డాయ్ సుగానో ఫొటోగ్రాఫర్ తీసిన ఫొటో
న్యూయార్క్ : నల్ల జాతీయుడు ‘‘జార్జ్ ఫ్లాయిడ్’’ మరణంతో అమెరికా అట్టుడుకుతోంది. దేశవ్యాప్తంగా నిరసన జ్వాలలు భగ్గుమంటున్నాయి. జార్జ్‌కు న్యాయం జరగాలంటూ నిరసనకారులు ఉద్యమిస్తున్నారు. జార్జ్ మరణానికి కారణమైన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కొన్నిచోట్ల హింసాత్మక ఘటనలు సైతం చోటుచేసుకున్నాయి. పోలీసులు కూడా ఉద్యమకారులను ఎక్కడికక్కడ నిలువరిస్తూ అరెస్టులు చేస్తున్నారు. అయినప్పటికి ఉద్యమకారులు వెనకడుగువేయటంలేదు. పోలీసుల తుపాకులకు సైతం భయపడకుండా ముందుకు సాగుతున్నారు. ( కాలిపోనివ్వండి, కానీ న్యాయం జరగాలి )
ప్రస్తుతం పోలీసులు, నిరసనకారులు ఎదురుపడ్డప్పుడు తీసిన పలు చిత్రాలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ముఖ్యంగా డాయ్ సుగానో అనే ఫొటోగ్రాఫర్ తీసిన ఫొటో ఒకటి సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. ఓ ఆఫ్రికన్ అమెరికన్ నర్స్ పోలీసుల ముందు మోకాళ్లపై నిల్చుని శాంతియుతంగా లొంగిపోతున్న చిత్రమది. ఈ ఫొటో కారణంగా సదరు నర్సు ప్రపంచ వ్యాప్తంగా ఫేమస్ అయిపోయింది. నెటిజన్లు కూడా ఆమె వ్యవహరించిన తీరును మెచ్చుకుంటూ కామెంట్లు చేస్తున్నారు. ( కర్ఫ్యూను ధిక్కరించి..)
Comments
Please login to add a commentAdd a comment