఆ చిట్టి తల్లిని పరివేక్షించలేక కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. అసలేం జరిగిందంటే.. బ్రిటన్‌కి చెందిన మూడేళ్ల వింటర్ హేర్నే ఆటిజం తోపాటు విచిత్రమైన మరోక వ్యాధితో బాధపడుతుంది. ఆమె తినకూడని వాటిని హాంఫట్ చేసేస్తుంది. అంటే ఆ చిన్నారి గోడలకు వేసే ప్లాస్టర్లు, సోఫా ఫోమ్, ఫోటో ఫ్రేమ్ల్లోని గ్లాస్లు వంటి వాటన్నింటిని తినేస్తుంది. గృహోపకరణ వస్తువులన్నీ తినేసే అరుదైన రుగ్మతతో బాధపడుతుంది. ఈ వ్యాధిని 'పికా'గా రోగ నిర్థారణ చేశారు వైద్యులు. దీని కారణంగా బాధితులు తినకూడని వాటిని తినేలా ప్రేరేపిస్తుందని చెప్పుకొచ్చారు వైద్యులు. ఇక్కడ ఈ చిన్నారి ఇలా సోఫా ఫోమ్, ఫోటో ఫ్రేమ్ గ్లాస్లు తిన్నా ఆమెకు ఏం కాలేదని తన తల్లి చెబుతోంది. 'పికా' వ్యాధి అంటే.. పికా అనేది మానసిక ఆరోగ్య పరిస్థితి కారణంగా తలెత్తే ఒక విధమైన రుగ్మత. దీని కారణం ఆహారం కానీ వాటిని బలవంతంగా మింగడం, తినడం వంటివి చేస్తారని నిపుణులు చెబుతున్నారు. ఇది పిల్లల్లో చాలా సాధారణం. ఒక్కోసారి ప్రమాదం కాకపోయిన మరికొన్నిసార్లు తీవ్రమవుతుందని చెప్పారు. అయితే ఈ పరిస్థితికి చికిత్స కేవలం బాధితుల జీవనశైలిలో కొద్ది కొద్ది మార్పులతో ఓపికగా వారిని మార్చడమే అని చెబుతున్నారు. అయితే ఈ పికా వ్యాధి ఏ వయసులోనైనా సంభవిస్తుందట. ఎవరికైనా కూడా రావొచ్చని చెబుతున్నారు. ఎలాంటి వారికి వస్తుందంటే.. చిన్నపిల్లలు-ముఖ్యంగా ఆరు ఏళ్ల కంటే తక్కువ వయసు ఉన్నవారు గర్భిణి స్త్రీలు మానసిక ఆరోగ్య పరిస్థితులతో బాధపడుతున్నారు-అంటే ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్, మేధో వైకల్యాలు లేదా స్కిజోఫ్రెనియా ఎలా ప్రభావితం చేస్తుందంటే. తినకూడని వాటిని తినేలా ప్రేరేపిస్తుంది. దీంతో గట్టి పదార్థాలను కొరకడంతో దంతాలు దెబ్బతింటాయి. ఒక్కోసారి అవి విషపూరితం కావొచ్చు లేదా అరగక జీర్ణ సంబంధ సమస్యలు ఎదుర్కొనే పరిస్థితి రావొచ్చు. ఎందువల్ల వస్తుందంటే.. దేని కారణంగా పికా వ్యాధి వస్తుందనేందుకు కచ్చితమైన కారణాలు తెలియరాలేదని నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ వ్యాధి వచ్చే ప్రమాదాన్ని పెంచే అంశాలను గురించి మాత్రం వెల్లడించారు. అవేంటంటే.. ఒత్తిడి, ఆందోళన ఆర్థిక పరిస్థితులు పోషకాహార లోపాలు మానసిక ఆరోగ్య పరిస్థితులు వైద్య పరిస్థితులు (చదవండి: 'ఉపవాసం' వల్ల గుండె జబ్బులు వస్తాయా? పరిశోధనలో షాకింగ్ విషయాలు) -
పిండివంటలతో హ్యాపీహ్యపీ సంక్రాంతి (ఫోటోలు)
-
2023లో ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా గూగుల్‌లో సెర్చ్ చేసిన అంశాలు
న్యూస్‌కు సంబంధించి.. 1. ఇజ్రాయెల్–పాలస్తీనా యుద్ధం 2. టైటానిక్ సబ్‌మెరైన్ 3. టర్కీ భూకంపం వ్యక్తులు 1. డామర్ హామ్లిన్ (అమెరికన్ ఫుట్‌బాలర్) 2. జెరెమీ రెన్నర్ (అమెరికన్ నటుడు) 3. ఆండ్రూ టేట్ (కిక్బాక్సర్–సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్) సంగీత కళాకారులు 1. షకీరా (కొలంబియా సింగర్) 2. జేసన్ ఆల్డీన్ (అమెరికన్ సింగర్) 3. జో జోనాస్ (అమెరికన్ సింగర్–నటుడు) సినిమాలు 1. బార్బీ 2. ఓపెన్ హైమర్ 3. జవాన్ క్రీడాకారులు 1. డామర్ హామ్లిన్ (అమెరికన్ ఫుట్‌బాలర్) 2. కైలియన్ ఎంబాపే (ఫ్రెంచ్ ఫుట్‌బాలర్) 3. ట్రావిస్ కెల్స్ (అమెరికన్ ఫుట్‌బాలర్) చనిపోయిన ప్రముఖులు 1. మాథ్యూ పెర్రీ (కెనడా నటుడు) 2. టీనా టర్నర్ (అమెరికన్ సింగర్, నటి) 3. సినీడ్ ఓ కానర్ (ఐరిష్ సింగర్, లిరిసిస్ట్) -
వాట్!.. ఫుడ్ ఐటెమ్స్‌ని ఫోటోలు తీస్తే బరువు పెరుగుతారా!
ఇటీవల స్మార్ట్ ఫోటోలు వచ్చాక తెగ క్లిక్ మనిపించేస్తున్నారు జనాలు. జస్ట్ చేతిలో ఫోను ఉంటే చాలు ప్రతిదాన్ని క్లిక్ మనిపించేయడమే!. ఇది.. అది.. అని ఏం ఉండదు. ఇక ఈ సోషల్ మీడియాల పుణ్యామా అని ఆ పిచ్చి మరీ ఎక్కువయ్యింది. ఏదోక రెసీపీ తయారు చేయడం వెంటనే సోషల్ మీడియాలోనే లేదా వాట్సాప్‌లో ఫ్రెండ్‌కో షేర్ చేయడం చేస్తుంటారు. అయితే ఇలా ఫుడ్ ఐటెమ్స్ గనుక ఫోటోలు తీస్తే తెలియకుండానే బరువు పెరగుతారట. ఏంటిది? ఫోటోలు తీస్తే బరువులు పెరగడమా! అని ఆశ్చర్యపోకండి. ఇది నిజం. యూఎస్‌లోని ఓ యూనివర్సిటి చేసిన అధ్యయనంలో ఈ షాకింగ్ విషయం వెల్లడైంది. వివరాల్లోకెళ్తే..యూఎస్‌లో జార్జియా సదరన్ యూనివర్సిటీ పరిశోధకులు జరిపిన అధ్యయనంలో వందలో దాదాపు 70 మంది తినడానికి ముందు ఫుడ్ ఐటెమ్స్‌ని ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నట్లు తేలింది. అలా చేస్తున్న వాళ్లు అనూహ్యంగా బరువు పెరుగుతున్నట్లు గమనించారు. ఇలా ఫోటో తీసిన వాళ్లంతా మాములుగా తినేదాని కంటే ఎక్కువుగా తింటున్నట్లు అధ్యయనంలో వెల్లడైంది. ఫోటో తీయడం వల్ల ఆహారంపై మక్కువ పెరిగి మళ్లీమళ్లీ కావాలనిపిస్తుందట. ఈ మేరకు జార్జియన్ యూనివర్సిటీ 145 మంది స్టూడెంట్స్పై పరిశోధన నిర్వహించింది. ఆ స్టూడెంట్స్‌ని రెండు గ్రూపులుగా విభజించి ఒక్కొక్కరికి ఒక్కో ప్లేట్ ఛీజ్క్రాకర్స్ ఇచ్చారు. ఒక గ్రూప్‌ని వెంటనే తినమని, మరో గ్రూప్‌ని ఫోటోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేశాక తినమని చెప్పారు పరిశోధకులు. అలాగే తిన్న తర్వాత ఫుడ్ రేటింగ్ ఇవ్మమని కూడా అడిగారు. అయితే సోషల్ మీడియాలో పోటో తీసిన వాళ్లంతా ఫుడ్‌ని చాలా ఎంజాయ చేశామని రేటింగ్ ఇవ్వడమే గాక, ఇంకా కావాలని అడిగినట్లు పరిశోధకులు వెల్లడించారు. ఇలా ఫోటోలు తీయడం అనేది ఒక స్వీట్ మెమొరీ కాబట్టి అది మనకు తెలియకుండానే తినేదానిపై ప్రభావం చూపుతుందన్నారు పరిశోధకులు. దీంతో బ్రెయిన్ మనలో మళ్లీ మళ్లీ తినాలనే కోరికను బలంగా ప్రేరేపిస్తుందన్నారు. అందువల్ల ఎవరైనా ఎక్కువగా తినకుండా ఉండాలన్నా లేదా జంక్ ఫుడ్ మానేయాలనుకున్నా ఇలా ఫుడ్ ఐటెమ్స్‌ని ఫోటోలు తీసుకోకపోవడమే మంచిదని జార్జియా యూనివర్సిటీ పరిశోధకులు చెబుతున్నారు. (చదవండి: తల్లిదండ్రుల చేసిన ఘాతుకానికి..ఏకంగా ఆ చిన్నారి 80 ఏళ్లుగా..) -
మొలకెత్తే పెన్ను.. పర్యావరణానికి దన్ను
గుంటూరు (ఎడ్యుకేషన్): సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువుల తయారీ, వినియోగంపై నిషేధం విధించిన రాష్ట్ర ప్రభుత్వం ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయంగా పర్యావరణానికి హాని కలిగించని ఉత్పత్తులను ప్రోత్సహిస్తోంది. ఇందులో భాగంగా ప్రభుత్వ కార్యాలయాల్లో ఉపయోగించే పెన్నులను సైతం పర్యావరణ అనుకూల విధానంలో ఉపయోగిస్తోంది. యూజ్ అండ్ త్రో (వాడిపారేసే) ప్లాస్టిక్ పెన్నులు భూమిలో కలిసిపోయేందుకు వందల ఏళ్లు పడుతుంది. ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాల్లో పనిచేసే అధికారులు, ఉద్యోగులు రాష్ట్రవ్యాప్తంగా వందలు, వేల సంఖ్యలో పెన్నులను వాడి పారేస్తుండటంతో పర్యావరణానికి హాని కలిగించని పెన్నుల తయారీ, వినియోగంపై ప్రభుత్వం దృష్టి సారించింది. తొలుత విద్యాశాఖలో ప్రయోగాత్మకంగా పర్యావరణ అనుకూల పెన్నుల వినియోగాన్ని అమల్లోకి తెచ్చింది. కాగితం పొరలతో.. కాగితం పొరలతో తయారు చేసిన పెన్నులకు మందపాటి అట్టతో రూపొందించిన క్యాప్ ఉంచిన పెన్నులను రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ ఉన్నతాధికారులు జిల్లాల వారీగా నిర్వహిస్తున్న వివిధ శిక్షణ కార్యక్రమాల్లో పాల్గొంటున్న ఉపాధ్యాయులకు ఉచితంగా అందజేస్తున్నారు. ప్యాడ్‌తో పాటు పేపర్ పెన్నులను ఇస్తూ.. పర్యావరణ పరిరక్షణకు నడుం బిగిస్తున్నారు. ప్రత్యేకంగా పేపర్ పెన్నుల ఉత్పత్తిదారులకు ఆర్డర్ ఇచ్చి పెన్నులు తయారు చేయిస్తున్నారు. వీటిని వాడిన తరువాత పడేస్తే అవి మట్టిలో కలిసిపోతాయి. మరో విశేషం ఏమిటంటే.. ఆ పెన్నుల వెనుక భాగంలో అమర్చిన చిన్న గొట్టంలో నవ ధాన్యాలు, వివిధ దినుసులు, పూల మొక్కల విత్తనాలను అమర్చారు. బీన్స్, సన్‌ఫ్లవర్, మెంతులు తదితర విత్తనాలను కూడా అమర్చుతున్నారు. పెన్నును వాడి పారేసిన తరువాత ఇంటి పెరట్లోనో, రోడ్డు పక్కన మట్టిలోనో పారవేస్తే పెన్ను భూమిలో కరిగిపోయి.. అందులోని విత్తనాలు మొలకెత్తుతాయి. ప్రస్తుతం బల్క్ ఆర్డర్లపై తయారు చేస్తున్న ఈ ఎకో ఫ్రెండ్లీ పెన్నును కేవలం రూ.20కే కొనుగోలు చేయవచ్చు. గురువారం గుంటూరు నగరంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి శిక్షణ కార్యక్రమానికి వచ్చిన ఉపాధ్యాయులకు ఎకో ఫ్రెండ్లీ పెన్నులను విద్యాశాఖ అధికారులు పంపిణీ చేశారు. -
భారీగా తగ్గనున్న, ఫ్రిజ్ లు, టీవిల ధరలు
-
అత్తమామల సర్ప్రైజ్కు.. కొత్త అల్లుడు షాక్
-
హైదరాబాద్ అల్లుడు.. భీమవరం మామ.. 173 రకాలతో..
సాక్షి, భీమవరం(పశ్చిమ గోదావరి): గోదావరి జిల్లాలంటేనే వెటకారానికి, మమకారానికి పెట్టింది పేరు. గోదావరి వాసుల అతిథి మర్యాదలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. సంక్రాంతి పండుగ సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా భీమవరానికి చెందిన వ్యాపారవేత్త తటవర్తి నాగభద్రిలక్ష్మీనారాయణ(బద్రి)–సంధ్య దంపతులు తమ అల్లుడు చవల పృథ్వీగుప్తకు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 173 రకాల వంటలతో శనివారం విందు భోజనం పెట్టి అబ్బుర పరిచారు. సేమ్యదద్దోజనం, పెసర పునుకుల పలావు, కొబ్బరి పలావు, పెసర వడలు, తమలపాకు బజ్జీ, వంకాయ బజ్జీ, స్వీట్స్‌లో శనగపప్పు బూరెలు, పాకం గారెలు, ఎర్రనూక హల్వా, ఆకు పకోడి, సగ్గుబియ్యం వడలు వంటి రకాలతో పాటు వివిధ పండ్లు, పొడులు, అప్పడాలు, వడియాలు, బిర్యానీలు, పచ్చళ్లు, వేపుళ్లు, పప్పు కూరలు, ఆకు కూరలతో పాటు పలు రకాల ఐస్‌క్రీమ్స్ వడ్డించగా, వీటిలో ఎక్కువ శాతం ఇంటిలోనే తయారు చేయించడం విశేషం. చదవండి: ఎత్తిపోతలకు గట్టిమేలు.. సీఎం జగన్ కీలక ఆదేశాలు -
వీటిని ఎక్కువ కాలం వాడుతున్నారా?.. అయితే డేంజర్లో పడ్డట్టే!
డాబాగార్డెన్స్(విశాఖ దక్షిణ): మనం రోజూ ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు ఇంట్లో వివిధ వస్తువులను వినియోగిస్తుంటాం. వాటిని ఎంత కాలం ఉపయోగించాలనే విషయంపై చాలా మందికి అవగాహన లేదు. దీంతో ఎక్కువ కాలం వినియోగిస్తూనే ఉంటాం. కాలపరిమితి ముగిసిన వాటిని వాడితే ప్రమాదం పొంచి ఉంది. వీటితో పాటు వాడుకలో లేని వస్తువులను ఇంట్లోనే కుప్పలుగా వదిలేస్తుంటారు. వాటిల్లోనూ క్రిములు, బ్యాక్టీరియా వృద్ధి చెంది.. మనకు అనారోగ్య సమస్యలు తెచ్చి పెడతాయి. అలాంటి వాటిని సరైన సమయంలో మార్చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. ఉదయం లేవగానే పళ్లను శుభ్రం చేసుకునే బ్రష్ నుంచి రాత్రి పడుకునేందుకు వినియోగించే తలదిండు వరకు ఎలా ఉపయోగించాలి.. ఎప్పుడు మార్చాలి అనే విషయాలు తెలుసుకుందాం. చదవండి: నిజంగా ఏలియన్ల గుట్టు సముద్రాల్లో ఉందా? రెండింటి మధ్య లింకేంటి? మంచినీటి సీసా ఇంట్లో వినియోగించే మంచి నీళ్ల సీసాలు, వాటర్ క్యాన్ల విషయంలో ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలి. తరచూ వాటిని శుభ్రం చేసుకోవాలి. లేకపోతే అడుగు భాగంలో నాచు పట్టే వీలుంటుంది. మంచినీటి సీసాలను మాత్రం మూడు, నాలుగు నెలలకోసారి మార్చాలి. వీటితో పాటు మార్కెట్లో అప్పటికప్పుడు తాగేందుకు కొనుగోలు చేసే నీటి సీసాలను తిరిగి ఇంట్లో వాడడం హానికరం. పొపుల పెట్టె వంటింట్లో పప్పు దినుసులు వేసే డబ్బాలను తరచూ శుభ్రం చేసుకోవాలి. ఓ సారి వేసిన సరకు అయిపోగానే..డబ్బాలను మళ్లీ శుభ్రం చేసుకుని కొత్త సరకు వేసుకోవాలి. అంతేగాని నీటితో శుభ్రం చేయకుండా అలా ఏడాది పొడవునా సరకులు వేస్తూ ఉండకూడదు. అలా వేస్తే అందులో ఉండే కొన్ని బ్యాక్టీరియాలు సరకుల్లో చేరే వీలుంటుంది. వీలైతే ఏడాదికోసారి డబ్బాలను మార్చి కొత్తవి ఏర్పాటు చేసుకోవడం మంచిది. ఇంట్లో పెంచుకునే మొక్కలు ఇంట్లోని కుండీల్లో పెంచుకునే మొక్కల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. కుండీల్లో చెత్త వేయకూడదు. నీరు నిల్వ లేకుండా చూసుకోవాలి. లేకపోతే దోమలు వృద్ధి చెందే వీలుంటుంది. సాక్స్‌లు, దువ్వెన కాళ్లకు ధరించే సాక్స్‌లను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి. కాలపరిమితి ముగిసిన వెంటనే పాతవాటిని మార్చి..కొత్తవి ఉపయోగించాలి. ఇంట్లో పాడైన చెప్పులు, బూట్లను బయట పారేయాలి. లేకపోతే క్రిములు వృద్ధి చెందే వీలుంటుంది. నిత్యం తల దువ్వేందుకు వినియోగించే దువ్వెన విషయంలోనూ శుభ్రత పాటించాలి. పాడైన, పళ్లు సరిగా లేని దువ్వెనను వినియోగించకూడదు. టూత్‌బ్రష్ ప్రతి ఒక్కరూ ఉదయాన్నే వినియోగించే టూత్ బ్రష్‌ను తప్పనిసరిగా ప్రతి మూడు నుంచి నాలుగు నెలల్లోపు మార్చాలి. బ్రష్ పాడవకపోయినా.. దానిని ఎక్కువ కాలం వినియోగిస్తే..పళ్లకు ఇబ్బంది కలగొచ్చు. చిన్న పిల్లల బ్రష్‌ల విషయంలో మరింత జాగ్రత్త అవసరం. బ్రష్‌పై ఉండే కుచ్చు పాడైన వెంటనే కాలంతో సంబంధం లేకుండా మార్చేయాలి. పాడైన బ్రష్‌లతో కొందరు ఇంట్లోని వస్తువులను శుభ్రం చేస్తుంటారు. అలాంటి వాటిల్లోనూ క్రిములు చేరే వీలుంటుంది. అందుకే వినియోగంలో లేని వాటిని బయట పాడేయాలి. తలదిండులు చాలా మంది ఇంట్లో మంచాలపై ఉండే దుప్పట్లు, దిండుకవర్లను మాత్రమే సకాలంలో శుభ్రం చేస్తూ.. అప్పుడప్పుడు కొత్తవి మార్చుతుంటారు. కానీ దిండ్లను మార్చరు. నిత్యం వినియోగించే దిండ్లపై సూక్ష్మక్రిములు వేగంగా వృద్ధి చెందుతాయి. అవి మన తలలోకి చేరడంతో దురద, ఇతర సమస్యలు వస్తాయి. అందుకే కొంతకాలం వాడిన తర్వాత వాటిని మార్చుకోవాలి. లోదుస్తులు మనం ధరించే లోదుస్తులను క్రమం తప్పకుండా ఉతికి ఆరేసిన తర్వాతే ధరించాలి. వీలైతే వేడి నీటితో శుభ్రం చేసుకోవడం ఉత్తమం. అలా చేయని పక్షంలో కనీసం ఇస్త్రీ అయినా చేసి ధరించాలి. అప్పుడే వాటిల్లో ఉండే క్రిములు చనిపోతాయి. లోదుస్తుల్లో క్రిములు చాలా వేగంగా వ్యాప్తి చెందుతాయి. వాటితో మనకు తామర, గజ్జి వంటి చర్మ వ్యాధులు సోకే వీలుంటుంది. పాడవకపోయినా.. లోదుస్తులను కూడా ఏడాదికోసారి మార్చేయడం మంచిది. -
వాఫీ డే .. ప్రత్యేకత ఏంటో తెలుసా ?
హైదరాబాద్: పెద్దలు కాఫీలను ఇష్టపడితే చిన్న పిల్లలు వాఫీలను ఇష్టపడుతారు. అందుకే ప్రతీ ఏడు జులై 3న వాఫీ డేను నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది డ్యూక్ ఆధ్వర్యంలో హైదరాబాద్ నగరంలో వాఫీ డే వేడుకలు నిర్వహించారు. వాఫీ రుచులను ప్రతిబింబించేలా పలు కార్యక్రమాలను చేపట్టింది. క్షేత్రస్థాయిలో కార్యక్రమాలతోపాటు డిజిటల్ , రేడియో మాధ్యమాల ద్వారా వాఫీ డే ప్రచారాన్ని డ్యూక్ నిర్వహిస్తోంది. వాఫీ డే స్పెషల్ డ్యూక్స్ బ్రాండ్ బిస్కట్స్.. మొదటిసారిగా 1999 జూలై 3న వాఫీని మార్కెట్లోకి తీసుకొచ్చింది. బేకరీ ఐటమ్స్ ప్రేమికులను ఎంతగానో ఆకట్టుకున్న వాటిలో వాఫీ కూడా ఒకటిగా నిలిచింది. అందుకే వాఫీ మార్కెట్లోకి వచ్చిన రోజును ‘వాఫీ డే’గా జరుపుతున్నారు. 9 రుచుల్లో డ్యూక్స్ వాఫీ 9 రకాల రుచుల్లో లభిస్తోంది. క్రీమ్‌తో నిండిన వాఫీలు చిరువేడుకల్లో, ప్రయాణాల్లో తమకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాయి. రవి ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ (ఆర్ఎఫ్పీఎల్) ఆధ్వర్యంలో డ్యూక్స్ బ్రాండ్ పేరుతో వాఫీలు ప్రపంచవ్యాప్తంగా ప్రజల ఆదరాభిమానాలు అందుకుంటోంది. -
ఏప్రిల్ 1 నుంచి ధరలు పెరిగేవి ఇవే!
కొత్త ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ 1 నుంచి ప్రారంభం కాబోతోంది. ఈ కొత్త ఆర్థిక సంవత్సరంలో పలు రోజువారీ వస్తువులు మీ ప్యాకెట్‌కు చిల్లు పెట్టబోతున్నాయి. ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ పార్లమెంట్ ముందు ప్రవేశపెట్టిన ప్రతిపాదనలు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ నేపథ్యంలో ధరలు పెరగబోతున్న వస్తువుల జాబితా.... కార్లు, మోటార్‌సైకిళ్లు మొబైల్ ఫోన్లు సిల్వర్, గోల్డ్ కూరగాయలు, పండ్ల రసాలు సన్‌గ్లాసస్ పర్ఫ్యూమ్స్, టాయిలెట్ వాటర్స్ సన్‌స్క్రీన్, సన్‌ట్యాన్, మానిక్యూర్, పెడిక్యూర్ ప్రిపరేషన్లు ప్రిపరేషన్స్ ఫర్ ఓరల్ డెంటర్ హైజీన్, పౌండర్లు, డెంటల్ ఫ్లోస్ ట్రక్కు, బస్సు ర్యాడికల్ టైర్లు సిల్క్ ఫ్యాబ్రిక్స్ ఫుట్‌వేర్ కలర్డ్ జెమ్స్ స్టోన్స్ డైమాండ్స్ ఇమిటేషన్ జువెల్లరీ స్మార్ట్ వాచ్‌లు, వేరబుల్ డివైజ్‌లు ఎల్సీడీ, ఎల్ఈడీ టీవీ ప్యానల్స్ ఫర్నీచర్, దుప్పట్లు ల్యాంప్‌లు చేతి గడియారాలు, జేబు గడియారాలు, గోడ గడియారాలు ట్రైసైకిళ్లు, స్కూటర్లు, పెడల్ కార్లు, డాల్స్, టోయస్ వీడియో గేమ్ కన్సోల్స్ స్పోర్ట్స్, అవుట్డోర్ గేమ్స్ పరికరాలు స్విమ్మింగ్ పూల్స్ సిగరెట్, ఇతర లైటర్లు, క్యాండిల్స్ కైట్స్, వెజిటేబుల్ ఆయిల్స్ ఎంత మొత్తంలో పెరగబోతున్నాయి... టీవీలు 5 శాతం మొబైల్ ఫోన్లు 5 శాతం సిల్వర్ ధరలు 3 శాతం ఫుట్‌వేర్ ధరలు 5 శాతం ఫోన్ బ్యాటరీ ధరలు 5 శాతం బంగారం ధరలు 3 శాతం అయితే పెట్రోల్, డీజిల్ ధరలు రెండు రూపాయలు తగ్గనున్నాయి. ఎక్సైజ్ డ్యూటీ తగ్గించడంతో వీటి ధరలు తగ్గనున్నాయి. -
ప్రధాని చేతుల మీదుగా ఐటీఎంఎస్!
► నవంబర్ 28న ‘మెట్రో’తో పాటు ప్రారంభింపజేయాలని యోచన సాక్షి, హైదరాబాద్: ట్రాఫిక్ ఉల్లంఘనులను కట్టడి చేయడం.. స్వైర ‘విహారం’చేసే నేరగాళ్లకు చెక్ పెట్టడం.. వాహనాల సగటు వేగాన్ని పెంచి, ట్రాఫిక్ జామ్‌లు లేకుండా చేయడం.. వంటి లక్ష్యాలతో ఏర్పాటవుతున్న అత్యాధునిక వ్యవస్థ ‘ఇంటెలిజెంట్ అండ్ ఇంటిగ్రేటెడ్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టం (ఐటీఎంఎస్)’అతి త్వరలో అందుబాటులోకి రానుంది. హైదరాబాద్‌లో ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం చూపే ఈ వ్యవస్థను నవంబర్ 28న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభించాలని అధికారులు యోచిస్తున్నారు. ఆ రోజున హైదరాబాద్‌లో ఓ సదస్సుకు హాజరవుతున్న మోదీ చేతుల మీదుగా మెట్రో రైలును ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. పనిలో పనిగా ఐటీఎంఎస్‌ను కూడా ప్రారంభింపజేయాలని యోచిస్తున్నారు. ఈ మేరకు పనులను అక్టోబర్ 31 నాటికి పూర్తిచేసి, ట్రయల్ రన్ నిర్వహిం చాలని.. లోటుపాట్లేమైనా ఉంటే అధికారిక ప్రారంభం నాటికి సరిచేయాలని నిర్ణయించారు. రూ.100 కోట్ల వ్యయంతో.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ సమస్యను పరిష్కరిం చడంతోపాటు ఉల్లంఘనులను నియంత్రించే లక్ష్యంతో రూ.100 కోట్లతో ఐటీఎంఎస్‌ను చేపట్టారు. దీనిని తొలిదశలో నగరంలోని 250 జంక్షన్లలో ఏర్పాటు చేస్తున్నారు. ఇది పూర్త యితే ట్రాఫిక్ నిర్వహణ, పరిశీలన మొత్తం కమిషనరేట్ కేంద్రంగా పనిచేసే ట్రాఫిక్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ (టీ–సీసీసీ) నుంచే జరుగుతుంది. రాత్రివేళల్లోనూ పనిచేసే 16 మెగాపిక్సెల్ సామర్థ్యమున్న కెమెరాలను ఈ వ్యవస్థలో ఉపయోగిస్తున్నారు. ఈ స్థాయి పరికరాలు ఉపయోగించడం దేశంలోనే తొలిసారి కావడం గమనార్హం. ‘ప్లేటు’మారితే పట్టేస్తుంది! నేరగాళ్లు, ఉల్లంఘనులు పోలీసుల నుంచి తప్పించుకోవడానికి తమ వాహనాలకు ఇతర వాహనాల నంబర్లను పెట్టుకుంటూ ఉంటారు. కానీ ఐటీఎంఎస్ వ్యవస్థలోని ‘ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రీడింగ్ సిస్టం (ఏఎన్పీఆర్)’అలా ఒకే నంబర్‌తో తిరిగే 2 వేర్వేరు వాహ నాలను గుర్తిస్తుంది. ఆ వాహనం ప్రయాణించే ముందు జంక్షన్లలో ఉన్న క్షేత్రస్థాయి పోలీసులకు సమాచారం అందించి అప్రమత్తం చేస్తుంది. ట్రాకింగ్ కూడా..: ఐటీఎంఎస్ వ్యవస్థ ద్వారా నగరవ్యాప్తంగా సంచరించే వాహ నాలను ట్రాక్ చేయవచ్చు. సీసీ కెమెరాలు ఆయా ప్రాంతాల్లో సంచరించే ప్రతి వాహ నాన్ని నంబర్‌తో సహా చిత్రీకరించి సర్వర్‌లో నిక్షిప్తం చేస్తాయి. తద్వారా మొత్తం వీడియో దృశ్యాలన్నీ చూడాల్సిన అవసరం లేకుండా... కేవలం నంబర్‌ను నమోదు చేయడం ద్వారా నేరుగా ఆ వాహనం ప్రయాణించిన/తిరిగిన ప్రదేశాలను క్షణాల్లో తెలుసుకోవచ్చు. ‘ఆగిపోతే’అప్రమత్తం చేస్తుంది.. కీలక, ఇరుకైన ప్రాంతాల్లో వాహ నాలేవైనా మరమ్మతులకు వచ్చి నిలిచి పోతే (బ్రేక్‌డౌన్ అయితే).. ఆ వాహ నాలను గుర్తించి అధికారులకు సమాచార మిచ్చేందుకు ఐటీఎంఎస్లోని ‘ఇన్సిడెంట్ మేనేజ్మెంట్ సిస్టం (ఐఎంఎస్)’ తోడ్పడుతుంది. తద్వారా తగిన సహాయం అందించడంతోపాటు ట్రాఫిక్‌ను నియం త్రించే అవకాశం ఉంటుంది. ఆగాల్సిన పనిలేకుండా.. రద్దీ వేళల్లో ట్రాఫిక్ జామ్‌ల కంటే రెడ్ సిగ్నల్స్‌తో ఇబ్బంది ఎక్కువ. ప్రతి జంక్షన్‌లోనూ ఆగుతూ వెళ్లాల్సి వస్తుంది. ఈ పరిస్థితిని నివా రించేందుకు అన్ని జంక్షన్లను అనుసం ధానించి.. ట్రాఫిక్ సిగ్నల్స్‌ను సింక్రనైజ్ చేస్తారు. దీనివల్ల ఏదైనా జంక్షన్లో రెడ్ సిగ్నల్‌తో ఆగిన వాహనాలు.. తర్వాతి జంక్షన్లో నేరుగా ముందుకు కదిలేలా సిగ్నల్స్ మారుతుంటాయి. అత్యవసర వాహనాలకు ‘గ్రీన్ చానల్’.. అత్యవసర పరిస్థితుల్లో ఉన్నవారిని ఆస్పత్రులకు తరలించే అంబులెన్సులు తరచూ ట్రాఫిక్‌లో ఇరుక్కుపోతుంటాయి. ఇక వీవీఐపీలకు ట్రాఫిక్ జామ్ సమస్య లేకుండా ట్రాఫిక్‌ను నియంత్రించాల్సి ఉంటుంది. ఇలాంటి సమయంలో పనికివచ్చే ప్రత్యేక పరికరాలను అందుబాటులోకి తెస్తున్నారు. వీటిని ఆయా అంబులెన్సులు, వీవీఐపీల వాహనాలకు అమర్చుతారు. ఆ వాహనాలు ఏదైనా జంక్షన్‌కు 200 మీటర్ల సమీపంలోకి రాగానే వారి మార్గానికి అనుగుణంగా గ్రీన్ సిగ్నల్ పడుతుంది. ‘వీఎంఎస్’లతో నిరంతరం సందేశాలు ఏదైనా మార్గంలో ప్రయాణిస్తున్న వాహనదారులకు ముందున్న చౌరస్తా, రహదారిలో ట్రాఫిక్ స్థితిగతులను ఎప్పటికప్పుడు తెలిపేలా ‘వేరియబుల్ మెసేజ్ సైన్‌బోర్డులు (వీఎంఎస్)’ను ఏర్పాటు చేయనున్నారు. ట్రాఫిక్ తక్కువగా ఉండే ప్రత్యామ్నాయ మార్గాలనూ దానిలో సూచిస్తారు. ఇక కీలక ప్రాంతాల్లో ‘ఎమర్జెన్సీ కాల్ బాక్స్ (ఈసీబీ)’లను ఏర్పాటు చేస్తారు. అత్యవసర సమయాల్లో వాటి ద్వారా ఫిర్యాదులు చేయవచ్చు, సహాయం కోరవచ్చు. ఉల్లంఘనులకు చెక్ వాహనచోదకుల్లో క్రమశిక్షణ పెంచడంతో పాటు ఉల్లంఘనులను కట్టడి చేయడానికి ఐటీఎంఎస్ తోడ్పడుతుంది. ఈ వ్యవస్థలోని కెమెరాలు వాటంతట అవే ఆయా ఉల్లంఘనుల వాహనాలను ఫొటో తీస్తాయి. సర్వర్ ఆధారంగా ఈ–చలాన్ సైతం ఆటోమేటిగ్గా ఆ వాహనచోదకుడి చిరునామాకు చేరిపోతుంది. -
విలేజ్ మాల్స్‌లో మూడు రకాల సరుకులే..
– డీఎస్ఓ తిప్పేనాయక్ వెల్లడి కర్నూలు(అగ్రికల్చర్): చౌక దుకాణాల్లో డిసెంబర్ నెల నుంచి మార్కెట్ ధర కంటే 20 శాతం తక్కువ ధరకు మూడు రకాల సరుకులు మాత్రమే పంపిణీ చేయనున్నారు. చౌక దుకాణాలను విలేజ్ మాల్స్‌గా మార్చి గ్రామీణ ప్రజలు ఎక్కువగా వినియోగించే సరుకులను ప్రయోగాత్మకంగా పంపిణీ చేయనున్నట్లు డీఎస్ఓ తిప్పేనాయక్ తెలిపారు. 5రకాల సరుకులు ఇవ్వాల్సి ఉందని.. అయితే డిసెంబర్ నెలలో వేరుశనగ విత్తనాలు, కందిపప్పు పెసరపప్పు మాత్రమే పంపిణీ చేస్తున్నామని, వీటిని కిలో ప్యాకెట్లలో ఇస్తామన్నారు. ఎండుమిర్చి పౌడరు, అయోడైజ్డ్ ఉప్పు పంపిణీ చేయాలని భావించినా సాధ్యం కాలేదన్నారు. వేరుశనగ విత్తనాలు, కందిపప్పు కిలో ప్యాకెట్లు రెండు లక్షల ప్రకారం సిద్ధం చేస్తున్నామని, పెసర పప్పు ప్యాకెట్లు మాత్రం లక్ష ప్యాకెట్లు సిద్ధం చేయిస్తున్నామన్నారు. డిమాండ్ ఉంటుందో లేదో అనే ఉద్దేశంతో లక్ష ప్యాకెట్లు సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. ఇది విజయవంతం అయితే జనవరి నుంచి కార్డుదారులందరికీ ఇస్తామన్నారు. విధిగా సరుకులు తీసుకోవాలనే నిబంధన లేదని.. కావాల్సిన వారు మాత్రమే తీసుకోవచ్చన్నారు. -
లలితాదేవికి మహాభోగ నివేదన
దుర్గాడ (గొల్లప్రోలు) : స్థానిక ఉమా రామలింగేశ్వరస్వామి ఆలయంలో ఆదివారం దుర్గాష్టమిని పురస్కరించుకుని లలితాదేవికి 108 రకాలతో తయారు చేసిన పిండివంటలతో మహాభోగ నివేదన చేశారు. గ్రామంలోని మహిళలు వీటిని తయారుచేసి ప్రసాదంగా అందజేశారు. ఆలయ పండితుడు చెరుకూరి వీరబాబు మాట్లాడుతూ గ్రామం సుభిక్షంగా ఉండాలని, అందరికీ ఆహారం, పాడిపంటలు సమృద్ధిగా కలగాలని కోరుతూ ఈ భోగ నివేదన చేసినట్టు తెలిపారు. అమ్మవారికి సోమవారం పండ్లతో, మంగళవారం పూలతో అభిషేకం చేయనున్నట్టు చెప్పారు. -
పిండ ప్రదానం.. వస్తువులు మాయం
– దోపిడీకి గురవుతున్న పిండ ప్రదాన కత్రువు భక్తులు – అరకొరగా వస్తువుల అందజేత – పూర్తి స్థాయి సామగ్రి కోసం అదనంగా చెల్లింపు శ్రీశైలం (జూపాడుబంగ్లా): తరతరాల కుటుంబ బాంధవ్యాలకు ప్రతీకమైన పిండ ప్రదానానికి పుష్కరాల్లో ఎంతో ప్రత్యేకత ఉంది. తమను వీడి పోయిన ఆత్మీయులకు 12 సంవత్సరాలకోసారి వచ్చే పుష్కరాల్లో భక్తిశ్రద్ధలతో పిండ ప్రదానం చేస్తారు. ఈ రోజుల్లో పితదేవతలు నదుల్లో ఉంటారనే విశ్వాసం ఉంది. భక్తుల నమ్మకాన్ని కొందరు దోచుకుంటున్నారు. పుష్కరాల్లో తమ పితృదేవతలకు పిండ ప్రదానం చేసే వస్తువులు సరిగా లేకుండానే చేయాల్సి వస్తోంది. పిండప్రదాన కార్యక్రమం నిర్వహించేందుకు పసుపు, కుంకుమ, వక్కలు, బెల్లం, నెయ్యి ఐదు గ్రాములు, మూడు అగరవత్తులు, 30గ్రాముల నల్లనువ్వులు, పావుకిలో వరిపిండి, గంధం 10 గ్రాములు, కర్పూరం నాలుగు బిళ్లలు, తమలపాకులు 10, విస్తరాకులు 4, అరటిపండ్లు 12 అవసరం ఈ సామగ్రిని పొదుపులక్ష్మి మహిళలు రూ.50 విక్రయించేలా ఏర్పాట్లు చేశారు. అందులో పిండప్రదాన క్రతువుకు అవసరమైన అన్నిరకాల వస్తువులు లేకపోవటంతో భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కిట్లులోలేని వస్తువులు కావాలంటే అదనంగా పొదుపు మహిళలు మొత్తాన్ని వసూళ్లు చేస్తున్నట్లు భక్తులు పేర్కొంటున్నారు. డబ్బులు చెల్లించలేని భక్తులు పొదుపు మహిళలు ఇచ్చిన కిట్టులో ఉన్న వస్తువులతోనే పిండప్రదానాన్ని మమ అనిపిస్తున్నారు. పిండ ప్రదానం వస్తువులపై అవగాహన ఉన్న భక్తులు దబాయిస్తుండటంతో మిగిలిన వస్తువులను ఇస్తున్నారు. రోజుకు రూ.2.25లక్షల అమ్మకాలు: పిండప్రదానికి అవసరమైన వస్తువులతో కూడిన కిట్లను దేవస్థానం వారు 30 మంది పొదుపు మహిళల ద్వారా విక్రయిస్తున్నారు. ఒక్కో కిట్టు రూ.50 చొప్పున రోజుకు ఒక్కో పొదుపు మహిళ కనీసం 150 కిట్లను విక్రయిస్తున్నారు. ఈలెక్కన రోజుకు రూ.2.25లక్షల అమ్మకాలు జరుగుతున్నాయి. లింగాలగట్టు దిగువ పుష్కరఘాటులో రోజుకు కనీసం 4,500 మంది భక్తులు పిండప్రదానాలు చేస్తున్నారు. పిండప్రదానం చేసే ఒక్కోభక్తుని నుంచి పూజారులు నిర్ణీత ధర రూ.300ల చొప్పున వసూళ్లు చేస్తున్నారు. దీంతో రోజుకు రూ.13.50 లక్షల మేర పిండప్రదానాల ద్వారా బ్రాహ్మణులకు ఆదాయం సమకూరుతుంది. -
క్రీడా సామగ్రి పంపిణీ
నెన్నెల : నెన్నెల హైస్కూల్లో ఉపాధ్యాయుడిగా పని చేసి కీర్తిశేషులైన పిరంగి రాజయ్య స్మారకార్థంగా ఆయన మనువడు భట్టు హరీశ్ హైస్కూల్ విద్యార్థులకు రూ.16 వేలతో క్రీడా సామగ్రిని పంపిణీ చేశారు. ఈ క్రీడా సామగ్రిని ఎంపీపీ కళ్యాణి విద్యార్థులకు మంగళవారం అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ కళ్యాణి మాట్లాడుతూ సమాజంలో ఆర్థికంగా ఉన్న వారు సామాజిక సేవా కార్యక్రమాలు చేయడం అభినందనీయమని అన్నారు. భవిష్యత్‌లో విద్యార్థులకు మరిన్నీ సేవా కార్యక్రమాలు చేస్తామని దాత భట్టు హరీశ్ పేర్కొన్నారు. ప్రస్తుతం హైస్కూల్లో పని చేస్తున్న తన మేనమామ పీడీ సిరంగి గోపాల్ కోరడంతోనే ఈ క్రీడాసామగ్రిని అందించినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా హరీశ్‌ను జెడ్పీటీసీ కొడిపె భారతి, కో ఆప్షన్ సభ్యులు ఇబ్రహీం, సర్పంచ్ ఆస్మా బేగం, ఎంఈఓ శ్రీధర్‌స్వామి, ఉపాధ్యాయులు, నాయకులు, గ్రామస్తులు అభినందించారు. -
స్ప్రింగ్ కార్నివాల్
నగరంలోని షాపింగ్ ప్రియులకు ఓ సరికొత్త అనుభూతినిచ్చింది బంజారాహిల్స్ లామకాన్‌లో శనివారం నిర్వహించిన ‘స్ప్రింగ్ కార్నివాల్’. ఫుడ్, మ్యూజిక్, వస్త్రాలు, యాక్సెసరీస్, జ్యువెలరీ, హ్యాండీక్రాఫ్ట్స్, ఆర్గానిక్ వెరైటీలెన్నో కొలువుదీరిన ఈ ఫ్లీ మార్కెట్ విశేషంగా ఆకట్టుకుంది. నగరవాసులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. నచ్చిన ఐటెమ్స్‌ను ముచ్చటగా కొనుక్కున్నారు. -
నో.... మిస్సమ్మ!
సమ్‌థింగ్ స్పెషల్ మాంచెస్టర్ (ఇంగ్లండ్)కు చెందిన మిస్ వెస్ట్... షాపింగ్ చేయడం అంటే ఇష్టం. అందులో భాగంగా రకరకాల ఐటమ్స్‌ను సేకరించడం అంటే కూడా బోలెడంత ఇష్టం. అలా ఏకంగా 5,000 రకాల స్పైసీ గర్ల్స్ ఐటమ్స్‌ను సేకరించింది. ఇందుకోసం తన పొదుపు మొత్తాలను కూడా వినియోగించేది. 29 సంవత్సరాల వెస్ట్ తన 11వ ఏట నుంచే ఇలా ఆడపిల్లలకు సంబంధించిన వస్తువులను సేకరిం చడం ప్రారంభించింది. కొత్తగా వచ్చిన ఏ వస్తువును ‘మిస్’ చేసేది కాదు. ‘‘మొదట్లో సరదాగా ఈ పని చేసినా తరువాత సీరియస్‌గా చేయడం ప్రారంభించాను’’ అంటుంది వెస్ట్. నచ్చిన వస్తువులు మార్కెట్లో దొరకకపోతే ఆన్లైన్ మార్కెట్లో కూడా కొనుగోలు చేసేది. మిస్ వెస్ట్ అభిరుచి ఊరకే పోలేదు. గిన్నిస్‌బుక్‌లో కూడా ఎక్కింది. తాజా విషయం ఏమిటంటే, తాను అనేక ఏళ్లుగా సేకరించిన వస్తువులతో లండన్‌లో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేస్తోంది వెస్ట్. శుభం! -
సీఎం మంజూరు పత్రం ఇచ్చినా...
ఈ ఫొటోలో కనిపిస్తున్న వ్యక్తి పేరు ప్రవీణ్‌కుమార్. సీఎం కేసీఆర్ ఇటీవల వరంగల్‌లో పర్యటించిన సందర్భంగా అర్హులకు పింఛన్లు, ఆహార భద్రత కార్డులు అందజేశారు. లక్ష్మీపురానికి చెందిన ప్రవీణ్‌కుమార్ ఆహార భద్రత కార్డుకు అర్హుడని ప్రకటించారు. మంజూరు పత్రం ఈనెల 9న సీఎం చేతుల మీదుగా అందుకున్నాడు. అయితే శుక్రవారం జాబితాలో ప్రవీణ్‌కుమార్ పేరు లేకపోవడంతో ఆశ్చర్యపోయాడు. సీఎం మంజూరు అయినట్లు ఇచ్చారు.. ఇప్పుడేమో అర్హుల జాబితాలో పేరు లేకపోవడంతో కంగుతిన్నాడు. దీంతో వెంటనే శనివారం వరంగల్ తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లి మళ్లీ దరఖాస్తు చేసుకున్నాడు. - వరంగల్ -
'ఆహార భద్రత' కోసం ఆందోళన
ఆహారభద్రత కార్డులు, సరుకుల కోసం నిజామాబాద్ జిల్లాలోని బిచ్కుంద మండల గ్రామస్తులు గురువారం సాయంత్రం తహశీల్దార్ కార్యాలయం ఎదుట గురువారం ఆందోళన చేశారు. అర్హులైన లబ్ధిదారులకు ఆహార భద్రత కార్డులు మంజూరు చేయడం లేదని వారు వాపోయారు. ఆహార భద్రత కార్డలు మంజూరు చేసిన వారికి సైతం సరుకులు ఇవ్వడంలేదని వారు ఆరోపించారు. ప్రభుత్వం స్పందించి అర్హులకు కార్డులు మంజూరు చేయాలని, కార్డులున్న వారికి రేషన్ సరుకులు అందజేయాలని బిచ్కుంద మండల గ్రామస్తులు డిమాండ్ చేశారు. ఈ ధర్నాకు స్థానిక కాంగ్రెస్ నాయకులు మద్దతు తెలిపారు. -
చింతచిగురు... రుచుల పొగరు!!
ఓ పట్టాన ఏదీ తిననంటూ మారాం చేసే పిల్లలున్నారా? ఆ తల్లి చెంత చింతచిగురుండగా ఏల చింత? ఇకపై అంతా నిశ్చింత! లొట్టలేసుకుని తింటారంతా!! చింతచిగురు పప్పు చేస్తే ఆ వంట ఓ క్లాసిక్. చింతచిగురుతో చేపలు వండితే అదో ఎథ్నిక్... నాన్‌వెజ్ ప్రియుల కోసం మటన్ కలిపినా... వెజ్ తినేవాళ్ల కోసం మీల్మేకర్ మిక్స్ చేసినా... చింతచిగురు వంటతో పెరుగుతుంది రుచుల విగరు. చింతచిగురు టేస్టు ఎంత గొప్పదంటే... చింత చచ్చినా పులుపు ఛస్తుందో లేదోగానీ... దాని తాలూకు రుచులు మాత్రం చచ్చినా చావవు... అదీ చిగురు విగరు తాలూకు పొగరు.రైసూ, పచ్చడీ, పొడీ అంటూ కొత్త కొత్త రుచులు ట్రై చేయండి... ఆలస్యమెందుకు, చింత వదిలి... చిగురుతో ఐటమ్స్ వండేయండి. చింతచిగురు మటన్ కూర కావలసినవి: నూనె - టేబుల్ స్పూను; ఆవాలు - టేబుల్ స్పూను; జీలకర్ర -టేబుల్ స్పూను; ఎండు మిర్చి - నాలుగు; గరం మసాలా - టీ స్పూను; ఉల్లితరుగు - పావు కప్పు; పసుపు - చిటికెడు; అల్లం వెల్లుల్లి పేస్ట్ - టీ స్పూను; కొబ్బరి తురుము - టీ స్పూను; మటన్ - అర కేజీ; చింతచిగురు - అర కేజీ; ధనియాల పొడి - టీ స్పూను; పుదీనా - చిన్న కట్ట; ఉప్పు - తగినంత; కొత్తిమీర - ఒక కట్ట తయారీ: బాణలిలో కొద్దిగా నూనె వేసి, కాగాక ఆవాలు, జీలకర్ర, ఎండు మిర్చి, గరం మసాలా వేసి వేయించాలి పుదీనా ఆకు జత చేసి మెత్తగా అయ్యేవరకు ఉడికించాలి ఉల్లి తరుగు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలిపి కొద్దిగా ఉడికించాలి కొబ్బరి తురుము, ధనియాల పొడి, మటన్, ఉప్పు వేసి బాగా కలిపి కొద్దిగా నీళ్లు జత చేసి మెత్తగా అయ్యేవరకు ఉడికించాలి (అవసరమనుకుంటే కుకర్‌లో ఉడికించవచ్చు) మటన్ ఉడికిన తర్వాత చింతచిగురు జత చేసి, బాగా కలిపి తడి పోయేవరకు ఉడికించాలి కొత్తిమీరతో గార్నిష్ చేసి వడ్డించాలి. చింతచిగురుచిత్రాన్నం కావలసినవి: నూనె - అర కప్పు; చింత చిగురు - 2 కప్పులు; ఆవాలు - టీ స్పూను; ఎండు మిర్చి - 7; పచ్చి మిర్చి - 6; ఉప్పు - తగినంత; మినప్పప్పు - టీ స్పూను; సెనగపప్పు - 2 టీ స్పూన్లు; ఇంగువ - చిటికెడు; కరివేపాకు - 2 రెమ్మలు; జీడిపప్పు పలుకులు - 4 టేబుల్ స్పూన్లు; అన్నం - 8 కప్పులు తయారీ: ఒక పాన్‌లో కొద్దిగా నూనె వేసి వేడయ్యాక చింత చిగురు వేసి బాగా కలిపి మూత పెట్టాలి ఉప్పు వేసి మరోమారు కలిపి మూత పెట్టి ఐదు నిమిషాలు ఉడికించి, దింపి, చల్లారాక, మిక్సీలో వేసి మెత్తగా చేయాలి చిన్న బాణలిలో నూనె వేసి కాగాక, ఆవాలు, మినప్పప్పు, సెనగపప్పు, పచ్చి మిర్చి తరుగు, కరివేపాకు, ఎండు మిర్చి, ఇంగువ వేసి వేయించాలి పెద్ద పళ్లెంలో అన్నం వేసి బాగా పరిచి, అందులో వేయించి ఉంచుకున్న పోపు, మెత్తగా చేసుకున్న చింతచిగురు వేసి కలపాలి జీడిపప్పు పలుకులతో గార్నిష్ చేయాలి. మీల్ మేకర్ చింతచిగురు కూర కావలసినవి: నూనె - 3 టీ స్పూన్లు; జీలకర్ర - అర టీ స్పూను; కరివేపాకు - రెండు రెమ్మలు; ఉల్లి తరుగు - అర కప్పు; అల్లం వెల్లుల్లి పేస్ట్ - 2 టీ స్పూన్లు; పచ్చి మిర్చి తరుగు - 2 టీ స్పూన్లు; పసుపు - చిటికెడు; మీల్ మేకర్ - 2 కప్పులు (సుమారు రెండు గంటలు నానబెట్టి, నీరు తీసేయాలి); చింతచిగురు - కప్పు; జీలకర్ర పొడి - టీ స్పూను; ధనియాల పొడి - టీ స్పూను; ఉప్పు - తగినంత; కారం - టీ స్పూను తయారీ: బాణలిలో కొద్దిగా నూనె వేసి కాగాక జీలకర్ర, కరివేపాకు, ఉల్లి తరుగు, పచ్చి మిర్చి, తరుగు, పసుపు వేసి వేయించి మూత ఉంచాలి ఉడికిన తర్వాత మూత తీసి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేవరకు వేయించాలి నానబెట్టుకున్న మీల్ మేకర్ జతచేయాలి ఉప్పు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, కారం వేసి బాగా కలిపి మూత ఉంచి, సుమారు ఐదు నిమిషాలు ఉడికించాలి చింతచిగురు జత చేసి, ఆకు మెత్తపడే వరకు ఉడికించి, దించాలి ఇది చపాతీలలోకి బాగుంటుంది. చింతచిగురు వంకాయ కూర కావలసినవి: చింతచిగురు - కప్పు; కారం - టీ స్పూను; వెల్లుల్లి రేకలు - 2; ఎండుకొబ్బరి తురుము - 2 టీ స్పూన్లు; ఉప్పు - తగినంత; వంకాయలు - పావు కేజీ (చిన్న ముక్కలుగా తరగాలి); ఉల్లితరుగు - అర కప్పు; పసుపు - చిటికెడు పోపు కోసం: నూనె - టీ స్పూను; మినప్పప్పు - అర టీ స్పూను; సెనగపప్పు - అర టీ స్పూను; ఆవాలు - అర టీ స్పూను; జీలకర్ర - అర టీ స్పూను; ఎండు మిర్చి - 3; కరివేపాకు - 2 రెమ్మలు తయారీ: చింతచిగురును శుభ్రం చేసి, కడిగి నీడలో ఆరబోయాలి మిక్సీ జార్లో చింతచిగురు, కారం, వెల్లుల్లి రేకలు, ఎండుకొబ్బరి తురుము, ఉప్పు వేసి మెత్తగా చేసి, పక్కన ఉంచాలి బాణలిలో కొద్దిగా నూనె వేసి కాగాక మినప్పప్పు, సెనగపప్పు వేసి వేయించాలి ఆవాలు, జీలకర్ర, ఎండు మిర్చి ముక్కలు, పసుపు, కరివేపాకు వేసి మరో మారు వే యించాలి ఉల్లి తరుగు జత చేసి గోధుమరంగులోకి వచ్చేవరకు వేయించాలి వంకాయ ముక్కలు వేసి బాగా కలిపి మూత ఉంచాలి ముక్కలు ఉడుకుపడుతుండగా, చింతచిగురు పేస్ట్ వేసి, వంకాయ ముక్కలకు పట్టేలా కలిపి సుమారు ఐదు నిమిషాలు ఉడికించి దించేయాలి వేడి వేడి అన్నంలో వడ్డిస్తే రుచిగా ఉంటుంది. చింతచిగురు చేపల పులుసు కావలసినవి: చేపలు - అర కే జీ; పసుపు - అర టీ స్పూను; ఉప్పు - తగినంత; కారం - టీ స్పూను; నూనె - 4 టీ స్పూన్లు; ఉల్లి తరుగు - అర కప్పు; పచ్చి మిర్చి తరుగు - 2 టీ స్పూన్లు; మెంతి కూర - అర కప్పు; అల్లం వెల్లుల్లి పేస్ట్ - 3 టీ స్పూన్లు; చింతపండు రసం - 3 టీ స్పూన్లు; చింతచిగురు - కప్పు; గరం మసాలా పొడి - టీ స్పూను తయారీ: ఒక పాత్రలో చేపలు, పసుపు, ఉప్పు, కారం వేసి కొద్దిసేపు ఊరనివ్వాలి బాణలిలో కొద్దిగా నూనె వేసి కాగాక, ఉల్లి తరుగు, పచ్చి మిర్చి తరుగు వేసి గోధుమరంగులోకి వచ్చేవరకు వేయించాలి మెంతి కూర వేసి వేయించాక, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేవరకు కలపాలి ఊరబెట్టిన చేపలను జత చేసి జాగ్రత్తగా కలిపి మూతపెట్టి ఐదు నిమిషాలు ఉడికించాలి చింతపండు రసం, కొద్దిగా నీళ్లు వేసి మూత పెట్టి మరో ఐదు నిమిషాలు ఉడికించాలి చింతచిగురు వేసి కొద్దిసేపు ఉడకనివ్వాలి గరంమసాలా పొడి వేసి కలిపి రెండు నిమిషాలు ఉడకనిచ్చి దించేయాలి. చింతచిగురు పొడి కావలసినవి: చింతచిగురు - కప్పు; నూనె - టీ స్పూను; వెల్లుల్లి రేకలు - 2; పల్లీలు - 4 టీ స్పూన్లు; సెనగపప్పు - 2 టీ స్పూన్లు; ఎండు మిర్చి - 8; ధనియాలు - 2 టీ స్పూన్లు; ఉప్పు - తగినంత; తయారీ: చింత చిగురును శుభ్రం చేసి నీళ్లలో బాగా కడిగి, బయటకు తీసి, నీడలో ఆరబెట్టాలి బాణలిలో నూనె వేసి కాగాక వెల్లుల్లి రేకలు వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించాలి పల్లీలు, సెనగపప్పు, ఎండు మిర్చి వేసి రెండు నిమిషాలు వేయించాలి చివరగా ధనియాలు జత చేసి వేయించి దింపి, చల్లార్చాలి అదే బాణలిలో కొద్దిగా నూనె వేసి కాగాక ఆరబెట్టుకున్న చింత చిగురు వేసి పొడి పొడిలాడే వరకు వేయించి, దించేయాలి మిక్సీలో ముందుగా వేయించి ఉంచుకున్న పల్లీల మిశ్రమం, ఉప్పు వేసి మెత్తగా చేయాలి వేయించి ఉంచుకున్న చింత చిగురు జత చేసి మరోమారు తిప్పి పొడి చేసుకోవాలి వేడి వేడి అన్నంలో, నెయ్యి జత చేసుకుని తింటే రుచిగా ఉంటుంది.