
సాక్షి, మహబూబాబాద్: మహబూబాబాద్ పట్టణంలో బీఆర్‌ఎస్ తలపెట్టిన ధర్నాకు పోలీసులు అనుమతిని నిరాకరించారు. మరోవైపు.. శాంతిభద్రతల సమస్య తలెత్తే అవకాశం ఉందని అనుమతి నిరాకరించడంతో బీఆర్‌ఎస్ కూడా ధర్నా వాయిదా వేసుకుంది. ఈ నేపథ్యంలో కేటీఆర్.. మహబూబాబాద్ పర్యటనను వాయిదా వేసుకున్నారు.
గిరిజన, దళిత, పేద రైతులపై దాడికి నిరసగా మహబూబాబాద్‌లో బీఆర్‌ఎస్ నేతలు ధర్నాకు పిలుపునిచ్చారు. కాగా, బీఆర్‌ఎస్ ధర్నాకు పోలీసులు అనుమతి నిరాకరించారు. దీంతో వెంటనే రైతు మహాధర్నాకు అనుమతి ఇవ్వాలని కోరుతూ మహబూబాబాద్ ఎస్పీ క్యాంపు కార్యాలయం ముందు బీఆర్‌ఎస్ నాయకులు బుధవారం రాత్రి ధర్నాకు దిగారు.
అయినప్పటికీ పోలీసులు అనుమతి ఇవ్వలేదు. ఈ రైతు మహా ధర్నాకు కేటీఆర్ కూడా హాజరు కావాల్సి ఉండగా పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో పర్యటనను రద్దు చేసుకున్నారు. మరోవైపు.. ఈరోజు మహబూబాబాద్ జిల్లావ్యాప్తంగా పోలీసులు 144 సెక్షన విధించినట్టు ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ తెలిపారు.
నిమిషానికి నలభైసార్ల KCR రావాలే అని తెగ ఒర్లుతావు!
అసెంబ్లీలో KCR ముందు నుంచునే మాట దేవుడెరుగు…
కనీసం మహబూబాబాద్ లో మహాధర్నా కు అనుమతిచ్చేందుకు ధైర్యం సరిపోవట్లేగా చిట్టినాయుడు?!— KTR (@KTRBRS) November 20, 2024
