హనీమూన్‌లో స్టార్‌ హీరో కూతురు.. బీచ్‌లో విన్యాసాలు! Ira Khan shares Honeymoon Pics from Indonesia | Sakshi
Sakshi News home page

Ira Khan: హనీమూన్‌ పిక్స్‌ షేర్‌ చేసిన స్టార్‌ హీరో కూతురు.. అక్కడ కూడా యోగా వదల్లేదు!

Published Sun, Feb 4 2024 3:34 PM | Last Updated on Sun, Feb 4 2024 4:10 PM

Ira Khan shares Honeymoon Pics from Indonesia - Sakshi

బాలీవుడ్‌ స్టార్‌ హీరో ఆమిర్‌ ఖాన్‌ కుమార్తె ఐరా ఖాన్‌ ఇటీవలే పెళ్లి పీటలెక్కింది. ఫిట్‌నెస్‌ ట్రైనర్‌ నుపుర్‌ శిఖరేను పెళ్లాడింది. గతేడాది నిశ్చితార్థం జరగ్గా ఈ ఏడాది ప్రారంభంలో వీరి వివాహం జరిగింది. ఒకసారి రిజిస్టర్‌ మ్యారేజ్‌ చేసుకున్న తర్వాత ఉదయ్‌పూర్‌లో ఘనంగా పెళ్లి వేడుక జరుపుకున్నారు. ఈ మధ్యే కొత్త జంట హనీమూన్‌కు ఇండోనేషియా చెక్కేసింది. అక్కడ కూడా వర్కవుట్స్‌ వదలడం లేదు నుపుర్‌. హనీమూన్‌లో భాగంగా ఏయే ప్రదేశాలకు వెళ్తున్నారో ఆ అన్నిచోట్లా ఎక్సర్‌సైజ్‌లు చేస్తున్నాడు.

ఒలంపిక్స్‌కు వెళ్లు
ఇందుకు సంబంధించిన ఫోటోలను ఐరా సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది. నీ హనీమూన్‌ ఎలా ఉంది? అని భర్తను కొంటెగా అడుగుతూ క్యాప్షన్‌ పెట్టింది. ఈ పోస్ట్‌ వైరల్‌గా మారగా నెటిజన్లు ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. హనీమూన్‌ ఎంజాయ్‌ చేయకుండా ఈ యోగా ఏంట్రా బాబూ.. ఈయన్ను ఒలంపిక్స్‌కు పంపించండి, ఐరా నువ్వు పెళ్లాడింది మనిషిని కాదు, కోతిని అంటూ సెటైర్లు వేస్తున్నారు.

ఆమిర్‌ దగ్గరే పని చేసి అతడి కూతురికే లైన్‌..
కాగా నుపుర్‌ శిఖరే.. బాలీవుడ్‌లోని పలువురు సెలబ్రిటీలకు ఫిటెన్‌స్‌ ట్రైనింగ్‌ ఇచ్చాడు. అలా ఆమిర్‌ ఖాన్‌ దగ్గర కొంతకాలంపాటు ఫిట్‌నెస్‌ కోచ్‌గా పనిచేశాడు. ఆ సమయంలోనే వీరి మధ్య ప్రేమ చిగురించింది. ఈ ప్రేమకు పెద్దలు పచ్చజెండా ఊపడంతో ఇద్దరూ ఒక్కటయ్యారు. జనవరిలో వీరి పెళ్లి, రిసెప్షన్‌ వేడుకలు జరిగాయి.

చదవండి: ఎదురుచూపులకు బ్రేక్‌.. 19 ఏళ్ల తర్వాత ఓటీటీలోకి సూపర్‌ హిట్‌ మూవీ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement

తప్పక చదవండి

 
Advertisement