
వాషింగ్టన్: అక్రమ వలసదారులను సైనిక విమానాల్లో స్వదేశాలకు తిప్పి పంపేందుకు ఖర్చు తడిసి మోపెడవుతోందని అమెరికా గుండెలు బాదుకుంటోంది. వాటి వాడకాన్ని తాత్కాలికంగా నిలిపేస్తూ నిర్ణయం తీసుకుంది. వలసదారులతో చివరి విమానం అమెరికా నుంచి మార్చి 1న వెళ్లింది. తరవాత వాటిని ఇప్పటిదాకా షెడ్యూల్ చేయలేదు. ఈ విరామాన్ని పొడిగించడమో, తరలింపులను శాశ్వతంగా నిలిపివేయడమో చేయొచ్చని చెబుతున్నారు.
గత జనవరిలో డొనాల్డ్ ట్రంప్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టగానే వలసదారులను వెనక్కి పంపే చర్యలకు శ్రీకారం చుట్టడం తెలిసిందే. కొందరిని స్వదేశాలకు, ఇతరులను గ్వాంటనామో బేలోని సైనిక స్థావరానికి పంపారు. ఈ విషయంలో అమెరికా ఎంత కఠినంగా ఉందో చెప్పేందుకు 30 సి–17, 12 సి–130 తరహా సైనిక విమానాలను వాడారు. అయితే అది చాలా ఖరీదైన వ్యవహారంగా మారింది.
ఈ క్రమంలో భారత్‌కు వచ్చిన మూడు విమానాలకే ఏకంగా 30 లక్షల డాలర్లు ఖర్చయింది. గ్వాంటనామోకు తరలించడానికి ఒక్కో వ్యక్తిపై అమెరికా 20 వేల డాలర్లు ఖర్చు చేసింది. ఇది అమెరికా ఎయిర్‌లైన్స్ విమాన టికెట్ల కంటే ఏకంగా ఐదు రెట్లు ఎక్కువ. అమెరికా ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ (ఐసీఈ) కమర్షియల్ చార్టర్ ఫ్లైట్ కంటే కూడా చాలా ఎక్కువ!. దీంతో, దీంతో, ఈ ఖర్చుపై అమెరికాలో పునరాలోచనలో పడినట్టు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment