Aamir Khan’s Daughter Ira Khan's Drops Sweet Comment On Her Boyfriend Nupur Shikhara Pic - Sakshi
Sakshi News home page

బాయ్‌ఫ్రెండ్‌ ఫోటో చూసి ఇరా ఖాన్‌ ఏమందంటే..

May 25 2021 4:01 PM | Updated on May 25 2021 6:00 PM

Aamir Khans Daughter Ira Khan Drops A Sweet Comment On Boyfriend Pic - Sakshi

బాలీవుడ్‌ మిస్టర్‌ పర్‌ఫెక‌్షనిస్ట్‌ ఆమిర్ ఖాన్‌ కూతురు ఇరా ఖాన్‌ గత కొంతకాలంగా తరుచూ వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. తన తండ్రి ఆమిర్‌ ఫిట్‌నెస్‌ కోచ్‌ నుపూర్‌ షిఖరేతో ఇరా పీకల్లోతు ప్రేమలో మునిగిపోయిన ఆమె తరుచూ నుపూర్‌తో కలిసి దిగిన ఫోటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తుంటుంది.  గతేడాది దీపావళి సందర్భంగా మొదటిసారి తన ప్రియుడిని ఫ్యాన్స్‌కు పరిచయం చేసింది ఇరా. ఇక అప్పటినుంచి వీరిద్దరి డేటింగ్‌ వ్యవహారం బీటౌన్‌లో హాట్‌టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం మహారాష్ట్రలో లాక్‌డౌన్‌ సందర్భంగా ఇద్దరూ ఫాంహౌజ్‌లో ఎంజాయ్‌ చేస్తున్నట్లు బాలీవుడ్‌ మీడియా కోడై కూస్తుంది.

తాజాగా ప్రియుడు నుపూర్‌ మజిల్స్‌ చూపిస్తూ ఓ ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేయగా..  ఇరా 'వాట్‌ ఏ హాటీ' అంటూ ఇరా  కామెంట్‌ చేసింది. దీనికి నుపూర్‌ కూడా లవ్‌ సింబల్‌తో ఇరాకు తన ప్రేమను తెలియజేశాడు. ప్రస్తుతం ఇరా చేసిన ఈ కామెంట్స్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇటీవలె ఇన్‌స్టా క్వశ్చన్‌ అండ్‌ ఆన్సర్‌ సెషన్స్‌లోనూ మీ జీవితంలో మీకే సొంతమైన వ్యక్తి ఉండాలని కోరుకుంటున్నారా అని ఐరా ప్రశ్నించగా, అవును..నా జీవితంలో ఒకరు ఉన్నారు. ఆమె పేరు ఇరా అంటూ నుపూర్‌ ఆమె ఫోటోను షేర్‌ చేసిన సంగతి తెలిసిందే. 

గతంలో ఇరా మిషాల్‌ అనే వ్యక్తితో ప్రేమాయాణం నడిపిన విషయం తెలిసిందే. అంతేగాక వీరిద్దరూ కలిసి చక్కర్లు కొట్టిన ఫొటోలను ఇరా తరచూ తన సోషల్‌ మీడియా ఖాతాలో పంచుకునేది. రెండేళ్ల పాటు ప్రేమించుకున్న ఇరా, మిషాల్‌లు 2019లో కొన్ని కారణాల వల్ల విడిపోయారు. కాగా నూపూర్‌ షిఖరే గత కొన్నేళ్లుగా ఆమిర్‌కు పర్సనల్‌‌ ఫిట్‌నెస్‌ ట్రైనర్‌గా ఉంటున్న విషయం తెలిసిందే. ఇక లాక్‌డౌన్‌లో ఇరా ఫిట్‌నెస్‌పై‌ శ్రద్ద పెట్టడంతో నుపూర్‌ ఆమెకు కూడా కోచ్‌గా మారాడు. ఆ సమయంలోనే విరిద్దరూ ప్రేమలో పడ్డారు. నుపూర్ బాలీవుడ్‌లో పలువురు స్టార్లకు ఫిట్‌నెస్ ట్రైనర్‌గా ఉన్న సంగతి తెలిసిందే. సుస్మితా సేన్‌కు గత పదేళ్లుగా ట్రైనర్‌గా ఉన్నారు.

చదవండి : పీకల్లోతు ప్రేమలో ఇరా ఖాన్‌
లైంగిక వేధింపులకు గురైనా.. : హీరో కుమార్తె

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement