
'మల్లన్నసాగర్ తో యుద్ధం మొదలు'
కరీంనగర్: తెలంగాణలో అవినీతి, అసమర్థ పాలన సాగుతోందని మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి విమర్శించారు. మంత్రులకు అధికారం లేక డమ్మీలుగా ఉన్నారని ఆరోపించారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... టీఆర్ఎస్ పాలనకు రెండేళ్లతో హనిమూన్ ముగిసిందన్నారు. మల్లన్నసాగర్ తో యుద్ధం మొదలైందని అన్నారు.
ప్రతిపక్షాలు లేకుండా శాసనసభను కేసీఆర్ నాశసనం చేస్తున్నారని మండిపడ్డారు. టీఆర్ఎస్ పాలనలో హరించుపోయిన ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత మీడియాదే అన్నారు. ప్రాజెక్టుల రీడిజైనింగ్, మిషన్ భగీరథ పథకాల్లో అవినీతిని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు.