ప్రస్తుతం కొత్త జంట కాజల్ అగర్వాల్- గౌతమ్ కిచ్లూలు మాల్దీవులో హనీమూన్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. దీవిలోని ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ సందడి చేస్తున్న ఫొటోలను కాజల్ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఇప్పటికే అక్కడ పలు అందమైన ప్రదేశాలలో వీరిద్దరూ తీసుకున్న ఫొటోలను తన అభిమానుల కోసం షేర్ చేస్తున్నారు కాజల్. ఈ ఫొటోలు నెటిజన్‌లను తెగ ఆకట్టుకుంటున్నాయి. తాజాగా భర్తతో అండర్ వాటర్, చేపల మధ్య హనీమూన్‌ను ఎంజాయ్ చేస్తున్న పలు ఫొటోలను కూడా కాజల్ గురువారం ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు. మాల్దీవులలోనే ప్రత్యేకమైన ఈ అండర్ వాటర్‌లో టూ లెవల్ రిసోర్ట్‌లో ఈ కొత్త జంట ఆనందంగా గడుపుతున్నారు. వాటర్ గది, చేపల మధ్య బ్లూ కలర్ సూట్ ధరించిన ఈ ‘చందమామ’ అచ్చం జలకన్యను తలపిస్తోంది. ఈ ఫొటోలకు ఆమె ‘నేను ఈ చేపలను చూస్తున్నానా లేక అవి నన్ను చూస్తున్నాయా’ అనే క్యాప్షన్‌తో షేర్ చేశారు. (చదవండి: హనీమూన్ ఫొటోలు షేర్ చేసిన కాజల్)
(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
తన చిరకాల స్నేహితుడు, ముంబై వ్యాపార వేత్త గౌతమ్ కిచ్లూను అక్టోబర్ 30వ తేదీన కాజల్ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ముంబైలో ఓ ఖరీదైన హోటల్‌లో కేవలం కుటుంబ సభ్యులు, కొంతమంది సన్నిహితుల మద్య వీరి వివాహ వేడుక అంగరంగ వైభవంగా జరింగింది. కాగా ప్రస్తుతం కాజల్ కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఆచార్య’లో మెగాస్టార్ చిరంజీవి సరసన నటిస్తున్నారు. ‘ఆచార్య’తో పాటు ‘పారిస్ పారిస్’, ‘భారతీయుడు 2’, ‘ముంబై సాగా’ వంటి పలు సినిమాల్లో కూడా నటిస్తున్నారు. కాజల్ మాల్దీవుల నుంచి తిరిగి రాగానే కొద్దిరోజుల క్వారంటైన్ అనంతరం షూటింగ్‌లో పాల్గొననున్నట్లు సన్నిహిత వర్గాల నుంచి సమాచారం. (చదవండి: హనీమూన్‌కు వెళుతున్న కొత్త జంట)
Comments
Please login to add a commentAdd a comment