స్టార్ క్రికెటర్ హనిమూన్ ముచ్చట్లు | Rohit Sharma, Ritika Sajdeh in Capri for honeymoon | Sakshi
Sakshi News home page

స్టార్ క్రికెటర్ హనిమూన్ ముచ్చట్లు

Published Wed, Jun 8 2016 2:47 PM | Last Updated on Mon, Sep 4 2017 2:00 AM

స్టార్ క్రికెటర్ హనిమూన్ ముచ్చట్లు

స్టార్ క్రికెటర్ హనిమూన్ ముచ్చట్లు

టీమిండియా స్టార్ బ్యాట్స్ మన్ రోహిత్ శర్మ, రితిక సజదేహ్ దంపతులు హనిమూన్ కు యూరప్ కు వెళ్లారు. గతేడాది డిసెంబర్ లో వీరిద్దరూ పెళ్లిచేసుకున్నారు. వరుస టోర్నమెంట్లతో తీరిలేకుండా గడిపిన రోహిత్ విశ్రాంతి దొరకడంతో యూరప్ లోని కాప్రిలో హనిమూన్ ప్లాన్ చేసుకున్నాడు. తన హనిమూన్ కు సంబంధించిన విషయాలు, ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నాడు రోహిత్.

'ఎట్టకేలకు హనిమూన్ కు సమయం చిక్కింది. మేము ప్రయాణించిన ఎతిహాద్ ఎయిర్ వేస్ విమానంలో సదుపాయాలు సూపర్ గా ఉన్నాయి. లాంగ్ జర్నీ చేసి రోమ్ లో దిగాం. ఎతిహాద్ ఎయిర్ వేస్ సిబ్బంది సేవలతో అలసట తెలియలేదు. కాప్రి అందాలు మంత్ర ముగ్ధులను చేస్తున్నాయ'ని ట్విటర్ లో కామెంట్లు పెట్టాడు. ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ టీమ్ ప్లేఆప్ కు చేరకపోవడంతో రోహిత్ శర్మకు ముందుగానే సెలవులు దొరికాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement