
ఈ ఏడాది బిగ్గెస్ట్ వెడ్డింగ్ ఏదంటే టక్కున విరాట్ కోహ్లి-అనుష్క శర్మల పెళ్లి గురించి చెప్పవచ్చు. ఎన్నాళ్లుగానే ప్రేమలో మునిగితేలుతున్న ఈ జంట ఒకింత రహస్యంగా ఇటలీలోని టస్కనీ పట్టణంలో పెళ్లి చేసుకున్నారు. సన్నిహితుల నడుమ సంబరంగా వీరి పెళ్లి జరిగింది. చూడముచ్చటగా ఉన్న వీరి పెళ్లి ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాను ముంచెత్తుతున్నాయి.
మరి విరుష్క దంపతుల పెళ్లితంతు ముగిసింది. మరీ హనీమూన్‌కు ఎక్కడి వెళుతున్నారంటే.. ఇటలీలోనే పక్కన రోమ్‌లో ప్రణయయాత్ర సాగించాలని ఈ జంట నిర్ణయించిందట. మంగళవారం సాయంత్రం వీరు రోమ్‌లో హనీమూన్‌కు బయలుదేరి వెళ్లారని ఓ బాలీవుడ్ వెబ్‌సైట్ వెల్లడించింది. టీమిండియా దక్షిణాఫ్రికా పర్యటనకు భర్త కోహ్లితో కలిసి అనుష్క వెళ్లనుంది. ఇద్దరు కలిసి కొత్త సంవత్సరం వేడుకలను జరుపుకొనున్నారు. జనవరి తొలివారం అనంతరం ఆమె భారత్‌కు తిరిగివచ్చి మళ్లీ సినిమాలతో బిజీ కానుంది.
Comments
Please login to add a commentAdd a comment