Indv s Aus: రెండోసారి తండ్రి కాబోతున్న రోహిత్‌!.. కెప్టెన్‌గా అతడే ఉండాలి! | Is Rohit-Ritika To Welcome 2nd Child Reason Behind Star Set To Miss 1st Test Vs Aus | Sakshi
Sakshi News home page

Indv s Aus: రెండోసారి తండ్రి కాబోతున్న రోహిత్‌!.. కెప్టెన్‌గా అతడే ఉండాలి!

Published Thu, Nov 7 2024 1:48 PM | Last Updated on Thu, Nov 7 2024 3:01 PM

Is Rohit-Ritika To Welcome 2nd Child Reason Behind Star Set To Miss 1st Test Vs Aus

టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ఆస్ట్రేలియాతో తొలి టెస్టుకు దూరం కానున్నట్లు గత కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే, అందుకు గల కారణమేమిటన్నది ఇంత వరకు స్పష్టం కాలేదు. ఈ నేపథ్యంలో తాజాగా ఆసక్తికర అంశం తెరమీదకు వచ్చింది. పితృత్వ సెలవుల కారణంగానే హిట్‌మ్యాన్‌ ఆసీస్‌తో ఆరంభ మ్యాచ్‌లకు దూరం కానున్నట్లు సమాచారం.

రెండోసారి తండ్రి కాబోతున్న రోహిత్‌!
అవును.. రోహిత్‌ శర్మ రెండోసారి తండ్రి కాబోతున్నాడట. అతడి భార్య రితికా సజ్దే త్వరలోనే తమ రెండో బిడ్డకు జన్మనివ్వబోతున్నట్లు తెలుస్తోంది. మాజీ క్రికెటర్‌ అభినవ్‌ ముకుంద్‌ జియో సినిమాతో మాట్లాడుతూ ఈ విషయాన్ని ధ్రువీకరించాడు. పెటర్నిటీ లీవ్‌లో ఉన్నందు వల్లే రోహిత్‌ కాస్త ఆలస్యంగా ఆస్ట్రేలియాకు చేరుకోనున్నట్లు వెల్లడించాడు.

స్వదేశంలో చెత్త రికార్డు
ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్‌  ఆరోన్‌ ఫించ్‌ సైతం రోహిత్‌ త్వరలోనే శుభవార్త చెప్పబోతున్నాడనే సంకేతాలు ఇచ్చాడు. కాగా టీమిండియాకు టీ20 ప్రపంచకప్‌-2024 ట్రోఫీ అందించిన కెప్టెన్‌ రోహిత్‌ శర్మ.. ఇటీవల సారథిగా చెత్త రికార్డును రికార్డును మూటగట్టుకున్నాడు. స్వదేశంలో తొలిసారి మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో వైట్‌వాష్‌కు గురైన భారత జట్టు కెప్టెన్‌గా నిలిచాడు.

న్యూజిలాండ్‌తో ఇటీవల బెంగళూరు, పుణె, ముంబై టెస్టుల్లో రోహిత్‌ సారథ్యంలోని టీమిండియా ఓడిపోయింది. ఇక తదుపరి ఆస్ట్రేలియా పర్యటనలో బోర్డర్‌- గావస్కర్‌ ట్రోఫీలో భాగంగా ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ ఆడనుంది. ఇందులో కనీసం నాలుగు గెలిస్తేనే ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ 2023-25 ఫైనల్‌కు భారత్‌ చేరుకుంటుంది.

ఇంతటి కీలకమైన సిరీస్‌లో రోహిత్‌ శర్మ ఆరంభ​ మ్యాచ్‌లకు దూరంగా ఉండనున్నాడన్న వార్తల నడుమ.. భారత క్రికెట్‌ దిగ్గజం సునిల్‌ గావస్కర్‌ ఘాటుగా స్పందించాడు. ఒకవేళ రోహిత్‌కు విశ్రాంతినివ్వాలనుకుంటే ఆసీస్‌తో టెస్టుల్లో జస్‌ప్రీత్‌ బుమ్రానే కెప్టెన్‌గా నియమించాలని సూచించాడు.

ఒకవేళ భార్య ప్రసవం కోసమే అయితే..
ఈ నేపథ్యంలో ఆరోన్‌ ఫించ్‌ స్పందిస్తూ.. గావస్కర్‌ వ్యాఖ్యలతో తాను విభేదిస్తున్నట్లు తెలిపాడు. ‘‘భారత క్రికెట్‌ జట్టుకు రోహిత్‌ శర్మ కెప్టెన్‌.  ఒకవేళ భార్య ప్రసవం కోసం.. అతడు ఇంటిదగ్గరే ఉండాలనుకుంటే.. అంతకంటే అందమైన క్షణాలు ఉండవు.

కాబట్టి అతడు సెలవు తీసుకున్నా మరేం పర్లేదు. అతడికి ఆ హక్కు ఉంది’’ అని పేర్కొన్నాడు. ఒకటీ రెండు మ్యాచ్‌లకు దూరమైనంత మాత్రాన సిరీస్‌ మొత్తానికి కేవలం ఆటగాడిగానే పరిగణించాలనడం సరికాదని గావస్కర్‌ వ్యాఖ్యలను ఫించ్‌ ఖండించాడు.

సమైరాకు చెల్లి లేదంటే తమ్ముడు!
ఇక కివీస్‌తో ముంబై టెస్టు తర్వాత రోహిత్‌ శర్మ మాట్లాడుతూ.. ‘‘నేను ఆస్ట్రేలియాకు ఇప్పుడే వెళ్తానో లేనో చెప్పలేను’’ అని పేర్కొన్నాడు. ఈ పరిణామాల నేపథ్యంలో సమైరాకు చెల్లి లేదంటే తమ్ముడు రావడం కన్‌ఫామ్‌ అంటూ ఫ్యాన్స్‌ నెట్టింట సందడి చేస్తున్నారు. కాగా 2015లో స్పోర్ట్స్‌ మేనేజర్‌ రితికా సజ్దేను రోహిత్‌ వివాహం చేసుకున్నాడు. ఈ జంటకు తొలి సంతానంగా 2018లో కుమార్తె సమైరా జన్మించింది.

చదవండి: #Shreyas Iyer: శ్రేయస్ అయ్యర్ ఊచకోత.. కెరీర్‌లో తొలి డబుల్ సెంచరీ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement