స్టార్ హీరో కూతురి పెళ్లి.. మొదలైన సందడి..! | Aamir Khan Daughter Ira Khan And Nupur Shikhare Pre-Wedding Festivities Began With Kelvan Ceremony - Sakshi
Sakshi News home page

Ira Khan-Nupur Shikhare Marriage: స్టార్ హీరో ఇంట్లో పెళ్లి సందడి.. రెండు నెలలు ముందుగానే!

Published Sat, Nov 4 2023 12:56 PM | Last Updated on Sat, Nov 4 2023 1:11 PM

Ira Khan and Nupur Shikhare perform Kelvan ceremony of pre-wedding - Sakshi

బాలీవుడ్ స్టార్ హీరో అమిర్ ఖాన్ ఇంట అప్పుడే పెళ్లి సందడి మొదలైంది. ఆయన కూతురు ఐరా ఖాన్.. తన ప్రియుడు నుపుర్ శిఖరేతో గత ఏడాది నవంబర్‌లో నిశ్చితార్థం చేసుకుంది. వచ్చే ఏడాది జనవరిలో వీరి పెళ్లి జరగనుంది. ఈ నేపథ్యంలో రెండు నెలలు ముందుగానే ప్రీ వెడ్డింగ్ వేడుకలు మొదలయ్యాయి. పెళ్లికి ముందు జరిగే సంప్రదాయ వేడుకలో ఇరు కుటుంబాల సభ్యులు పాల్గొని సందడి చేశారు. దీనికి సంబంధించిన పోటోలు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. 

కెల్వన్ వేడుక అంటే.. 

మహారాష్ట్ర సంప్రదాయంలో భాగంగా వివాహానికి ముందు కెల్వన్ వేడుకను జరుపుకుంటారు. ఈ సంప్రదాయం ప్రకారం వధువు, వరుడు తరఫున తల్లిదండ్రులు ఒకరి కుటుంబాలకు మరొకరు ఆహ్వాన పత్రికలను అందజేస్తారు. ఈ వేడుకలో ఒకరికి ఒకరు బహుమతులు ఇచ్చి పుచ్చుకుంటారు. ఈ వేడుకకు ఇరువైపులా బంధువులు, సన్నిహితులు హాజరై వధూవరులకు బహుమతులు అందజేస్తారు.

తాజాగా ఐరా ఖాన్ దీనికి సంబంధించిన ఫోటోలను తన ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది.  కాగా.. కొన్నేళ్ల పాటు డేటింగ్‌లో ఉన్న ఐరా ఖాన్, నుపుర్ శిఖరే గత ఏడాది నవంబర్‌లో నిశ్చితార్థం చేసుకున్నారు. వచ్చే ఏడాది జనవరి 3, 2024న వివాహా బంధంతో ఒక్కటి కానున్నారు. కాగా.. ఐరా  ఖాన్ మానసకి సమస్యలతో బాధపడే వారికి అవగాహన కల్పిస్తోంది. తన తండ్రితో కలిసి ఆత్మహత్యల నివారణకు కృషి చేస్తోంది.


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement