ముంబై: టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ తన భార్య రితికాను ఉద్దేశిస్తూ ఒక ప్రేమ పూర్వక సందేశాన్ని ట్వీటర్‌లో పోస్ట్ చేశాడు. తమ పెళ్లి రోజు సందర్భంగా రితికాను రోహిత్ శర్మ కవితాత్మకంగా కొనియాడాడు. ‘ నువ్వు లేకుండా నేను లేను. నేను ముందుకెళ్లి ప్రయాణంలో నువ్వు లేకుండా జీవితాన్ని ఊహించుకోలేను. ఇంతకంటే ఆనందం మరోటి ఉండదు. ఐ లవ్ యూ’ అని ప్రేమతో కూడిన సందేశాన్ని రోహిత్ ట్వీట్ చేశాడు. అలాగే, తమ పెళ్లినాటి ఫొటోను పోస్ట్ చేశాడు. వైరల్‌గా మారిన ఈ ఫొటోకు నెటిజన్లు తెగ లైక్‌లు కొడుతున్నారు.
రోహిత్ శర్మ-రితికాలు ఒక్కటై నాలుగేళ్లయ్యింది.దాదాపు ఆరేళ్ల డేటింగ్ తర్వాత 2015, డిసెంబర్ 13వ తేదీన ఈ జంట పెళ్లి బంధంతో ఒక్కటైంది. ఇప్పుడు వీరికి ఒక పాప. ఆమె పేరు సమైరా. గత కొంతకాలంగా రోహిత్ శర్మ పూర్తి స్వింగ్‌లో ఉన్నాడు. అటు పరిమిత ఓవర్ల క్రికెట్‌తో పాటు టెస్టుల్లోనూ సత్తాను చాటుతూ రికార్డులు కొల్లగొడుతున్నాడు. ఇటీవల దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు సిరీస్ ద్వారా ఈ ఫార్మాట్‌లో ఓపెనర్‌గా అరంగేట్రం చేసిన రోహిత్ తన బ్యాటింగ్ పవర్ చూపించాడు. తాను టెస్టులకు పనికి రానన్న వారికి బ్యాట్‌తో సమాధానం చెప్పాడు.
Can’t imagine my life moving forward without you. Nothing can be better than this. I love you @ritssajdeh ❤️😍 pic.twitter.com/RIHcWqoL48
— Rohit Sharma (@ImRo45) December 13, 2019
Comments
Please login to add a commentAdd a comment