Vidyullekha Raman Opens Up About Trolling and Body Shaming - Sakshi
Sakshi News home page

Vidyullekha Raman: లావుగా ఉన్నానని, స్విమ్‌సూట్‌ వేసుకున్నానని నానామాటలన్నారు

Published Sat, Apr 8 2023 6:29 PM | Last Updated on Sat, Apr 8 2023 6:59 PM

Vidyullekha Raman Opens up About Trolling and Body Shaming - Sakshi

డిఫరెంట్‌ డైలాగ్‌ డెలివరీతో ఆకట్టుకునే లేడీ కమెడియన్‌ విద్యుల్లేఖ. వెండితెరపై నవ్వులు కురిపించిన ఆమె 2021లో ప్రియుడు, ఫిట్‌నెస్‌ నిపుణుడు సంజయ్‌ను పెళ్లాడింది. వివాహ అనంతరం వీరు హనీమూన్‌ కోసం మాల్దీవులు వెళ్లారు. ఆ సమయంలో బీచ్‌లో బికినీలో ప్రకృతిని ఎంజాయ్‌ చేస్తూ దిగిన ఫోటోలు షేర్‌ చేయడంతో తనపై చాలా ట్రోలింగ్‌ జరిగింది. ఒక నెటిజన్‌ అయితే ఏకంగా విడాకులు ఎప్పుడు తీసుకుంటున్నారని అడగడంతో ఆమె మనసు నొచ్చుకుంది. డ్రెస్సింగ్‌కు, విడాకులకు ఏమైనా సంబంధం ఉందా? అంటూ అతడిని ఏకిపారేసింది.

తాజాగా బుల్లితెరపై ప్రసారమవుతున్న ఓ షోలో అడుగుపెట్టిన విద్యుల్లేఖ ఆనాటి పరిస్థితులను గుర్తు చేసుకుంటూ ఎమోషనలైంది. 'నేను లావుగా ఉన్నానని అందరూ నన్ను ట్రోల్‌ చేశారు. ఏనుగు, పంది.. ఇలా అన్ని జంతువులతో పోల్చారు. ఎంత లైట్‌ తీసుకున్నా ఏదో ఒక పాయింట్‌లో అది గుచ్చుకుంటుంది. నా హనీమూన్‌లో స్విమ్‌సూట్‌ వేసుకున్నానని.. ఛీ ఇది ఒక అమ్మాయేనా? అని తిట్టిపోశారు' అని పేర్కొంది నటి. అదే షోలో ఉన్న హీరోయిన్‌ కాజల్‌ సైతం స్పందిస్తూ.. నేను గర్భిణీగా ఉన్నప్పుడు కూడా లావెక్కానని ట్రోల్‌ చేశారని గుర్తు చేసింది. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

సీనియర్‌ నటుడు మోహన్‌ రామన్‌ కుమార్తె అయిన విద్యుల్లేఖ.. తెలుగు, తమిళంలో అనేక చిత్రాలు చేసింది. హీరోయిన్‌ ఫ్రెండ్‌ పాత్రలకు చిరునామాగా మారింది. ఎటో వెళ్లిపోయింది మనసు, రామయ్యా వస్తావయ్యా, భలే మంచిరోజు సహా పలు చిత్రాలతో ప్రేక్షకులను మెప్పించింది. ఆ మధ్య వచ్చిన హారర్‌ మూవీ 'రాజుగారి గది'లో కామెడీ పాత్రతో అలరించింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement