ఉక్రెయిన్‌కు బైడెన్‌ భారీ ఆఫర్‌.. ట్రంప్‌ సమర్థిస్తారా? | Joe Biden Administration Moves To Forgive US Loans To Ukraine | Sakshi
Sakshi News home page

ఉక్రెయిన్‌కు బైడెన్‌ భారీ ఆఫర్‌.. ట్రంప్‌ సమర్థిస్తారా?

Published Thu, Nov 21 2024 9:29 AM | Last Updated on Thu, Nov 21 2024 11:06 AM

Joe Biden Administration Moves To Forgive US Loans To Ukraine

వాషింగ్టన్‌: రష్యా-ఉక్రెయిన్‌ మధ్య భీకర పోరు జరుగుతున్న వేళ ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. రష్యా దాడుల కారణంగా తీవ్రంగా నష్టపోయిన ఉక్రెయిన్‌కు అమెరికా ఆర్థికంగా బాసటగా నిలిచేందుకు అడుగులు వేస్తోంది. ఉక్రెయిన్‌కు ఇచ్చిన 4.7 బిలియన్‌ డాలర్లను (రూ.3.96 లక్షల కోట్లు) మాఫీ చేయడానికి బైడెన్‌ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని తెలుస్తోంది.

ఉక్రెయిన్‌-రష్యా మధ్య దాదాపు రెండున్నరేళ్లుగా యుద్ధం కొనసాగుతోంది. రష్యా దాడుల కారణంగా ఉక్రెయిన్‌లో భారీగా ఆస్తి, ప్రాణ నష్టం జరిగింది. వేల సంఖ్యలో ఉక్రెయిన్‌వాసులు దేశం విడిచివెళ్లారు. రష్యా దాడులు ప్రారంభమైన నాటి నుంచి ఉక్రెయిన్‌కు అగ్ర రాజ్యం అమెరికా అండగా నిలిచింది. బైడెస్‌ ప్రభుత్వం జెలెన్‌ స్కీకి ఆర్థికంగా, ఆయుధాల విషయంలోనూ సాయం అందజేసింది.

ఇక, తాజాగా అధ్యక్షుడు బైడెన్‌.. ఉక్రెయిన్‌ విషయంలో మరో కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఉక్రెయిన్‌కు అందజేసిన 4.7 బిలియన్‌ డాలర్లను (రూ.3.96 లక్షల కోట్లు) మాఫీ చేయడానికి బైడెన్‌ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని తెలిపిన అమెరికా విదేశాంగశాఖ అధికార ప్రతినిధి మాథ్యూ మిల్లర్ వెల్లడించారు. బైడెన్‌ తన పదవి నుంచి దిగేపోయే ముందే రష్యాతో పోరాడుతున్న ఉక్రెయిన్‌కు తాము చేయాల్సినంత సాయం చేసి వెళ్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆర్థిక సాయం అందించే దిశగా బైడెన్‌ ప్లాన్‌ చేస్తున్నారు. అయితే, బైడెన్‌ నిర్ణయం పట్ల డొనాల్డ్‌ ట్రంప్‌ ఎలా స్పందిస్తారనే ఉత్కంఠ నెలకొంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement