రామ్ పోతినేని- పూరి జగన్నాధ్ కాంబోలో వచ్చిన మాస్ ఎంటర్‌టైనర్ డబుల్ ఇస్మార్ట్. అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన ఈ చిత్రం ఇవాళ థియేటర్లలో రిలీజైంది. ఇస్మార్ట్ శంకర్ బ్లాక్‌బస్టర్ హిట్ కావడంతో ఈ మూవీపై కూడా అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. దీంతో ఉదయం నుంచే తెలుగు రాష్ట్రాల్లో సందడి వాతావరణం నెలకొంది. డబుల్ ఇస్మార్ట్ సూపర్ హిట్ అంటూ థియేటర్ల వద్ద రామ్ ఫ్యాన్స్ సంబురాలు చేసుకుంటున్నారు. ఈ మూవీని 2019లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ మూవీకి సీక్వెల్‌గా తెరకెక్కించారు.
మొదటి నుంచే బజ్ ఉన్న మూవీ కావడంతో ఓటీటీ రైట్స్ కోసం భారీస్థాయిలో పోటీ నెలకొంది. ఇప్పటికే డబుల్ ఇస్మార్ట్ ఓటీటీ హక్కులను అమెజాన్ ప్రైమ్ భారీ ధరకు సొంతం చేసుకుంది. దక్షిణాది భాషల్లో డిజిటల్ రైట్స్‌ను రూ.33 కోట్లకు దక్కించుకుంది. అయితే ఒప్పందం ప్రకారం థియేట్రికల్ రన్ తర్వాతే ఈ మూవీని ఓటీటీలో స్ట్రీమింగ్ చేయనున్నారు. అయితే ఈ మూవీ హిందీ వర్షన్ డీల్ ఇంకా పూర్తి కాలేదు.
కాగా.. ఈ చిత్రంలో రామ్‍కు జోడీగా కావ్య థాపర్ హీరోయిన్‍గా నటిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్, షాయాజీ షిండే, బానీ జే, అలీ, గెటప్ శ్రీను, మార్కండ్ దేశ్‍పాండే, ఉత్తేజ్ కీలక పాత్రల్లో నటించారు. ఈ మూవీకి స్టార్ డైరెక్టర్ మణిశర్మ సంగీతం అందించారు.
Comments
Please login to add a commentAdd a comment