రెండోసారి తండ్రైన రోహిత్ శర్మ.. మగబిడ్డకు జన్మనిచ్చిన రితికా | Team India Captain Rohit Sharma And Wife Ritika Sajdeh Blessed With Baby Boy, Photo Goes Viral | Sakshi
Sakshi News home page

#Rohit Sharma: రెండోసారి తండ్రైన రోహిత్ శర్మ.. మగబిడ్డకు జన్మనిచ్చిన రితికా

Published Sat, Nov 16 2024 7:37 AM | Last Updated on Sat, Nov 16 2024 9:35 AM

Rohit Sharma and Ritika Sajdeh blessed with baby boy

టీమిండియా కెప్టెన్ రోహిత్ శ‌ర్మ మ‌రోసారి తండ్ర‌య్యాడు. అత‌డి భార్య రితికా సజ్దే శుక్రవారం(నవంబర్ 15) పండింటి మ‌గ‌బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చింది. ఈ శుభ‌వార్త‌ను రోహిత్‌- రితికా జోడీ ఇంకా అధికారికంగా అభిమానులతో పంచుకోలేదు. కానీ రోహిత్ శ‌ర్మ అనుచరులు మాత్రం ఈ విష‌యాన్ని ధ్రువీక‌రించారు. వీరిద్దిరికి ఇప్ప‌టికే సమైరా అనే కుమార్తె ఉంది.

ప్రేమించి పెళ్లాడి..
రోహిత్ శ‌ర్మ తన మేనేజర్ అయిన రితికా సజ్దేను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. 2015 డిసెంబరు 13న వీరిద్ద‌రూ వివాహం ఘ‌నంగా జ‌రిగింది. ఆ త‌ర్వాత 2018లో ఈ జోడీకి తొలి సంతానంగా సమైరా జ‌న్మించింది. ఇప్పుడు రెండో సంతానంగా వారసుడు వారి ఇంట్లో అడుగుపెట్టాడు. దీంతో రోహిత్, రితికా జంటకు అభిమానులు సోషల్ మీడియా వేదికగా అభినందనలు తెలుపుతున్నారు.

టీమిండియాకు గుడ్‌ న్యూస్‌..
కాగా రోహిత్‌ శర్మ తన భార్య డెలివరీ కారణంగా ఆసీస్‌తో తొలి టెస్టుకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాడు. జట్టు మొత్తం ఇప్పటికే ఆస్ట్రేలియాకు చేరుకుని ప్రాక్టీస్‌ మొదలు పెట్టగా హిట్‌మ్యాన్‌ మాత్రం భారత్‌లోనే ఉండిపోయాడు. అయితే తన భార్య ప్రసవం ముందుగానే జరగడంతో రోహిత్‌ తొలి టెస్టుకు ముందే జట్టుతో కలిసే అవకాశముంది. పెర్త్‌ వేదికగా నవంబర్‌ 22 నుంచి తొలి టెస్టు ప్రారంభం కానుంది.
చదవండి: తిలక్, సామ్సన్‌ వీర విధ్వంసం
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement