Ind Vs Aus: Will You Marry Me? Rohit's Hilarious Proposal To Fan, Gifts Rose - Sakshi
Sakshi News home page

Rohit Sharma: రితికాకు అన్యాయం చేస్తావా! రెడ్‌రోజ్‌ ఇచ్చి మరీ అతడికి ప్రపోజల్‌.. వీడియో వైరల్‌

Published Mon, Mar 20 2023 11:07 AM | Last Updated on Mon, Mar 20 2023 11:36 AM

Ind Vs Aus: Will You Marry Me Rohit Hilarious Proposal To Fan Gifts Him Rose - Sakshi

రోహిత్‌ శర్మ (PC: Twitter)

India vs Australia, 2nd ODI- Rohit Sharma Viral Video: ఆస్ట్రేలియాతో రెండో వన్డేతో తిరిగి జట్టుతో కలిసిన టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మకు ఓటమి స్వాగతం పలికింది. రోహిత్‌ గైర్హాజరీలో హార్దిక్‌ పాండ్యా సారథ్యంలో భారత జట్టు తొలి వన్డేలో ఘన విజయం సాధించగా.. విశాఖపట్నం మ్యాచ్‌లో మాత్రం ఘోర పరాభవం ఎదురైంది. హిట్‌మ్యాన్‌ కెప్టెన్సీలో స్వదేశంలో వరుస విజయాలతో దూసుకుపోతున్న టీమిండియా కనివినీ ఎరుగని రీతిలో పరాజయం పాలైంది. 

ఈ క్రమంలో రెండో వన్డేలో ఫలితంపై స్పందించిన రోహిత్‌ శర్మ బ్యాటింగ్ వైఫల్యం వల్లే ఇలా జరిగిందని ఓటమిని అంగీకరించాడు. కాగా ప్రస్తుతం మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ 1-1 సమమైంది. ఇక నిర్ణయాత్మక ఆఖరి వన్డే చెన్నై వేదికగా మార్చి 22న జరుగనుంది. దీంతో ఆఖరి మ్యాచ్‌లో గెలుపే లక్ష్యంగా టీమిండియా ముందుకు సాగనుంది.

నన్ను పెళ్లి చేసుకుంటావా?
ఇదిలా ఉంటే.. రోహిత్‌ శర్మ హాస్యచతురత గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆసీస్‌తో రెండో వన్డే నేపథ్యంలో మరోసారి తనలోని హ్యూమర్‌ యాంగిల్‌ బయటకు తీశాడు. వైజాగ్‌ ఎయిర్‌పోర్టులో ఓ అభిమాని భారత జట్టుతో సెల్ఫీ వీడియో తీసుకుంటున్న క్రమంలో రోహిత్ ఊహించని రీతిలో అతడిని సర్‌ప్రైజ్‌ చేశాడు. 

చేతిలో ఎర్రగులాబీతో అతడిని సమీపించిన హిట్‌మ్యాన్‌.. ‘‘తీసుకో.. నీకోసమే ఇది! నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా?’’ అంటూ సదరు ఫ్యాన్‌ను అడిగాడు. దీంతో రెడ్‌రోజ్‌ అందుకుంటూ సంతోషం వ్యక్తం చేసిన అతడు.. రోహిత్‌ నోటి నుంచి ఊహించని మాట రావడంతో ఏం మాట్లాడాలో అర్థంకాక నవ్వుతూ ఉండిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

నీకిది తగునా?
ఈ క్రమంలో నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. ‘‘రోహిత్‌ నీకిది తగునా? రితికాకు అన్యాయం చేస్తావా? ఇదేం బాగోలేదు’’ అంటూ సరదాగా ట్రోల్‌ చేస్తున్నారు. ఇక మరికొంత మంది అభిమానులు.. ‘‘మైదానంలో.. వెలుపలా రోహిత్‌ భయ్యాకు మాత్రమే ఇలా సరదాగా ఉండటం సాధ్యం’’ అని పాత వీడియోలు పంచుకుంటున్నారు.

కాగా బోర్డర్‌- గావస్కర్‌ ట్రోఫీ-2023ని గెలుచుకున్న టీమిండియా ప్రస్తుతం వన్డే సిరీస్‌లోనూ ఆసీస్‌ను ఓడించాలని పట్టుదలగా ఉంది. ఘోర ఓటమి నుంచి త్వరగా కోలుకుని ఆఖరిదైన చెన్నై మ్యాచ్‌పై దృష్టి సారించేందుకు సన్నద్ధమైంది.

చదవండి: Ind Vs Aus: పాపం సూర్య! అందరూ తననే అంటున్నారు.. అతడి తప్పేం లేదు! నిజానికి..
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement