ప్రియుడితో స్టార్ హీరో కూతురి పెళ్లి వేడుక.. ఎప్పుడంటే? | Aamir Khan Daughter Ira And Nupur Shikhare Get Ready To Tie | Sakshi
Sakshi News home page

Aamir Khan Daughter: అమిర్ ఖాన్ కూతురి పెళ్లి.. బిజీగా స్టార్ హీరో!

Published Fri, Dec 29 2023 3:04 PM | Last Updated on Fri, Dec 29 2023 3:56 PM

Aamir Khan Daughter Ira And Nupur Shikhare Get Ready To Tie - Sakshi

బాలీవుడ్ స్టార్ హీరో అమిర్ ఖాన్ పెళ్లిసందడి నెలకొంది. ఆయన కూతురు ఐరా ఖాన్ త్వరలోనే పెళ్లి పీటలెక్కనుంది. ఇప్పటికే ప్రియుడితో ఎంగేజ్‌మెంట్‌ చేసుకున్న ఐరా ఖాన్ వివాహాబంధంలోకి అడుగుపెట్టనుంది. జనవరి 3వ తేదీన నుపుర్ శిఖరేను పెళ్లి చేసుకోనుంది. ఇప్పటితే వీరి వివాహానికి సంబంధించి ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ మొదలయ్యాయి. ఈ జంట వివాహం ముంబై బాంద్రాలోని తాజ్ ల్యాండ్స్ ఎండ్‌లో జరుగనున్నట్లు తెలుస్తోంది. మహారాష్ట్ర సంప్రదాయ వేడుకలో పెళ్లి జరగనుందని నుపుర్ కుటుంబ సభ్యులు వెల్లడించారు.

(ఇది చదవండి: విజయ్‌ మీదకు చెప్పు విసిరిన వ్యక్తి, వీడియో వైరల్‌)
 
అయితే పెళ్లి తర్వాత ఇండస్ట్రీ ప్రముఖుల కోసం రెసెప్షన్ నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. అయితే పెళ్లి తర్వాత రెండు రిసెప్షన్ పార్టీలు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. జనవరి 6 నుంచి 10 తేదీల మధ్య ఢిల్లీతో పాటు జైపూర్‌లోనూ రిసెప్షన్స్‌ ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే అమీర్ ఖాన్ వ్యక్తిగతంగా స్నేహితులు, ఇండస్ట్రీ ప్రముఖులకు ఆహ్వానాలు పంపినట్లు తెలుస్తోంది.కాగా.. అమిర్ ఖాన్ కూతురు ఐరా.. మానసిక రుగ్మతలతో బాధపడుతున్న వారి కోసం తన వంతుగా అవగాహన కల్పిస్తోంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement