గురువు దారిలోనే శిష్యురాలు.. భర్తకు విడాకులు | Hours After AR Rahman Divorce, His Bassist Mohini Dey Announce Divorce With Her Husband, Post Goes Viral | Sakshi
Sakshi News home page

Mohini Dey Ar Rahman: ఏఆర్ రెహమాన్‌తో పాటు లేడీ అసిస్టెంట్ డివోర్స్

Nov 20 2024 1:42 PM | Updated on Nov 20 2024 2:47 PM

Ar Rahman Bassist Mohini Dey Announce Divorce After Hours

దిగ్గజ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ విడాకులు తీసుకున్నాడు. ఇతడి భార్య సైరా భాను.. తన లాయర్ల ద్వారా ఈ విషయాన్ని బయటపెట్టింది. మంగళవారం సాయంత్రం ఇదంతా జరిగింది. ఇది జరిగిన కొన్ని గంటల్లోనే రెహమాన్ దగ్గర పనిచేస్తున్న శిష్యురాలు కూడా భర్తకు విడాకులు ఇవ్వడం ఆసక్తికరంగా మారింది.

(ఇదీ చదవండి: జీవితంలో పెళ్లి చేసుకోను: హీరోయిన్ ఐశ్వర్య)

29ఏళ్ల వివాహ బంధానికి ముగింపు పలికిన సైరా భాను.. భర్త ఏఆర్ రెహమాన్ నుంచి విడిపోవాలని నిర్ణయం తీసుకుంది. ఒకరిపై మరొకరికి గాఢమైన ప్రేమ ఉన్నప్పటికీ, వాళ్లిద్దరి మధ్య ఏర్పడిన ఇబ్బందులు.. పెద్ద అంతరాన్ని సృష్టించాయని ఆమె లాయర్ వందనా షా పేర్కొన్నారు. రెహమాన్- సైరా దంపతులకు ముగ్గురు పిల్లలు. వారిలో ఇద్దరు కుమార్తెలు, ఖతీజా, రహీమా, అమీన్ రెహమాన్ కొడుకు ఉన్నాడు.

ఇకపోతే రెహమాన్ దగ్గర బాసిస్ట్‌గా పనిచేస్తున్న లేడీ అసిస‍్టెంట్ మోహిని డే కూడా మంగళవారం సాయంత్రమే తన భర్తకు విడాకులు ఇచ్చింది. ఈ విషయాన్ని ఇన్ స్టా స్టోరీలో పోస్ట్ చేసింది. విడిపోయినప్పటికీ భర్తతో కలిసి ప్రోగ్రామ్స్ చేస్తానని మోహిని క్లారిటీ ఇచ్చింది. అయితే గంటల వ్యవధిలో ఏఆర్ రెహమాన్, అతడి సహాయకురాలు విడాకులు (వేర్వేరుగా) తీసుకోవడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. మరి ఈ రెండు విడాకుల అంశాలకు ఏమైనా సంబంధముందా అని సోషల్ మీడియాలో టాక్ నడుస్తోంది.

(ఇదీ చదవండి: 'కిష్కింద కాండం' సినిమా రివ్యూ (ఓటీటీ))

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement