వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ ఘన విజయాన్ని అందుకున్నారు. వచ్చే ఏడాది జనవరిలో ట్రంప్ ప్రభుత్వ పగ్గాలు చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలో ట్రంప్ కుర్చీ ఎక్కేలోగా వలసదారులు అమెరికా చేరుకోవాలని ప్లాన్ చేసుకుంటున్నారు. దాదాపు 1500 మంది అక్రమ వలసదారులు అమెరికాలోకి ప్రవేశించేందుకు రెడీగా ఉన్నట్టు సమాచారం.
డొనాల్డ్ ట్రంప్ అధికారం చేపట్టే నాటికి అక్రమ వలసదారులు అమెరికాలోకి వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. మెక్సికన్ సిటీ తపచులా నుంచి దాదాపు 1500 మంది వలసదారులు అమెరికాకు బయలుదేరినట్టు కథనాలు వెలువడ్డాయి. సరిహద్దుల వెంట 2600 కిలోమీటర్లు నడక మార్గంలో ప్రయాణించి అమెరికా చేరుకోవాలని వారు ప్రణాళిక చేసుకున్నారు. అయితే, ఎలాగైనా అమెరికా చేరుకుని ట్రంప్ అధికారంలోకి రాక ముందే అక్కడ ఆశ్రయం పొందాలనేది తమ ప్రణాళిక సదరు వలస బృందంలోని ఓ వ్యక్తి చెప్పినట్లుగా అంతర్జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి.
ఇదిలా ఉండగా.. తాను అధికారంలోకి వస్తే అక్రమ వలసదారులను దేశంలోకి రాకుండా అరికడతానని, అమెరికాలో ఉన్నవారిని పంపించి వేస్తానని ఎన్నికల సందర్భంగా డొనాల్డ్ ట్రంప్ వాగ్దానం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జనవరి 20న ట్రంప్ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించే లోపే అమెరికాలో అడుగుపెట్టాలని శరణార్థులు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. మరోవైపు.. అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ గెలిచిన తర్వాత పలువురు అక్రమ వలసదారులు ఇప్పటికే అమెరికాను విడిచివెళ్లినట్టు సమాచారం.
Tapachula: This morning, Nov. 20th, another caravan departed southern Mexico.
This is the sixth caravan to leave Chiapas since Claudia Sheinbaum's presidency; five have left from Tapachula and one from Tuxtla Gutiérrez with the intention of reaching central Mexico.
“Fear,… pic.twitter.com/Y9W98aIQIY— Auden B. Cabello (@CabelloAuden) November 20, 2024
Comments
Please login to add a commentAdd a comment