
Kajal Aggarwal Shares First Photo With Baby Bump, Pic Goes Viral: అందాల చందమామ కాజల్ అగర్వాల్ త్వరలోనే తల్లి కాబోతున్న విషయం తెలిసిందే. న్యూ ఇయర్ సందర్భంగా కౌజల్ భర్త గౌతమ్ కిచ్లు ఈ విషయాన్ని అఫీషియల్‌గా అనౌన్స్ చేశాడు. ఈ కొత్త సంవత్సరంలో నీ రాక కోసం ఎదురు చూస్తున్నామంటూ గర్భవతి మహిళ ఎమోజీని క్యాప్షన్‌తో ఓ ఫొటోను షేర్ చేశాడు. దీంతో కాజల్ దంపతులకు అభిమానుల నుంచి పెద్ద ఎత్తున శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.
ఇక భర్త ప్రకటన అనంతరం కాజల్ తొలిసారిగా బేబీ బంప్‌తో ఉన్న ఫోటోను షేర్ చేసింది. ఇది వరకే ప్రెగ్నీన్సీపై వార్తలు వచ్చినా కాజల్ మాత్రం తన బేబీ బంప్‌ను కవర్ చేస్తుండేది. కానీ తాజాగా భర్తతో దిగిన ఓ ఫోటోను షేర్‌చేస్తూ 2022 అంటూ లవ్ సింబల్‌ను యాడ్ చేసింది. ఈ ఫోటోలో కాజల్ బేబీ బంప్ స్పష్టంగా కనిపిస్తుంది. దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.