vidyulekha raman
-
ఛీ, ఇది ఒక అమ్మాయేనా? పంది, ఏనుగు అని తిట్టారు: విద్యుల్లేఖ
డిఫరెంట్ డైలాగ్ డెలివరీతో ఆకట్టుకునే లేడీ కమెడియన్ విద్యుల్లేఖ. వెండితెరపై నవ్వులు కురిపించిన ఆమె 2021లో ప్రియుడు, ఫిట్నెస్ నిపుణుడు సంజయ్‌ను పెళ్లాడింది. వివాహ అనంతరం వీరు హనీమూన్ కోసం మాల్దీవులు వెళ్లారు. ఆ సమయంలో బీచ్‌లో బికినీలో ప్రకృతిని ఎంజాయ్ చేస్తూ దిగిన ఫోటోలు షేర్ చేయడంతో తనపై చాలా ట్రోలింగ్ జరిగింది. ఒక నెటిజన్ అయితే ఏకంగా విడాకులు ఎప్పుడు తీసుకుంటున్నారని అడగడంతో ఆమె మనసు నొచ్చుకుంది. డ్రెస్సింగ్‌కు, విడాకులకు ఏమైనా సంబంధం ఉందా? అంటూ అతడిని ఏకిపారేసింది. తాజాగా బుల్లితెరపై ప్రసారమవుతున్న ఓ షోలో అడుగుపెట్టిన విద్యుల్లేఖ ఆనాటి పరిస్థితులను గుర్తు చేసుకుంటూ ఎమోషనలైంది. 'నేను లావుగా ఉన్నానని అందరూ నన్ను ట్రోల్ చేశారు. ఏనుగు, పంది.. ఇలా అన్ని జంతువులతో పోల్చారు. ఎంత లైట్ తీసుకున్నా ఏదో ఒక పాయింట్లో అది గుచ్చుకుంటుంది. నా హనీమూన్‌లో స్విమ్‌సూట్ వేసుకున్నానని.. ఛీ ఇది ఒక అమ్మాయేనా? అని తిట్టిపోశారు' అని పేర్కొంది నటి. అదే షోలో ఉన్న హీరోయిన్ కాజల్ సైతం స్పందిస్తూ.. నేను గర్భిణీగా ఉన్నప్పుడు కూడా లావెక్కానని ట్రోల్ చేశారని గుర్తు చేసింది. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. సీనియర్ నటుడు మోహన్ రామన్ కుమార్తె అయిన విద్యుల్లేఖ.. తెలుగు, తమిళంలో అనేక చిత్రాలు చేసింది. హీరోయిన్ ఫ్రెండ్ పాత్రలకు చిరునామాగా మారింది. ఎటో వెళ్లిపోయింది మనసు, రామయ్యా వస్తావయ్యా, భలే మంచిరోజు సహా పలు చిత్రాలతో ప్రేక్షకులను మెప్పించింది. ఆ మధ్య వచ్చిన హారర్ మూవీ 'రాజుగారి గది'లో కామెడీ పాత్రతో అలరించింది. View this post on Instagram A post shared by Vidyullekha / Vidyu Raman (@vidyuraman) -
నిజజీవిత సంఘటనల ఆధారంగా ‘విశ్వామిత్ర’
గీతాంజలి సినిమాతో దర్శకుడి మంచి విజయం సాధించిన రాజ్‌కిరణ్, రెండో ప్రయత్నంగా తెరకెక్కించిన త్రిపుర సినిమాతో ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయారు. దీంతో కొంత గ్యాప్ తీసుకొని ఇప్పుడు మరో డిఫరెంట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నారు. స్వీయ దర్శకత్వంలో నిర్మాతగా మారి విశ్వామిత్ర సినిమాను తెరకెక్కిస్తున్నారు. అమెరికాలో జరిగిన నిజ జీవిత సంఘటన ఆధారంగా థ్రిల్లర్ జానర్లో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. నందిత రాజ్, సత్యం రాజ్, విద్యుల్లేఖ రామన్, అశుతోష్ రానాలు కీలకపాత్రలో నటిస్తున్నారు. రాజ్ కిరణ్ సినిమా బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ సినిమాను మాధవి అద్దంకి, రజనీకాంత్.ఎస్‌లు నిర్మిస్తున్నారు. -
షాక్‌కి గురయ్యా: నటి విద్యుల్లేఖ రామన్
సాక్షి, చెన్నై: క్యారెక్టర్ ఆర్టిస్ట్ విద్యుల్లేఖ రామన్‌కి సోషల్ మీడియాలో షాక్ తగిలింది. ఆమె అఫీషియల్ ఫేస్బుక్ హ్యాకింగ్‌కు గురైంది. విద్యు ఫేస్బుక్ పేజీ మొత్తాన్ని ఫోటోలతోసహా మార్చేసిన హ్యాకర్లు.. రమ్య అనే పేరుతో ఫోటోలు, సమాచారాన్ని అప్లోడ్ చేశారు. దీంతో కంగారుపడిన ఆమె ట్విటర్లో విషయాన్ని తెలియజేశారు. ‘ఆశ్చర్యంతోపాటు భయంగొల్పే అనుభవం. నా పేరుతో ఉన్న ఫేస్బుక్ అకౌంట్, హ్యాకింగ్‌కు గురైంది. నా ఫాలోవర్లను, డేటాను మొత్తం చోరీ చేశారు. ఎవరో నటి పేరిట ఖాతాను రీప్లేస్ చేశారు. ఎలా జరిగిందో తెలీదు. కానీ, నేరస్థుడిని పట్టుకుని తీరాలి’ అంటూ ఆమె ఓ ట్వీట్ చేశారు. వెరిఫైడ్ అకౌంట్ హ్యాక్ కావటమేంటని పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తుండగా, తక్షణమే జోక్యం చేసుకోని అకౌంట్ పునరుద్ధించాలని ఆమె ఫేస్‌బుక్‌కు విజ్ఞప్తి చేశారు. Something bizarre, strange & horrible has happened. My Facebook page Vidyu Raman has been HACKED, HIJACKED & STOLEN with all my 450K followers and made into the page of some actress. No one but me managed my page. I don’t understand how this happened but the culprit will b caught pic.twitter.com/FNyuRHebAW — Vidyu Raman (@VidyuRaman) 4 July 2018 -
బొద్దుగుమ్మ 'బుజ్జిమా' కష్టాలు తీరిపోయాయి!
దేశం కాని దేశంలో హ్యాండ్‌బ్యాగ్, పాస్‌పోర్టు పోగొట్టుకొని.. పీకల్లోతు కష్టాల్లో పడిన తెలుగు, తమిళ చిత్రాల హాస్యనటి విద్యుల్లేఖ రామన్ కష్టాలు తీరిపోయాయి. ఆమెను ఆదుకోవడానికి వియన్నాలోని భారత రాయబార కార్యాలయం ముందుకొచ్చింది. స్వదేశం వచ్చేందుకు ఆమెకు తాత్కాలిక ట్రావెల్ పర్మిట్‌ను జారీచేసింది. ఈ విషయాన్ని ట్విట్టర్లో తెలిపిన విద్యుల్లేఖ.. కష్టకాలంలో తనకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపింది. (చదవండి - చిక్కుల్లో బొద్దుగుమ్మ 'బుజ్జిమా') స్నేహితులతో కలిసి వియన్నాలో విహారానికి వెళ్లిన విద్యుల్లేఖను ఊహించని కష్టాలు చుట్టుముట్టాయి. ఆమె ఉన్న హోటల్ లాబీలో ఆమె హ్యాండ్‌బ్యాగును దొంగలు కొట్టేశారు. దీంతో పాస్‌పోర్టు, క్యాష్ కార్డ్స్, డబ్బు అంతా కోల్పోయి విద్యుల్లేఖ చిక్కుల్లో పడింది. స్నేహితులతో కలిసి ఈ దేశానికి రావడమే తప్పయిందని ట్విట్టర్లో వాపోయింది. ఇదంతా తలరాత అయి ఉంటుందని వైరాగ్యం ప్రకటించింది. వియన్నాలోని భారత రాయబార కార్యాలయాన్ని సంప్రదించడానికి సాయం చేయాలని కోరింది. ఈ క్రమంలో తనకు వెంటనే భారత రాయబార కార్యాలయం సాయం చేసిందని, ఎంతో స్నేహపూర్వకంగా రాయబార సిబ్బంది తనను అర్థం చేసుకున్నారని, ఇది ఎంతో ఆనందం కలిగిస్తున్నదని విద్యుల్లేఖ తాజాగా విదేశాంగమంత్రి సుష్మాస్వరాజ్, పీఎంవోను ట్యాగ్ చేస్తూ సంతోషం వ్యక్తం చేసింది. తనకు జరిగింది చాలా దురదృష్టకరమని, ఈ ఘటనలో తనకు వ్యక్తిగతంగా ఎలాంటి హాని జరగనందుకు కృతజ్ఞురాలై ఉంటానని, తాను సురక్షితంగా ఉన్నానని విద్యుల్లేఖ తెలిపింది. టూరిస్టులు లక్ష్యంగా ఎప్పుడూ దాడులు జరుగుతాయని, వారు ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలని ఆమె తన అనుభవపూర్వకంగా సూచించింది. అల్లు అర్జున్ హీరోగా వచ్చిన 'సరైనోడు' సినిమాలో సాంబారు చబ్బీ బ్యూటీగా, 'రాజుగారి గది' చిత్రంలో బుజ్జిమాగా తమిళ నటి విద్యుల్లేఖ రామన్ తెలుగు ప్రేక్షకులకు చేరువైన సంగతి తెలిసిందే. సీనియర్ నటుడు మోహన్ రామన్ కుమార్తె అయిన విద్యు తమిళ, తెలుగు చిత్రాల్లో హీరోయిన్ ఫ్రెండ్ పాత్రలకు చిరునామాగా మారింది. A big thanks 2 everyone who gave me info and helped me out. The Indian Embassy in Vienna has issued a temporary travel permit 2 travel today — Vidyu (@VidyuRaman) 4 May 2016 .@SushmaSwaraj @PMOIndia the Indian Embassy in Vienna was extremely friendly, understanding and helped me immediately. I am safe. Thank you — Vidyu (@VidyuRaman) 4 May 2016