
సినిమాల కోసం హీరోహీరోయిన్లు చాలా కష్టపడుతుంటారు. రిలీజ్ టైంలో ఇచ్చే ఇంటర్వ్యూల్లో ఈ విషయాల్ని బయటపెడుతుంటారు. యంగ్ హీరో రామ్ కూడా తన ఒక్క నెలలలో 18 కిలోలు ఎలా తగ్గానో చెప్పుకొచ్చాడు. అయితే తనలా ఎవరూ ప్రయత్నించొద్దని మాత్రం హెచ్చరిస్తున్నాడు. ఇంతకీ రామ్ ఏం చెప్పాడంటే?
(ఇదీ చదవండి: 100 'కేజీఎఫ్'లు కలిపి తీస్తే ఈ సినిమా.. ఓటీటీలోనే బెస్ట్ యాక్షన్ మూవీ)
''డబుల్ ఇస్మార్ట్' కోసం పూరీ జగన్నాథ్ చెప్పిన క్లైమాక్స్ కిక్ ఇచ్చింది. 'ఇస్మార్ట్ శంకర్'లానే ఇందులోనూ షర్ట్ లేకుండా క్లైమాక్స్ చేయాలనుకున్నాం. ఆ పార్ట్ అంతా నవంబరులోనే షూట్ చేయాలి. స్కంద రిలీజైన తర్వాత నాకు 2 నెలలు మాత్రమే సమయముంది. దాంతో వెంటనే బాలిలో ఓ ప్రాంతానికి వెళ్లి అక్కడే నెలరోజులు ఉండి ఫుల్లుగా వర్కౌట్ చేసి బరువు తగ్గాను. ఇలా తక్కువ టైంలో బరువు తగ్గడం ఆరోగ్యానికి ప్రమాదం. నేను చేసినట్లు ఎవరూ ప్రయత్నించొద్దు' అని రామ్ చెప్పుకొచ్చాడు.
రామ్ కాబట్టి హెల్తీ డైట్ ఫాలో అవుతూ నెలలో 18 కిలోలు అంటే.. 86 నుంచి 68 కిలోలకు వచ్చాడు. సాధారణంగా ఇలా ఒకేసారి తగ్గితే మాత్రం శరీరంలో లేనిపోని రోగాలు వచ్చే ప్రమాదముంది. రామ్-పూరీ కాంబోలో ఇస్మార్ట్ శంకర్ మూవీకి సీక్వెల్‌గా తీసిన 'డబుల్ ఇస్మార్ట్'.. ఆగస్టు 15న థియేటర్లలోకి రానుంది. పెద్దగా బజ్ అయితే లేదు. చూడాలి ఎలాంటి ఫలితం అందుకుంటుందో?
(ఇదీ చదవండి: చైతూ-శోభిత లవ్ స్టోరీ.. సీక్రెట్ బయటపెట్టిన శోభిత చెల్లి!)
Comments
Please login to add a commentAdd a comment