ముంబై: పెళ్లి అనంతరం భార్యతో హనీమూన్‌కు వెళ్లిన నవ వరుడు గుర్రపు స్వారీ చేస్తూ కందపడి ప్రాణాలు కోల్పోయాడు. కట్టుకున్న భార్యకు తీవ్ర విషాదాన్ని మిగిల్చాడు. మహారాష్ట్ర రాయ్‌గఢ్ జిల్లాలోని మాథెరాన్ పర్వత ప్రాంతంలో ఈ ఘటన జరిగింది.
మృతుడి పేరు ఇంతియాజ్ షేక్. వయసు 23 ఏళ్లు. ఇటీవలే వివాహమైంది. ఈ జంట మరో జంటతో కలిసి హనీమూన్‌కు వెళ్లింది. నలుగురు సన్ అండ్ షేడ్ హోటళ్లో దిగారు . అయితే సరదాగా గుర్రపు స్వారీ చేసేందుకు నలుగురూ నాలుగు గుర్రాలపై హోటల్ నుంచి బయల్దేరారు. 70 మీటర్ల దూరం వెళ్లాక ఇంతియాజ్ గుర్రం ఒక్కసారిగా వేగంగా పరుగెత్తింది. దీంతో దానిపై నియంత్రణ కోల్పోయి ఇంతియాజ్ కిందపడిపోయాడు. తలకు తీవ్ర గాయాలయ్యాయి. సృహ కోల్పోయాడు.
ఇంతియాజ్‍ను మొదట మాథెరాన్ మున్సిపల్ కౌన్సిల్ నిర్వహించే బీజే హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. అక్కడి వైద్యుల సూచన మేరకు ఉల్లాస్‌నగర్‌లో ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కానీ ఫలితం లేకపోయింది. తలకు తీవ్ర గాయాల వల్ల అతను ప్రాణాలు కోల్పోయాడని వైద్యులు ప్రకటించారు.
ఇదే తొలిసారి..
ఇలాంటి ఘటనలు ఇప్పటివరకు జరగలేదని పోలీసులు తెలిపారు. గుర్రంపై నుంచి పడి పలువురు గాయపడిన సందర్భాలు ఉన్నాయి కానీ, ప్రాణాలు కోల్పోయిన ఘటన ఇదే తొలిసారి అని చెప్పారు. అయితే గుర్రం వేగంగా ప్రయాణించడం వల్లే అతను కిందపడిపోయాడా? లేక ఇతర కారణాలు ఉన్నాయా అనే విషయం నిర్ధరించుకోవాల్సి ఉందని పోలుసుల పేర్కొన్నారు.
మరోవైపు గుర్రపు స్వారీ చేసే పర్యటకులకు కచ్చితంగా హెల్మెట్ ఇవ్వాలనే నిబంధన ఉంది. కానీ అలా జరగడం లేదని అధికారులు తెలిపారు. కొంతమంది పర్యటకులు హెల్మెట్ ఇచ్చినా ధరించడం లేదని పేర్కొన్నారు. గుర్రాలు సమకూర్చిన వారి తప్పు ఉందని తెలిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
చదవండి: భార్యను హత్య చేసి ఢిల్లీకి పరార్..విచారణలో అతడు..
Comments
Please login to add a commentAdd a comment