
లేడీ కమెడియన్ విద్యుల్లేక రామన్.. ప్రియుడు, ఫిట్‌నెస్, న్యూట్రిషన్ నిపుణుడు సంజయ్‌ను వివాహం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం నెట్టింట దర్శనమిచ్చాయి. ఆగస్టు 26న సంజయ్‌ను సీక్రెట్‌గా నిశ్చితార్థం చేసుకున్నట్లు విద్యుల్లేఖ సోషల్ మీడియా వేదికగా ప్రకటించి అందరికి షాక్ ఇచ్చారు. అయితే పెళ్లి తేదీపై మాత్రం ఆమె ప్రస్తావించలేదు. ఈ క్రమంలో నేడు(సెప్టెంబర్ 9) ఈ జంట వివాహ బంధంతో ఒక్కటయ్యారు. కాగా ఇటీవల శరీరాకృతిపై దృష్టి పెట్టిన విద్యుల్లేఖ జిమ్‌లో కసరత్తులు చేసి స్లిమ్‌గా తయారైంది.
చదవండి: ఈ వారం ఎలిమినేట్ అయ్యేది అతడేనా?
ఈ క్రమంలో ఫిట్‌నెస్, న్యూట్రిషన్ నిపుణడైన సంజయ్‌తో ఆమెకు పరిచయం ఏర్పడింది. వారి పరిచయం ప్రేమగా మారడంతో వివాహం వైపు అడుగులు వేశారు. ఈ నేపథ్యంలో ఈ రోజు తమిళ సాంప్రదాయంలో వారి వివాహ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. సినీ పరిశ్రమకు చెందిన నటీనటులు ఈ జంటకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
కాగా కరోనా నిబంధనల మేరకు కొద్దిమంది బంధుమిత్రుల సమక్షంలో వీరి వివాహక వేడుక జరిగినట్లు సన్నిహిత వర్గాల నుంచి సమాచారం. విద్యుల్లేఖ ఇటూ తెలుగు అటూ తమిళంలో తనదైన కామెడీతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. తన నటనతో అందరి మన్ననలను అందుకున్న విద్యుల్లేఖ లేడీ కమెడియన్‌గా ప్రేక్షకుల ఆదరణ పొందుతున్నారు.
చదవండి: RC15 : రామ్‌చరణ్ ధరించిన ఈ కాస్ట్‌లీ వాచ్ ధరెంతో తెలుసా?
Comments
Please login to add a commentAdd a comment