
Ira Khan Celebrates Diwali With Boyfriend Nupur Shikhare: బాలీవుడ్ సూపర్ స్టార్ ఆమిర్ ఖాన్ కూతురు ఇరా ఖాన్ గత కొంతకాలంగా నుపూర్ షిఖరేతో పీకల్లోతు ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. గతేడాది దీపావళి సందర్భంగా తొలిసారి తన ప్రియుడిని పరిచయం చేసింది ఇరా. ఇక అప్పటినుంచి వీరిద్దరి డేటింగ్ వ్యవహారం బీటౌన్‌లో హాట్‌టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ ఏడాది దీపావళి పండుగను సైతం ప్రియుడు నుపూర్‌తో సెలబ్రేట్ చేసుకుంది.
ఈ సందర్భంగా అతడితో కలిసి దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంది. నుపూర్ తల్లి ప్రీతమ్ శిఖరే కూడా ఈ వేడుకల్లో పాల్గొంది. ఇక నుపూర్ బాలీవుడ్‌లో పలువురు స్టార్లకు ఫిట్‌నెస్ ట్రైనర్‌గా ఉన్నారు. సుస్మితా సేన్‌కు గత పదేళ్లుగా ట్రైనర్‌గా ఉన్నారు. ఆమిర్ ఖాన్‌కు నుపూర్ ఫిట్‌నెస్ ట్రైనర్‌గా ఉన్నాడు. అనంతరం ఐరాకు కూడా ఆయన కోచ్‌గా మారాడు. ఈ సమయంలోనే వారిద్దరు ప్రేమలో పడ్డారు.