ముంబై: ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం సందర్భంగా బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ కూతురు ఇరా ఖాన్ తాను మానసిక ఒత్తిడి, నిరాశకు గురయ్యానని వెల్లడిస్తూ సోషల్ మీడియాలో ఓ వీడియో సందేశాన్ని పంచుకున్నారు. అది చూసిన బాలీవుడ్ ‘క్వీన్’ కంగనా రనౌత్ ఇరా వీడియోకు స్పందిస్తూ.. తాను కూడా మానసిక అనారోగ్యంతో బాధపడినట్లు ట్విటర్‌లో షేర్ చేశారు. ‘నేను 16 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు శారీరక దాడిని ఎదుర్కొన్నాను. నా సోదరిపై యాసిడ్ దాడి జరిగినప్పుడు నేను ఒంటరిగా తనని చూసుకున్నాను. అయితే నిరాశకు గురవడానికి ఎన్నో కారణాలు ఉండవచ్చు. ఇబ్బందులు ఎదుర్కొన్న కుటుంబానికి మాత్రం అది సాధారణ విషయం కాదు. సాంప్రదాయ కుటుంబ వ్యవస్థ చాలా ముఖ్యం’ అంటూ రాసుకొచ్చారు. అలాగే ఇరా వీడియోపై కూడా స్పందిస్తూ ఆమె క్లినికల్ డిప్రెషన్‌కు కారణం తన తల్లిదండ్రులు విడాకులు తీసుకోవడమే అని అభిప్రాయపడ్డారు. ఈ విషయం అందరికి తెలుసు కానీ దీనిని ఎవరూ ఏకిభవించరు అని పేర్కొన్నారు. (చదవండి: అన్నీ మారాయి... అవి తప్ప!)
At 16 I was facing physical assault, was single handedly taking care of my sister who was burnt with acid and also facing media wrath, there can be many reasons for depression but it’s generally difficult for broken families children, traditional family system is very important. https://t.co/0paMh8gTsv
— Kangana Ranaut (@KanganaTeam) October 12, 2020
ఇరా ఖాన్.. ఆమిర్ ఖాన్ మొదటి భార్య రీనా దత్తాల కూతురు. ఇరా ఆదివారం తన ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో షేర్ చేస్తూ.. “చాలా జరుగుతోంది, చెప్పడానికి చాలా ఉంది. అంతా గందరగోళంగా ఉంది. ఒత్తిడితో కూడుకున్నవి, చెప్పలేనివి, అసలు ఏంటో అర్థం కానీ విషయాలు ఇలా చాలా ఉన్నాయి. ఏం చెప్పాలో కూడా నాకు అర్థం కావడం లేదు. కానీ అవి ఏంటో కనీసం కొన్నింటినీ కనుక్కోగలిగాను. నాలుగేళ్లకు పైగా నేను నిరాశకు గురయ్యాను. కొన్ని రోజులు మానసిక ఒత్తిడికి వైద్యం కూడా చేయించుకున్నాను. ప్రస్తుతం బాగానే ఉన్నాను. కానీ ఏడాదిగా ఈ మానసిక ఆరోగ్యానికి ఏదైనా చేయాలని ఉంది. కానీ ఏం చేయాలో.. ఏలా చేయాలో అర్థం కావడం లేదు’’ అంటూ ఇరా చెప్పకొచ్చారు. (చదవండి: నాలుగేళ్లు డిప్రెషన్‌లో ఉన్నా: హీరో కూతురు)
Comments
Please login to add a commentAdd a comment