జీవితంలో పెళ్లి చేసుకోను: హీరోయిన్ ఐశ్వర్య | Malayalam Actress Aishwarya Lekshmi Comments On Why She Not Getting Married, Deets Inside | Sakshi
Sakshi News home page

Aishwarya Lekshmi: నేను కూడా పెళ్లి చేసుకోవాలని అనుకున్నా.. కానీ

Published Wed, Nov 20 2024 7:35 AM | Last Updated on Wed, Nov 20 2024 10:21 AM

Aishwarya Lekshmi Comments On Not Getting Married

ఒకప్పుడు పెళ్లి కోసం యువత ఎగబడే వాళ్లు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. ఉద్యోగాలు, ఇండిపెండెంట్‌గా బతకడం లాంటివి చెబుతూ అటు అమ్మాయిలు, ఇటు అబ్బాయిలు సింగిల్‌గానే ఉండిపోతున్నారు. ఇలాంటి వాళ్లలో సినిమా హీరోహీరోయిన్లు కూడా ఉన్నారండోయ్. వాళ్లకు పెళ్లిపై నమ్మకమున్నా సరే ఎందుకో చేసుకోవట్లేదు. హీరోయిన్ ఐశ్వర్య లక్ష‍్మి మాత్రం జీవితంలో తాను పెళ్లి చేసుకోనని చెబుతోంది.

(ఇదీ చదవండి: అక్కినేని హీరోతో పెళ్లి.. స్పందించిన మీనాక్షి చౌదరి)

మలయాళంలో హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్న ఐశ్వర్య.. తెలుగులోనూ 'గాడ్సే', 'అమ్ము' తదితర చిత్రాల్లో నటించింది. గతంలో పెళ్లి చేసుకోనని ఓసారి చెప్పిన ఈమె.. ఇప్పుడు కూడా అదే మాటపై ఉన్నట్లు చెప్పుకొచ్చింది. ఇందుకు గల కారణాల్ని కూడా బయటపెట్టింది.

'జీవితంలో నేను పెళ్లి చేసుకోను. బాగా ఆలోచించి తీసుకున్న నిర్ణయం ఇది. నాకు తెలిసిన చాలామందిని చూశారు. ఒక్క జంట తప్పితే మిగిలిన వాళ్లందరూ రాజీ పడి బతుకుతున్నారు. పెళ్లి వల్ల చాలామంది వ్యక్తిగతంగానూ ఎదగలేకపోతున్నారు. అందుకే పెళ్లి వద్దని ఫిక్సయ్యాను. 25 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు గురువాయూర్ గుడిలో చాలా పెళ్లిళ్లు చూశాను. అవి చూసినప్పుడల్లా నేను కూడా అలానే చేసుకోవాలని అనుకున్నా. కానీ పెద్దయిన తర్వాత పెళ్లి గురించి ఫుల్ క్లారిటీ వచ్చింది.'

(ఇదీ చదవండి: ఏఆర్ రెహమాన్‌కి విడాకులు ఇచ్చేసిన భార్య)

'కొన్నేళ్ల ముందు వరకు కూడా పెళ్లి చేసుకోవాలనే అనుకున్నారు. ఓ మ్యాట్రిమోని సైట్‪‌లో నేను నా ప్రొఫైల్ కూడా పెట్టాను. కానీ అది ఫేక్ అని చాలామంది అనుకున్నారు. కానీ కొన్నాళ్లకు పెళ్లిపై నా అభిప్రాయం మారిపోయింది' అని ఐశ్వర్య లక్ష‍్మీ చెబుతోంది.

తమిళ నటుడు అర్జున్ దాస్‌తో ఈమె ప్రేమలో ఉందని కొన్నాళ్ల క్రితం రూమర్స్ వచ్చాయి. ఇప్పుడు ఈ మాటలతో అవన్నీ ఒట్టి పుకార్లే అని తేలిపోయాయి. ఐశ్వర్య ప్రస్తుతం తెలుగులో సాయితేజ్ లేటెస్ట్ మూవీలో చేస్తోంది.

(ఇదీ చదవండి: రూమర్స్ కాదు నిజంగానే కీర్తి సురేశ్‪‌కి పెళ్లి సెట్!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement