
గిరిజనులు, దళితులపై జరిగిన దాడికి నిరసనగా మహబూబాబాద్‌లో బీఆర్‌ఎస్ తలపెట్టిన గిరిజన రైతు ధర్నాకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
సాక్షి, హైదరాబాద్: గిరిజనులు, దళితులపై జరిగిన దాడికి నిరసనగా మహబూబాబాద్‌లో బీఆర్‌ఎస్ తలపెట్టిన గిరిజన రైతు ధర్నాకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈనెల 25న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు అనుమతిస్తూ.. ధర్నాలో వెయ్యి మంది మాత్రమే పాల్గొనాలని షరతు విధించింది.
అయితే, మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో గిరిజన రైతు ధర్నా ఇవాళ చేపట్టాలని బీఆర్ఎస్ పార్టీ నిర్ణయించిన సంగతి తెలిసిందే.. కానీ పోలీసులు అనుమతించకపోవడంతో గిరిజన రైతు ధర్నాకు అనుమతి ఇవ్వాలంటూ బీఆర్ఎస్ హైకోర్టును ఆశ్రయించింది. ధర్నాకు అనుమతినిస్తూ హైకోర్టు పచ్చజెండా ఊపింది.