
బాలీవుడ్ మిస్టర్ పర్‌ఫెక్ట్ అమీర్ ఖాన్ మేన కోడలు జాయాన్ మేరీ ఖాన్ నటిగా సినీ ప్రవేశం చేస్తోంది. నెట్‌ఫ్లిక్స్ లాంటి ప్రఖ్యాత సిరిస్ ద్వారా అమీర్ వారసురాలిగా చిత్ర పరిశ్రమకు పరిచయం కానున్నారు. కాగా తాను నటించిన ‘మిసెస్ సీరియల్ కిల్లర్’ నెట్‌ఫ్లిక్స్‌లో శనివారం విడుదలకు సిద్ధమైంది. దీనికి సంబంధించిన ప్రీమియర్ షోను అమీర్ ఇంటి కుటుంబంతో కలిసి వీక్షించారు. ఇంట్లోనే ప్రోజెక్టర్ ద్వారా ఈ షో చూసిన అమీర్.. తన భార్య కిరణ్ రావ్, కూతురు ఇరా ఖాన్తో కలిసి చూసేందుకు సూట్‌తో హజరయ్యాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలను ఇరా తన ఇన్‌స్టాగ్రామలో శనివారం షేర్ చేశారు. (‘ప్రభాస్-అమీర్‌లతో మల్టీస్టారర్ చిత్రం చేయాలి’)
డైరెక్టర్‌గా ఎంట్రీ ఇవ్వనున్న ఆమిర్ కూతురు!
ఇందుకు సంబంధించిన ఫొటోలను ఇరా తన ఇన్‌స్టాగ్రామ్‌లో శనివారం పంచుకున్నారు. ఈ ఫొటోలకు ‘ఇది ప్రారంభం మాత్రమే. నటిగా నీ కెరీర్‌ను ప్రారంభించావు. ఐ లవ్ యూ జయాన్. నీ మొదటి చిత్రం విడుదలైంది నాకు చాలా సంతోషంగా ఉంది. అంతే కాదు నిన్ను చూస్తే గర్వంగా కూడా ఉంది. ఎలాంటి పరిస్థితులోనైనా నీకు అండగా మేము ఉంటాం. హర్రర్ చిత్రంలో నటన చూసి అభిమానులు నటిగా సినీ పరిశ్రమలోకి రెడ్ కార్పెట్ పరిచి ఆహ్వనిస్తారని ఆశిస్తున్నాను. నీతో కలిసి ఈ క్షణాన్ని పంచుకోలేనందుకు చాలా బాధగా ఉన్న .. మా మాట వింటున్నావనే అనుకుంటున్నాం. ఆల్ ద బెస్ట్ జయాన్’ అంటూ ఇన్‌స్టాలో రాసుకొచ్చారు. (మన కథ ముగిసింది: నీతూ కపూర్)
కాగా హర్రర్, థ్రిల్లర్ నేపథ్యంలో సాగే ‘మిసెస్ సీరియల్ కిల్లర్’ శిరీష్ కుందన్ దర్వకత్వం వహించారు. మనోజ్ బాజ్పేయి, జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సిరీయల్ కిడ్నాప్ డ్రామా నేపథ్యంలో సాగుతుంది. ఇందులో అమీర్ మేన కోడలు జయాన్ కిడ్నాప్‌కు గురయ్యే యువతి పాత్రలో కనిపించనుంది. ఇందులో మోహిత్ రైనా కూడా నటిస్తున్నారు. కాగా ప్రస్తుతం అమీర్ చందన్ అద్వైత్ చందన్ రూపోందిస్తున్న లాల్ సింగ్ చందన్‌లో నటిస్తున్న విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment