ఇప్పుడు పూర్తి నమ్మకంతో ఉన్నాను : విద్యుల్లేఖ | Vidyullekha Raman Shares Her Weight Loss Journey | Sakshi
Sakshi News home page

ఇప్పుడు పూర్తి నమ్మకంతో ఉన్నాను : విద్యుల్లేఖ

Published Tue, Jun 23 2020 6:52 PM | Last Updated on Tue, Jun 23 2020 7:59 PM

Vidyullekha Raman Shares Her Weight Loss Journey - Sakshi

తెలుగు, తమిళ సినీ ఇండస్ట్రీలో లేడి స్టార్‌ కమెడియన్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు విద్యుల్లేఖ రామన్‌. బొద్దుగా తనదైన నటనతో అందరి మెప్పించే విద్యుల్లేఖ.. లాక్‌డౌన్‌ సమయంలో తన ఫిట్‌నెస్‌పై దృష్టి సారించారు. అందుకోసం తీవ్రంగా శ్రమించిన విద్యుల్లేఖ.. అసాధారణంగా రీతిలో బరువు తగ్గారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను తాజాగా ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశారు. నకిలీ విశ్వాసం వర్సెస్‌ నిజమైన విశ్వాసం అని పేర్కొన్నారు. జూన్‌ 20 నాటికి 68.2 కిలోల బరువు ఉన్నానని విద్యుల్లేఖ వెల్లడించారు. ఇందుకోసం ఎలాంటి కషాయాలు, ఎటువంటి మాత్రలు వినియోగించలేదని స్పష్టం చేశారు. వారానికి ఆరు సార్లు వ్యాయామం చేశానని, డైట్‌ పాటించానని వెల్లడించారు. (చదవండి : ఆ జ్ఞాపకాలు షేర్‌ చేసిన అనసూయ)

‘నేను అధిక బరువుతో ఉన్నప్పుడు చాలా మంది మీరు ఎంత నమ్మకంగా ఉన్నారు అని అడిగేవారు. అప్పుడు నా ఆత్మ విశ్వాసంపై నాకే అనుమానం కలిగేది. కానీ ఇప్పుడు మాత్రం నా మీద నేను పూర్తి నమ్మకంగా ఉన్నాను. ఎందుకంటే నేను ఊహించని విధంగా నా జీవనశైలి, అలవాట్లను మార్చుకోగలిగాను. మీరు చేయాలని అనుకున్న దానిపై మనసు పెడితే ఏదైనా సాధించవచ్చని గ్రహించాను’ అని విద్యుల్లేఖ పేర్కొన్నారు. 

కాగా, తమిళ నటుడు మోహన్‌ రామన్‌ కుమార్తె అయిన విద్యుల్లేఖ.. చెన్నైలో పుట్టిపెరిగారు. మొదట థియేటర్‌ ఆర్టిస్టుగా రాణించి...ఆపై వెండితెరపై అవకాశాలను అందిపుచ్చుకుంటున్నారు. గౌతమ్‌ మీనన్‌ దర్శకత్వం వహించిన ఎటో వెళ్లిపోయింది మనసు చిత్రంతో వెండితెరపై ఎంట్రీ ఇచ్చిన విద్యుల్లేఖ తనదైన కామెడీ టైమింగ్‌తో నవ్వులు పూయిస్తున్నారు. తెలుగు, తమిళ సినీ పరిశ్రమల్లో లేడి స్టార్‌ కమెడియన్‌గా కొనసాగుతున్నారు. (చదవండి : సాంబార్‌ బుజ్జెమ్మ)

Fake confidence vs. ACTUAL confidence. When I was overweight a frequently asked question by everyone to me was “how are you so confident?”. In retrospect, was I? Or did I just come to terms with the fact that I will be obese all my life? Today I am actually confident of myself because I did the unthinkable and changed my lifestyle and habits. I have come to realise that if you put your mind to it, anything is possible. Sounds cliché, right? But it’s the truth!! You need to be disciplined, workout 6 times a week and follow a balanced diet. There is no secret potion or pill to make the result happen! Just pure hard work. Nothing in life comes easy but when you see result, it’s worth all the sweat and tears. Recorded weight as on 20/06/20 - 68.2kgs #weightlossjourney #weightlosstransformation

A post shared by Vidyu Raman (@vidyuraman) on

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement