
గీతాంజలి సినిమాతో దర్శకుడి మంచి విజయం సాధించిన రాజ్‌కిరణ్, రెండో ప్రయత్నంగా తెరకెక్కించిన త్రిపుర సినిమాతో ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయారు. దీంతో కొంత గ్యాప్ తీసుకొని ఇప్పుడు మరో డిఫరెంట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నారు. స్వీయ దర్శకత్వంలో నిర్మాతగా మారి విశ్వామిత్ర సినిమాను తెరకెక్కిస్తున్నారు. అమెరికాలో జరిగిన నిజ జీవిత సంఘటన ఆధారంగా థ్రిల్లర్ జానర్‌లో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. నందిత రాజ్, సత్యం రాజ్, విద్యుల్లేఖ రామన్, అశుతోష్ రానాలు కీలకపాత్రలో నటిస్తున్నారు. రాజ్ కిరణ్ సినిమా బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ సినిమాను మాధవి అద్దంకి, రజనీకాంత్.ఎస్‌లు నిర్మిస్తున్నారు.