Actress Vidyullekha Raman's Facebook Account got Hacked and Changed with Another Name and Photos - Sakshi
Sakshi News home page

Published Thu, Jul 5 2018 7:58 AM | Last Updated on Mon, Oct 22 2018 6:10 PM

Vidyu Raman Facebook Account Account - Sakshi

నటి విద్యుల్లేఖ రామన్‌

సాక్షి, చెన్నై: క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌ విద్యుల్లేఖ రామన్‌కి సోషల్‌ మీడియాలో షాక్‌ తగిలింది. ఆమె అఫీషియల్‌ ఫేస్‌బుక్‌ హ్యాకింగ్‌కు గురైంది. విద్యు ఫేస్‌బుక్‌ పేజీ మొత్తాన్ని ఫోటోలతోసహా మార్చేసిన హ్యాకర్లు.. రమ్య అనే పేరుతో ఫోటోలు, సమాచారాన్ని అప్‌లోడ్‌ చేశారు. దీంతో కంగారుపడిన ఆమె ట్విటర్‌లో విషయాన్ని తెలియజేశారు.

‘ఆశ్చర్యంతోపాటు భయంగొల్పే అనుభవం. నా పేరుతో ఉన్న ఫేస్‌బుక్‌ అకౌంట్‌, హ్యాకింగ్‌కు గురైంది. నా ఫాలోవర్లను, డేటాను మొత్తం చోరీ చేశారు. ఎవరో నటి పేరిట ఖాతాను రీప్లేస్‌ చేశారు. ఎలా జరిగిందో తెలీదు. కానీ, నేరస్థుడిని పట్టుకుని తీరాలి’ అంటూ ఆమె ఓ ట్వీట్‌ చేశారు. వెరిఫైడ్‌ అకౌంట్‌ హ్యాక్‌ కావటమేంటని పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తుండగా, తక్షణమే జోక్యం చేసుకోని అకౌంట్‌ పునరుద్ధించాలని ఆమె ఫేస్‌బుక్‌కు  విజ్ఞప్తి చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement