టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఇంటి నుంచి బిగ్ అనౌన్స్‌మెంట్ వచ్చింది. రోహిత్ భార్య రితికా సజ్దే సోషల్‌మీడియా వేదికగా తమ కుమారుడి పేరును వెల్లడించింది. జూనియర్ రోహిత్‌కు 'అహాన్' అని పేరును పెట్టారు. రితికా తన ఇన్‌స్టా పోస్ట్‌లో శాంటా గెటప్‌లో ఉన్న ఫ్యామిలీ ఫోటోను పోస్ట్ చేసింది.
ఈ పోస్ట్‌లోని బొమ్మలపై రిట్స్ (రితికా), రో (రోహిత్ శర్మ), స్యామీ (సమైరా), ఆహాన్ అనే పేర్లు రాసి ఉన్నాయి. రోహిత్ దంపతులకు తొలి సంతానం సమైరా. కాగా, రోహిత్ భార్య రితికా నవంబర్ 15వ తేదీన అహాన్‌కు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. అహాన్ అంటే ఆరంభం అని అర్దం.
ఇదిలా ఉంటే, రోహిత్ శర్మ ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్నాడు. అహాన్ జన్మించడం కారణంగా రోహిత్ తొలి టెస్ట్‌కు దూరంగా ఉన్నాడు. రోహిత్ ప్రస్తుతం ప్రైమ్ మినిస్టర్ ఎలెవెన్‌తో ప్రాక్టీస్ మ్యాచ్ ఆడుతున్నాడు. ఈ మ్యాచ్‌లో రోహిత్ ఓపెనర్‌గా బరిలోకి దిగలేదు.
యశస్వి జైస్వాల్‌కు జతగా కేఎల్ రాహుల్ ఓపెనర్‌గా బరిలోకి దిగాడు. దీని బట్టి చూస్తే రెండో టెస్ట్‌లో రోహిత్ మిడిలార్డర్‌లో వచ్చే అవకాశం ఉంది. యశస్వి-కేఎల్ రాహుల్ తొలి టెస్ట్‌లో మంచి ఓపెనింగ్ భాగస్వామ్యాన్ని నమోదు చేసింది. వారి లయను దెబ్బతీయకూడదనే ఉద్దేశంతో రోహిత్ మిడిలార్డర్‌లో వచ్చే అవకాశం ఉంది.
వార్మప్ మ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్ వర్షం కారణంగా 46 ఓవర్లకు కుదించారు. తొలుత బ్యాటింగ్ చేసిన ప్రైమ్ మినిస్టర్ ఎలెవెన్ 43.2 ఓవర్లలో 240 పరుగులకు ఆలౌటైంది. సామ్ కోన్స్టాస్ (107) సెంచరీతో కదంతొక్కాడు. హన్నో జాకబ్స్ (61) అర్ద సెంచరీతో రాణించాడు. భారత బౌలర్లలో హర్షిత్ రాణా నాలుగు వికెట్లు పడగొట్టాడు. ఆకాశ్‌దీప్ 2, సిరాజ్, ప్రసిద్ద్ కృష్ణ, వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా తలో వికెట్ దక్కించుకున్నారు.
241 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత్ 15 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 68 పరుగులు చేసింది. యశస్వి జైస్వాల్ 40, కేఎల్ రాహుల్ 24 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment