pre wedding tour
-
కర్ణాటక తీరం.. ప్రీవెడ్డింగ్ షూట్ గమ్యం! (ఫొటోలు)
-
అంబానీ బుక్ చేసుకున్న క్రూయిజ్‌లో ఒక గదికి ఒక్క రోజుకి ఎన్ని లక్షలో తెలుసా..?
-
స్టార్ హీరో కూతురి పెళ్లి.. మొదలైన సందడి..!
బాలీవుడ్ స్టార్ హీరో అమిర్ ఖాన్ ఇంట అప్పుడే పెళ్లి సందడి మొదలైంది. ఆయన కూతురు ఐరా ఖాన్.. తన ప్రియుడు నుపుర్ శిఖరేతో గత ఏడాది నవంబర్‌లో నిశ్చితార్థం చేసుకుంది. వచ్చే ఏడాది జనవరిలో వీరి పెళ్లి జరగనుంది. ఈ నేపథ్యంలో రెండు నెలలు ముందుగానే ప్రీ వెడ్డింగ్ వేడుకలు మొదలయ్యాయి. పెళ్లికి ముందు జరిగే సంప్రదాయ వేడుకలో ఇరు కుటుంబాల సభ్యులు పాల్గొని సందడి చేశారు. దీనికి సంబంధించిన పోటోలు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. కెల్వన్ వేడుక అంటే.. మహారాష్ట్ర సంప్రదాయంలో భాగంగా వివాహానికి ముందు కెల్వన్ వేడుకను జరుపుకుంటారు. ఈ సంప్రదాయం ప్రకారం వధువు, వరుడు తరఫున తల్లిదండ్రులు ఒకరి కుటుంబాలకు మరొకరు ఆహ్వాన పత్రికలను అందజేస్తారు. ఈ వేడుకలో ఒకరికి ఒకరు బహుమతులు ఇచ్చి పుచ్చుకుంటారు. ఈ వేడుకకు ఇరువైపులా బంధువులు, సన్నిహితులు హాజరై వధూవరులకు బహుమతులు అందజేస్తారు. తాజాగా ఐరా ఖాన్ దీనికి సంబంధించిన ఫోటోలను తన ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. కాగా.. కొన్నేళ్ల పాటు డేటింగ్లో ఉన్న ఐరా ఖాన్, నుపుర్ శిఖరే గత ఏడాది నవంబర్‌లో నిశ్చితార్థం చేసుకున్నారు. వచ్చే ఏడాది జనవరి 3, 2024న వివాహా బంధంతో ఒక్కటి కానున్నారు. కాగా.. ఐరా ఖాన్ మానసకి సమస్యలతో బాధపడే వారికి అవగాహన కల్పిస్తోంది. తన తండ్రితో కలిసి ఆత్మహత్యల నివారణకు కృషి చేస్తోంది. View this post on Instagram A post shared by Ira Khan (@khan.ira) -
ఇప్పుడిదే ట్రెండ్! ఫిక్సయిపోతున్న కొత్త జంటలు.. ఖర్చుకు తగ్గేదేలే!
సిరిసిల్లఅర్బన్: పెళ్లంటే పందిళ్లు.. సందళ్లు తప్పెట్లు.. తాళాలు తలంబ్రాలూ మూడే ముళ్లు.. ఏడే అడుగులు ఇదీ అందరికీ తెలిసిందే.. కానీ ప్రస్తుతం వీటితో పాటు పెళ్లి వేడుకలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. పెళ్లి వేడుకలను చెదరని మధుర జ్ఞాపకంలా జీవితాంతం గుర్తుండి పోయేలా యువతీ యువకులు పెళ్లికి సిద్ధం అవుతున్నారు. ఇందులో భాగంగా ప్రీవెడ్డింగ్ షూట్లకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఎంతలా అంటే సినిమాలకు ధీటుగా చిత్రీకరించేందుకు ఎంత ఖర్చుకైనా వెనకాడడం లేదు. దీనికోసం ప్రత్యేకంగా అనుభవజ్ఞులైన నిపుణులు, కెమెరామెన్లను సాంకేతిక బృందాలను ఆశ్రయిస్తున్నారు. పాటల చిత్రీకరణకు సిరిసిల్ల, సిద్దిపేట, కరీంనగర్, హైదరాబాద్, తదితర ప్రాంతాల్లోని పర్యాటక కేంద్రాలకు వెళ్తున్నారు. కొందరైతే సముద్ర తీర ప్రాంతాలకు, గోవాకు సైతం వెళ్లి ప్రీ వెడ్డింగ్ షూట్లో పాల్గొంటున్నారు. (చదవండి: గ్రీన్‌ఫీల్డ్ హైవే భూసేకరణలో ఉద్రిక్తత) లోకేషన్లను బట్టి చార్జీ ప్రీ వెడ్డింగ్ షూట్ కోసం అందమైన ప్రదేశాలకు వెళ్తారు. ప్రీవెడ్డింగ్ ఫొటో, వీడియోగ్రాఫర్లు లొకేషన్లను బట్టి రూ.15 వేల నుంచి రూ.40వేల వరకు చార్జీ చేస్తుంటారు. వాహనఖర్చు, డ్రెస్సింగ్, తదితర ఖర్చులు వెడ్డింగ్ షూట్ చేసుకునేవారు చెల్లించాల్సి ఉంటుంది. సిరిసిల్ల, సిద్దిపేట, హైదరబాద్, ఇతర రాష్ట్రాలకు కూడా వెళ్లి ఫొటో షూట్ చేస్తుంటారు. ఒక్కో ఫొటో ప్రీ వెడ్డింగ్ షో చిత్రీకరించడానికి రెండు నుంచి నాలుగు రోజుల సమయం పడుతోంది. సినిమా తరహాలో పాటల చిత్రీకరణ విహహం నిశ్చయమైనప్పటి నుంచి పెళ్లి చేసుకునే జంటలు ప్రతీ క్షణాన్ని ప్రత్యేకంగా పదిల పర్చుకునేందుకు ప్రతీ క్షణాన్ని అందంగా మలుచుకునేందుకు ఆరాటపడుతుంటారు. ఇందుకోసం ప్రీ వెడ్డింగ్ షూట్ ఎంతగానో ఉపయోగపడుతుందని దీంతో పెళ్లికి ముందే ఒకరి భావాలు మరోకరు తెలసుకునే అవకాశం ఉంటుందని అభిప్రాయపడుతున్నారు. ఇలా ప్రీ వెడ్డింగ్ షూట్లో కాబోయే జంటల నృత్యాలు సినిమాలను తలపించేలా చూడ ముచ్చటగా ఉంటున్నాయి. వీరు నటించిన నృత్యాలను, అందమైన ఫొటోలను పెళ్లి సమయంలో భారీ ఎల్ఈడీ స్క్రీన్లపై ప్రదర్శిస్తుండడంతో నూతన జంటలతో పాటు, పెళ్లికి వచ్చిన కుటుంబీకులు సైతం ఆనందపడుతున్నారు. (చదవండి: తొలిసారిగా ఆ ఊర్లో నడిచిన గూడ్స్ రైలు!!) ఆదరణ పెరిగింది మారుతున్న కాలానీకి అణుగుణంగా పెళ్లి జంటలు ప్రీవెడ్డింగ్ ఫొటో షూట్ కు ఇష్టపడుతున్నా రు. వారు ఎంచుకున్న ప్రదేశాలకు వెళ్లి ప్రీ వెడ్డింగ్ షూట్చేస్తాం సినిమాలను తలపించేలా చిత్రీకరిస్తుండడంతో యువతీయువకుల్లో ఆసక్తి పెరుగుతోంది. – రాము, ప్రీ వెడ్డింగ్ షూట్ ఫొటోగ్రాఫర్, సిరిసిల్ల ఒకరినొకరు అర్థం చేసుకుంటారు ప్రీ వెడ్డింగ్ షూట్‌తో పెళ్లి చేసుకునే జంటలు ఒకరినొకరు అర్థంచేసుకుంటారు. దీంతో బిడియం ఉండదు. సినిమా, జానపద పాటలపై నృత్యాలు చేయగా, వాటిని పెళ్లి సమయంలో ఎల్ఈడీ స్క్రీన్లపై ప్రదర్శిస్తుంటాం. – అనగోని చందు, ఫొట్రోగాఫర్ పెళ్లి ఒక మధుర ఘట్టం పెళ్ళి అనేది ఒక మధుర ఘట్టం లాంటిది. అలాంటి పెళ్లి వేడుకలను జీవితాంతం గుర్తిండి పోయేందుకు ప్రీ వెడ్డింగ్ ఫొటో షూట్ ఒక మంచి అనుభూతిని ఇస్తుంది. మధుర జ్ఞాపకాలను గుర్తు చేసుకునేందుకు దోహదపడుతుంది. దీంతో ఒకరి మనోభావాలు మరోకరికి తెలుసుకునే అవకాశం ఉంటుంది. – కత్తి రఘు మౌనిక, -
ప్రీ వెడ్డింగ్ ఫొటోషూట్.. షాక్ అయిన జంట..!
కాలిఫోర్నియా : బీచ్‌లో సరదాగా ఫొటోలు దిగుదామునుకున్న ఓ ప్రేమ జంటకు చేదు అనుభవం ఎదురైంది. వారు ఫొటోలకు పోజులిస్తున్న క్రమంలో ఓ వ్యక్తి నగ్నంగా దర్శనమివ్వడంతో ఆ జంట బిత్తరపోయింది. కాలిఫోర్నియాకు చెందిన అమీ సెఫ్టాన్, జేక్ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారు. ఫ్రీవెడ్డింగ్ ఫొటో షూట్ కోసం ఫొటో గ్రాఫర్ ఆస్టిన్ వైట్సెల్ను వెంటబెట్టుకుని సాన్ ఎలిజో స్టేట్ బీచ్‌కు వెళ్లారు. అయితే, ఆ ఫ్యామిలీ ఫ్రెండ్లీ బీచ్‌లో ఓ పెద్దాయన నగ్నంగా వారి వెనకే నడుచుకుంటూ వెళ్లాడు. దీంతో ఫొటోలు తీస్తున్న వైట్సెల్తో పాటు అమీ, జెక్, అక్కడున్న మిగతా పర్యాటకులు నోరెళ్లబెట్టారు. ‘ఈ ఫొటోలో మా వెనకాల నగ్నంగా ఓ పెద్దాయన కనిపిస్తున్నాడు కదా..! కానీ, మా ముందు వందల కుటుంబాలున్నాయి. పిల్లలు, పెద్దలతో అక్కడ కోలాహలంగా ఉంది. అదొక ఫ్యామిలీ ఫ్రెండ్లీ బీచ్. అక్కడెవరూ కనీసం అలా తిరగరు’అని అమీ చెప్పుకొచ్చాడు. పెద్దాయన ఆకతాయి చేష్టల వల్ల వారు ఇబ్బంది పడినా ఎలాగోలా ఫోటో షూట్ కొనసాగించారు. చివర్లో బట్టలు వేసుకుని తిరిగొచ్చిన ఆ వ్యక్తితో కూడా ఫొటో దిగారు. అమీకి జెక్ ప్రపోజ్ చేసింది కూడా అదే బీచ్‌లో కావడం గమనార్హం. ఇప్పుడీ ఫన్నీ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. -
మీ భాగస్వామితో విడిపోయారా..!
అహ్మదాబాద్: గుజరాత్‌కు చెందిన ‘వినా ముల్యే అమూల్య సేవ’ పేరుతో ఓ సంస్థ సరికొత్త ఆలోచనతో ముందుకొచ్చింది. మధ్య వయసులో ఉండి ఒంటరి జీవితాన్ని గడుపుతున్నవారికి కొత్త భాగస్వామిని అందించే చర్యకు ఉపక్రమించింది. ఇందుకోసం పది రోజుల షిమ్లా పర్యాటనను సిద్ధం చేసింది. మిగితా టూర్ల మాదిరిగా కాకుండా చాలా తక్కువ ధరల్లోనే ఈ టూర్ ప్యాకేజీని ప్రకటించింది. దీనిలో నమోదుకావాలనుకునేవారు కేవలం రూ.10 వేలు చెల్లిస్తే సరిపోతుంది. ఇందులో హోటల్ ఖర్చు, ఆహారం, ఆయా ప్రాంతాల సందర్శన, లగ్జరీ బస్సులో ప్రయాణం ఉంటుంది. 35 ఏళ్ల నుంచి ఆ పైన వయసు ఉండి విడాకులు తీసుకొని ఒంటరిగా ఉంటున్నవారు, భర్త చనిపోయినవారు, భార్య చనిపోయినవారు ఈ టూర్‌కోసం తమ పేరును నమోదు చేసుకోవచ్చు. ఇందులో మరోసదుపాయం ఏమిటంటే మహిళలకు ట్రాన్స్‌పోర్టేషన్ టారిఫ్స్ ఉండవట. భారతీ రావల్ అనే వ్యక్తి ఈ టూర్ వివరాలు తెలియజేస్తూ ఇప్పటికే రిజిస్ట్రేషన్ ప్రక్రియ మొదలైందని ఒక్క గుజరాత్ నుంచే కాకుండా బెంగళూరు, హైదరాబాద్ నుంచి కూడా పలువురు తమ పేర్లను నమోదు చేసుకున్నారట. వీళ్లలో ఎక్కువగా మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన గ్రాడ్యుయేట్లు ఉన్నారని చెప్పారు. ఓ ఇద్దరు ఎన్నారైలు, ఓ 85 ఏళ్ల వ్యక్తి, 72 ఏళ్ల మహిళ కూడా ఉందని ఆయన తెలిపారు. ఒంటరిగా ఉంటూ తీవ్ర ఒత్తిడిలో ఉన్నవారికి ఈ పర్యటన ఓదార్పునివ్వడమే కాకుండా ఈ పది రోజుల్లో వారు ఒకరినొకరు పూర్తిగా అర్ధం చేసుకోవడం ద్వారా ఒక భాగస్వామిని ఎంచుకున్నట్లవుతుందని, ఇది తమ దృష్టిలో మానవతా దృక్పథంతో చేసే సేవ అని పేర్కొన్నారు.