మరో స్టార్ హీరోయిన్ బ్రేకప్ చెప్పేసిందా? అంటే అవుననే అనిపిస్తోంది. ప్రభాస్ 'సాహో' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్.. గత కొన్నాళ్లుగా రాహుల్ మోదీ అనే రైటర్‌తో ప్రేమలో ఉంది. దీన్ని నిజం చేసేలా పలు ఈవెంట్స్‌లో జంటగా కనిపించారు. నెల క్రితం కూడా రాహుల్ గురించి శ్రద్ధా పోస్ట్ పెట్టింది. ఇంతలోనే బ్రేకప్ న్యూస్ బయటకొచ్చింది.
(ఇదీ చదవండి: ప్రభాస్ ఫుడ్‌కి ఫిదా అయిన ఆరో హీరోయిన్.. ఏం చెప్పిందంటే?)
శ్రద్ధా కపూర్.. రాహుల్‌తో పాటు అతడి కుటుంబ సభ్యులు అందరినీ ఇన్ స్టాలో అన్ ఫాలో చేసింది. దీంతో బ్రేకప్ అయిందని అంటున్నారు. మరికొందరు మాత్రం త్వరలో శ్రద్ధా నటించిన 'స్త్రీ 2' త్వరలో రిలీజ్ కానుందని, దీనిపై బజ్ లేకపోవడంతో కావాలనే ఇలా స్టంట్ చేస్తోందని కామెంట్స్ చేస్తున్నారు. శ్రద్ధా చెబితే తప్ప దీనిపై ఓ క్లారిటీ రాదు.
తండ్రి శక్తి కపూర్ నటుడు కావడంతో సులువుగానే ఇండస్ట్రీలోకి వచ్చేసింది. 2010 నుంచి హిందీలో అడపాదడపా మూవీస్ చేస్తోంది. ప్రభాస్ 'సాహో'తో దక్షిణాదిలో గుర్తింపు తెచ్చుకుంది. మళ్లీ చాన్నాళ్ల తర్వాత ఇప్పుడు ఇలా బ్రేకప్ న్యూస్ వల్ల వైరల్‌గా మారిపోయింది.
(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీలో 21 సినిమాలు/ సిరీస్‌లు రిలీజ్)
Comments
Please login to add a commentAdd a comment