పోలీస్ స్టేషన్‌కు పరుగుపరుగున వచ్చిన ఒక యువకుడు తనకు ఇటీవలే పెళ్లయ్యిందని, తన భార్య సినిమాహాల్‌లో తనను వదిలేసి ఎక్కడికో వెళ్లిపోయిందని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించేంతలోనే ఆ యువకుని భార్య పోలీస్ స్టేషన్‌కు వచ్చి, తన వాదన వినిపించింది. దీంతో ఆ పోలీసులకు దిమ్మతిరిగిపోయింది.
ఇంటర్వెల్ సమయంలో..
రాజస్థాన్‌లోని జైపూర్‌లో ఒక విచిత్ర ఉదంతం చోటుచేసుకుంది. పోలీస్ స్టేషన్‌కు వచ్చిన ఒక భర్త తన భార్య కనిపించడం లేదంటూ ఫిర్యాదు చేశాడు. భార్యాభర్తలిద్దలం సినిమా చూసేందుకు థియేటర్‌కు వెళ్లామని, ఇంటర్వెల్ సమయంలో తన భార్య కోసం తినుబండారాలు కొనుగోలు చేసేందుకు బయటకు వెళ్లానని, తిరిగి వచ్చిచూసేసరికి ఆమె కనిపించలేదని తెలిపాడు.
హనీమూన్‌కు వచ్చి..
పోలీసులు అతని ఫిర్యాదు మేరకు అతని భార్య గురించి గాలింపు చేపట్టేంతలో ఆమె స్వయంగా పోలీస్ స్టేషన్‌కు చేరుకుంది. తనకు ఈ పెళ్లి ఏమాత్రం ఇష్టం లేదని, అందుకే థియేటర్‌లో భర్తను వదిలేసి బయటకు వచ్చేశానని తెలిపింది. వివరాల్లోకి వెళితే సీకర్‌కు చెందిన ఒక యువకుడు పెళ్లయిన 7 రోజుల తరువాత తన భార్యతో పాటు హనీమూన్ కోసం జైపూర్ వచ్చాడు. వారు ఒక హోటల్‌లో బసచేశారు. పింక్ స్క్యేర్ మాల్‌లో అతను భార్యలో పాటు సినిమా చూసేందుకు ప్లాన్ చేశాడు. మధ్యాహ్నం 12 గంటల షో చూసేందుకు టిక్కెట్లు బుక్ చేశాడు.
తినుబండారాలు కొనుగోలు చేసి వచ్చేంతలో..
అనంతరం ఇద్దరూ ఆనందంగా సినిమా థియేటర్‌కు వెళ్లారు. సినిమా మధ్యలో అంటే 1:30కి ఇంటర్వెల్ సమయంలో భర్త తినుబండారాలు కొనుగోలు చేసేందుకు బయటకు వెళ్లాడు. అతను తిరిగివచ్చి చూసే సరికి భార్య ఆ సీటులో కనిపించలేదు. వెంటనే అతను థియేటర్‌తో పాటు మాల్ అంతటా వెదికాడు. అయినా ప్రయోజనం లేకపోయింది.
షాక్ అయిన పోలీసులు..
భార్యకు పలుమార్లు ఫోన్ చేశాడు. ఫోన్ స్విచ్ ఆఫ్ అని వచ్చింది. వెంటనే అతను పోలీస్ స్టేషన్‌కు చేరుకుని, భార్య మాయమయ్యిందంటూ ఫిర్యాదు చేశాడు. ఇంతలో ఈ వ్యవహారం మరో మలుపు తిరిగింది. సినిమా హాలు నుంచి పరారైన ఆమె కొద్ది సేపటికి జైపూర్‌లోని షాహ్‌పూర్ పోలీస్ స్టేషన్‌కు చేరుకుంది. తనకు ఈ పెళ్లి అంటే ఇష్టం లేదని, అందుకే థియేటర్‌లో భర్తను విడిచిపెట్టి వచ్చేశానని పోలీసులకు తెలిపింది. పోలీసులు ఈ విషయాన్ని ఫోనులో ఆమె కుటుంబ సభ్యులకు తెలియజేశారు. ఇరు కుటుంబాల వారు ఆమెకు వివాహం విషయంలో నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. పెళ్లయిన 7 రోజులకే కొత్త జంట ఇలా విడిపోవడం స్థానికంగా చర్చాంశనీయంగా మారింది.
ఇది కూడా చదవండి: కొత్త జంట ఎన్ని రోజులకు విడాకులు తీసుకోవచ్చు?
Comments
Please login to add a commentAdd a comment