Again Vulgar Videos Shared On Vishnu Priya Facebook Account, Goes Viral - Sakshi
Sakshi News home page

Vishnu Priya: విష్ణుప్రియ ఫేస్‌బుక్‌లో అశ్లీల వీడియోలు కలకలం! ‘ఎందుకిలా చేస్తోంది?’

Published Wed, Nov 2 2022 1:04 PM | Last Updated on Wed, Nov 2 2022 1:39 PM

Again Vulgar Content Video Shared On Vishnu Priya Facebook Account - Sakshi

యాంకర్‌ విష్ణు ప్రియ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. సుడిగాలి సుధీర్‌తో కలిసి ఓ షోకు యాంకర్‌గా వ్యవహరించిన ఆమె ప్రస్తుతం సినిమాలతో బిజీగా మారింది. మరోవైపు నెట్టింట ఫుల్‌ యాక్టివ్‌గా ఉంటోంది. తరచూ తన లేటెస్ట్‌ హాట్‌హాట్‌ ఫొటోలను షేర్‌ చేస్తూ సోషల్‌ మీడియా షేక్‌ చేస్తోంది. ఇదిలా ఉంటే ఇటీవల ఆమె ఫేస్‌బుక్‌ పేజీలో అశ్లీల ఫొటోలు దర్శనం ఇచ్చిన సంగతి తెలిసిందే. అవి చూసి అంత షాక్‌ ఒక్కసారిగా అయ్యారు. విష్ణు ప్రియ ఎంటి ఇలాంటి ఫొటోలు షేర్‌ చేసిందంటూ ఆశ్చర్యపోయారు.

చదవండి: ‘జాతిరత్నాలు’ సమయంలో డైరెక్టర్‌ నిన్ను కొట్టారా? క్లారిటీ ఇచ్చిన ఫరియా

చివరకు తన ఫేస్‌బుక్‌ ఖాతా హ్యాక్‌ అయ్యిందని, తన పేజీని అన్‌ఫాలో చేయాల్సిందిగా ఆమె తన ఫాలోవర్స్‌కు సూచించింది. అయితే అంతా బాగుందని అనుకుంటున్న తరుణంలో మళ్లీ తన పేజీలో న్యూడ్‌ వీడియోలు దర్శనం ఇచ్చాయి. దీంతో తన స్నేహితులు, బంధువుల నుంచి ఆమెకు వరుసగా ఫోన్‌కాల్స్‌ వచ్చాయట. దీనిపై ఆమె స్పందిస్తూ.. ‘ఎందుకు ఇలా అవుతుందో అర్థం కావడం లేదు. ఇలాటే నా స్నేహితులు, బంధువులు ఫోన్‌ చేసి ఫేస్‌బుక్‌లో ఆ వీడియోలు ఎంటని అడుగుతున్నారు. అవి నేను పోస్ట్‌ చేసినవి కాదు.

చదవండి: ‘గాడ్‌ ఫాదర్‌’ ఓటీటీ రిలీజ్‌ డేట్‌ వచ్చేసింది! ఆ రోజు నుంచే స్ట్రీమింగ్‌?

పదే పదే నా అకౌంట్‌ను ఎందుకు హ్యాక్‌ చేస్తున్నారో అర్థం కావడం లేదు, నన్నే ఎందుకు టార్గెట్‌ చేస్తున్నారు’ అంటూ తన స్నేహితుల వద్ద ఆమె వాపోయిందట. కాగా ఆమె ఫేస్‌బుక్‌ పేజీతో తరచూ అశ్లీల వీడియోలు పోస్ట్‌ అవుతూనే ఉన్నాయట, అప్పటి నుంచి ఆమె ఫాలోవర్స్‌ సంఖ్య కూడా పెరిగినట్లు తెలుస్తోంది. అయితే ఇంత జరుగుతున్న విష్ణు ప్రియ ఎందుకు సైలెంట్‌గా ఉంటుందని, ఎందుకు సైబర్‌ క్రైమ్‌ని ఆశ్రయించడం లేదని.. తన పేజీని ఎందుకు డిలిట్‌ చేయడం లేదంటూ నెటిజన్ల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement