టాలీవుడ్‌ క్రేజీ మూవీ.. అనౌన్స్‌మెంట్‌తోనే అదరగొడుతోంది! | Tollywood Movie Polimera 3 Announcement Goes Trending In Social Media | Sakshi
Sakshi News home page

Polimera 3: పొలిమేర-3 గ్లింప్స్‌ రిలీజ్‌.. సోషల్ మీడియా షేక్‌!

Published Wed, Jul 10 2024 12:48 PM | Last Updated on Wed, Jul 10 2024 1:24 PM

Tollywood Movie Polimera 3 Announcement Goes Trending In Social Media

సత్యం రాజేశ్, బాలాదిత్య, గెటప్ శ్రీను ‍ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం పొలిమేర-2. గతేడాది రిలీజైన ఈ చిత్రం సూపర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఈ చిత్రాన్ని అనిల్ విశ్వనాథ్ డైరెక్షన్‌లో తెరకెక్కించారు. పొలిమేర బ్లాక్ బస్టర్‌ హిట్ కావడంతో సీక్వెల్‌గా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. చిన్న సినిమాగా వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది.

ఇప్పటికే ఈ సిరీస్‌లో వచ్చిన రెండు చిత్రాలు బాక్సాఫీస్‌ను షేక్ చేశాయి. అయితే ఇప్పటికే పార్ట్-3 కూడా ఉంటుందని మేకర్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా పొలిమేర-3ని అధికారికంగా ప్రకటించారు. అనిల్ విశ్వనాథ్ డైరెక్షన్‌లో నందిపాటి వంశీ నిర్మిస్తున్నారు. దీంతో పాటు పొలిమేర-3 గ్లింప్స్‌ రిలీజ్ చేశారు. పొలిమేర-3 అనౌన్స్‌ చేసిన కొద్ది గంటల్లోనే సోషల్ మీడియాలో ప్రభంజనం సృష్టిస్తోంది. ట్విటర్‌లో ఇండియా వ్యాప్తంగా ట్రెండింగ్‌లోకి వచ్చేసింది. ఈ విషయాన్ని పొలిమేర-3 లోడింగ్‌ అంటూ మేకర్స్‌ ట్విటర్‌లో పోస్ట్ చేశారు. దీంతో ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. 
 

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement