రూమర్స్ కాదు నిజంగానే కీర్తి సురేశ్‪‌కి పెళ్లి సెట్! | Keerthy Suresh Boyfriend Antony Thattil And Wedding Details | Sakshi
Sakshi News home page

Keerthy Suresh Wedding: బాయ్ ఫ్రెండ్ ఫొటో వైరల్.. పెళ్లి డీటైల్స్ కూడా

Published Tue, Nov 19 2024 8:00 AM | Last Updated on Tue, Nov 19 2024 9:51 AM

Keerthy Suresh Boyfriend Antony Thattil And Wedding Details

హీరోయిన్ కీర్తి సురేశ్ పెళ్లి గురించి ఎన్నోసార్లు రూమర్స్ వచ్చాయి. బిజినెస్‌మ్యాన్‌, ఫ్యామిలీ ఫ్రెండ్.. ఇలా గతంలో చాలాసార్లు పలువురి గురించి అన్నారు. కానీ ఆ వ్యక్తుల పేరు, డీటైల్స్ లాంటివేం రాలేదు. రీసెంట్‍‪‌గా గత రెండు మూడు రోజుల నుంచి కూడా కీర్తి సురేశ్ పెళ్లంటూ తెగ హడావుడి మొదలైంది. తొలుత ఇది కూడా ఎప్పటిలాంటి రూమర్ అని అందరూ అనుకున్నారు. కానీ ఈసారి మాత్రం నిజంగానే పెళ్లి చేసుకోబోతుందని క్లారిటీ వచ్చేసింది.

(ఇదీ చదవండి: అయ్యప్ప మాలలో చరణ్.. కానీ దర్గాకు ఎందుకు వెళ్లాడంటే?)

ఒకప్పటి హీరోయిన్ మేనక, నిర్మాత సురేశ్ కుమార్ ముద్దుల కూతురు అయిన కీర్తి సురేశ్.. బాలనటిగా కెరీర్ మొదలుపెట్టింది. 'నేను శైలజ' సినిమాతో హీరోయిన్ అయిపోయింది. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో స్టార్ హీరోలతో కలిసి సినిమాలు చేసింది. ఇప్పుడు కూడా ఈమె చేతిలో రెండు తమిళ, ఓ హిందీ మూవీ ఉన్నాయి.

పెళ్లి విషయానికొస్తే కీర్తి సురేశ్ చాన్నాళ్లుగా ఆంటోని తట్టిల్ అనే వ్యక్తితో ప్రేమలో ఉంది. కానీ ఎక్కడా ఆ విషయం బయటపడకుండా జాగ్రత్త పడింది. కొచ్చికి చెందిన ఇతడినే ఇప్పుడు పెళ్లి చేసుకోబోతుంది. డిసెంబరు 11-12 తేదీల్లో గోవాలో కీర్తి-ఆంటోని డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోనున్నారు. ఇవన్నీ అనధికారికంగా వినిపిస్తున్న విషయాలు. త్వరలో ఈ విషయమై కీర్తి సురేశ్ అధికారిక ప్రకటన ఇవ్వనుంది.

(ఇదీ చదవండి: అక్కినేని వారి పెళ్లిసందడి.. మూడుముళ్లు వేసే టైమ్ వచ్చేసింది)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement