Anupama Parameswaran Fake Baby Bump Photos Goes Viral, See Fans Reaction - Sakshi
Sakshi News home page

Anupama Parameswaran: బేబీ బంప్‌తో ట్విస్ట్‌ ఇచ్చిన అనుపమ.. ఫోటో వైరల్‌

Jan 31 2022 3:07 PM | Updated on Jan 31 2022 3:41 PM

Anupama Parameswaran Shares Fake Baby Bump Photos Goes Viral - Sakshi

Anupama Parameswaran Shares Baby Bump Photos Goes Viral: 'ప్రేమమ్‌' సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన మలయాళ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్‌. త్రివిక్రమ్‌ తెరకెక్కించిన అఆ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన అనుపమ తాజాగా రౌడీ బాయ్స్‌ చిత్రంతో ఆకట్టుకుంది. ఇక ఓ వైపు సినిమాలతో బిజీగా ఉంటూనే మరోవైపు సోషల్‌ మీడియాలో తెగ యాక్టివ్‌గా కనిపిస్తుంటుంది ఈ బ్యూటీ. ఎప్పటికప్పుడు తన లేటెస్ట్‌ ఫోటోలు, వీడియోలు షేర్‌ చేస్తూ అభిమానులతో ఎప్పుడూ టచ్‌లో ఉంటుంది.

తాజాగా అనుపమ షేర్‌ చేసిన ఓ ఫోటో నెట్టింట హాట్‌ టాపిక్‌గా మారింది. బేబీ బంప్‌తో ఉన్న ఫోటోను షేర్‌ చేస్తూ చిరునవ్వులు చిందించింది. అనుపమకు పెళ్లి ఎప్పుడు అయ్యింది? ఈ బేబీ బంప్‌ ఏంటి అన్నదే కదా మీ డౌటు. నిజానికి ఇది రియల్‌ బేబీ బంప్‌ కాదు. 2019లో ఓ మలయాళ చిత్రం షూటింగ్‌లో భాగంగా తీసుకున్న ఫోటో. ఇందులో అనుపమ తండ్రి కూడా ఉన్నారు.

కాగా అనుపమ ఈ త్రోబ్యాక్‌ పిక్చర్‌ని షేర్‌ చేయడంతో ప్రస్తుతం ఈ ఫోటో వైరల్‌గా మారింది. నటి, లేడీ కమెడియన్‌ విద్యుల్లేఖ రామన్‌ సైతం ఈ ఫోటోకు స్పందిస్తూ..  'బేబ్‌..ఒక్కక్షణం నేను కంగ్రాట్స్‌ అని టైప్‌  చేయబోతున్నాను' అంటూ కామెంట్‌ చేయగా.. దీనికి అనుపమ ఊప్స్‌ అంటూ ఫన్నీగా బదులిచ్చింది. పలువురు నెటిజన్లు సైతం అనుపమ ఫోటోను చూసి మీరు నిజంగానే ప్రెగ్నెంట్‌ అనుకున్నా అంటూ కామెంట్స్‌ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement