World Mental Health Day
-
గట్టి కౌంటర్ ఇచ్చిన ఇరా ఖాన్
-
ట్రోల్స్‌కు గట్టి కౌంటర్ ఇచ్చిన ఇరా ఖాన్
ముంబై : తన మీద వస్తున్న ట్రోల్స్‌పై బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్ కుమార్తె ఇరా ఖాన్ స్పందించారు. ఇటీవల ఇరా తన మానసిక ఆరోగ్యం గురించి ఓ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. గత నాలుగేళ్లుగా ఆమె మానసిక ఒత్తిడితో బాధపడుతున్నట్లు ఈ వీడియోలో వెల్లడించారు. అయితే ఇరా చేసిన ఈ పోస్టుపై కొంతమంది ట్రోల్స్ చేస్తున్నారు. ద్వేషపూరిత వ్యాఖ్యలను కామెంట్ల రూపంలో తెలియజేస్తున్నారు. దీనిపై ఇరా స్పందిస్తూ ట్రోల్స్‌కు ఘాటుగా బదులిచ్చారు. తన పోస్టుపై ఎవరైన అభ్యంతరకంగా కామెంట్ పెడితే తొలగిస్తానని, అదే వ్యక్తి మళ్లీ మళ్లీ అలాగే పెట్టడానికి ధైర్యం చేస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. చదవండి: ఇరా డిప్రెషన్‌కు ఆమె తల్లిదండ్రులే కారణం’ ఇక ఇరా ఖాన్.. ఆమిర్ ఖాన్ మొదటి భార్య రీనా దత్తాల కూతురు అన్న విషయం తెలిసిందే. తను(ఇరా) గత నాలుగేళ్లుగా మానసిక ఒత్తిడితో బాధపడుతున్నానని పేర్కొన్నారు. అక్టోబర్ 10న ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం సందర్బంగా ఆమె ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రస్తుతం తన ఆరోగ్యం కుదుటపడిందని తెలిపారు. మానసిక ఆరోగ్యం కోసం ఏమైనా చేయాలని ఉంది. కానీ ఏం చేయాలో తెలీదు. అందుకే తన జర్నీ గురించి చెప్పాలి అనుకుటుంన్నానని, అసలు తనెందుకు ఒత్తిడికి లోనయ్యింది? ఏంటి అనే విషయాలను తెలియజేయాలని అనుకుంటున్నట్లు తెలిపారు. దానివల్ల మీకు మానసిక ఆరోగ్యంపై కాస్తైనా అవగాహన వస్తుందేమో" అని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. చదవండి: నాలుగేళ్లు డిప్రెషన్లో ఉన్నా: హీరో కూతురు -
‘ఇరా డిప్రెషన్‌కు ఆమె తల్లిదండ్రులే కారణం’
ముంబై: ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం సందర్భంగా బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ కూతురు ఇరా ఖాన్ తాను మానసిక ఒత్తిడి, నిరాశకు గురయ్యానని వెల్లడిస్తూ సోషల్ మీడియాలో ఓ వీడియో సందేశాన్ని పంచుకున్నారు. అది చూసిన బాలీవుడ్ ‘క్వీన్’ కంగనా రనౌత్ ఇరా వీడియోకు స్పందిస్తూ.. తాను కూడా మానసిక అనారోగ్యంతో బాధపడినట్లు ట్విటర్లో షేర్ చేశారు. ‘నేను 16 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు శారీరక దాడిని ఎదుర్కొన్నాను. నా సోదరిపై యాసిడ్ దాడి జరిగినప్పుడు నేను ఒంటరిగా తనని చూసుకున్నాను. అయితే నిరాశకు గురవడానికి ఎన్నో కారణాలు ఉండవచ్చు. ఇబ్బందులు ఎదుర్కొన్న కుటుంబానికి మాత్రం అది సాధారణ విషయం కాదు. సాంప్రదాయ కుటుంబ వ్యవస్థ చాలా ముఖ్యం’ అంటూ రాసుకొచ్చారు. అలాగే ఇరా వీడియోపై కూడా స్పందిస్తూ ఆమె క్లినికల్ డిప్రెషన్‌కు కారణం తన తల్లిదండ్రులు విడాకులు తీసుకోవడమే అని అభిప్రాయపడ్డారు. ఈ విషయం అందరికి తెలుసు కానీ దీనిని ఎవరూ ఏకిభవించరు అని పేర్కొన్నారు. (చదవండి: అన్నీ మారాయి... అవి తప్ప!) At 16 I was facing physical assault, was single handedly taking care of my sister who was burnt with acid and also facing media wrath, there can be many reasons for depression but it’s generally difficult for broken families children, traditional family system is very important. https://t.co/0paMh8gTsv — Kangana Ranaut (@KanganaTeam) October 12, 2020 ఇరా ఖాన్.. ఆమిర్ ఖాన్ మొదటి భార్య రీనా దత్తాల కూతురు. ఇరా ఆదివారం తన ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో షేర్ చేస్తూ.. “చాలా జరుగుతోంది, చెప్పడానికి చాలా ఉంది. అంతా గందరగోళంగా ఉంది. ఒత్తిడితో కూడుకున్నవి, చెప్పలేనివి, అసలు ఏంటో అర్థం కానీ విషయాలు ఇలా చాలా ఉన్నాయి. ఏం చెప్పాలో కూడా నాకు అర్థం కావడం లేదు. కానీ అవి ఏంటో కనీసం కొన్నింటినీ కనుక్కోగలిగాను. నాలుగేళ్లకు పైగా నేను నిరాశకు గురయ్యాను. కొన్ని రోజులు మానసిక ఒత్తిడికి వైద్యం కూడా చేయించుకున్నాను. ప్రస్తుతం బాగానే ఉన్నాను. కానీ ఏడాదిగా ఈ మానసిక ఆరోగ్యానికి ఏదైనా చేయాలని ఉంది. కానీ ఏం చేయాలో.. ఏలా చేయాలో అర్థం కావడం లేదు’’ అంటూ ఇరా చెప్పకొచ్చారు. (చదవండి: నాలుగేళ్లు డిప్రెషన్లో ఉన్నా: హీరో కూతురు) -
కరోనా: మానసిక ఆరోగ్యంలో మార్పులు
సాక్షి, హైదరాబాద్: చీకటితో పాటే వెలుగు వస్తుంది.. కల్లోలం వెనుకే ప్రశాంతత ఉంటుంది.. కోవిడ్ అది నిరూపించింది. కొద్ది రోజుల క్రితం వరకు బెంబేలెత్తించిన మహమ్మారి తగ్గుముఖం పట్టింది. దీంతో అన్ని రంగాలు తిరిగి గాడిన పడ్డాయి. ప్రజల మానసిక ఆరోగ్యంలోనూ మార్పులు చోటుచేసుకున్నాయి. మానసిక ఆందోళన, కుంగుబాటు, ఆత్మహత్యాప్రవృత్తి వంటి కోవిడ్ వల్ల తలెత్తిన మానసిక రుగ్మతలు క్రమంగా తగ్గుతున్నట్లు మానసిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మహమ్మారి నియంత్రణ కోసం లాక్డౌన్ విధించడంతో ఒక్కసారిగా ప్రజాజీవనం అతలాకుతలమైంది. ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు బ్రేక్ పడింది. కోవిడ్ బారిన పడిన వారిని ఒకరకమైన మానసిక భయాందోళనలు చుట్టుముట్టగా ఏ వైపు నుంచి ముప్పు ముంచుకొస్తుందోననేఆందోళన సాధారణ జనాన్ని వెంటాడింది. ఇంటి నుంచి బయటకు వెళ్లినా, తిరిగి ఇళ్లు చేరుకొన్నా తమతో పాటే కోవిడ్ వచ్చిందేమోననే భయాందోళనకు గురయ్యారు. కానీ లాక్డౌన్ నిబంధనలను సడలించడంతో పాటు అన్ని రంగాల్లో సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో ఉద్యోగ, వ్యాపారాల కోసం జనం ఇళ్ల నుంచి బయటకు వస్తున్నారు. రహదారులు వాహనాలతో కిక్కిరిసిపోతున్నాయి. మాస్కులు ధరించి భౌతిక దూరం పాటిస్తూ దైనందిన జీవితాన్ని కొనసాగిస్తున్నారు. కోవిడ్ తర్వాత మానసిక ఆరోగ్యంలో మౌలికమైన మార్పులు వచ్చాయని ప్రముఖ మానసిక వైద్య నిపుణులు డాక్టర్ రాధిక ఆచార్య అన్నారు. అప్పుడు అలా.. మార్చి నుంచి ఇంచుమించు ఆగస్టు వరకు కోవిడ్ ఉధృతి కొనసాగింది. ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులు కిక్కిరిసిపోయాయి. వైరస్ బారిన పడినవారిలో పలువురు మృత్యువాత పడ్డారు. ఈ పరిణామాలు ప్రతి ఇంట్లోనూ భయాందోళన కలిగించాయి. లాక్డౌన్ కాలంలో అందరూ ఇంటికే పరిమితమయ్యారు. మొదట్లో కుటుంబ సభ్యుల మధ్య అనుబంధాలు పెరిగినా తర్వాత యాంత్రికంగా మారాయి. నిరాటంకంగా కొనసాగిన అనిశ్చితి కల్లోలాన్ని రేపింది. మహిళలపై పని భారం పెరిగింది. గృహహింస ఎక్కువైంది. దీంతో చాలా మంది డిప్రెషన్‌కు గురయ్యారు. ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు కోల్పోవడం వల్ల చాలాచోట్ల ఆత్మహత్య చేసుకున్నారు. రోష్ని వంటి స్వచ్ఛంద సంస్థల సహాయ కేంద్రాలకు ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు సుమారు 5 వేలకు పైగా బాధితులు తమ సమస్యలను ఏకరువు పెట్టారు. పోలీస్ సహాయ కేంద్రాలు, షీటీమ్స్ విభాగాలకు సైతం గృహహింస కేసులు వెల్లువెత్తాయి. వైరస్ బారిన పడిన వారిలో చాలా మంది శారీరకంగా పూర్తిగా కోలుకున్నప్పటికీ మానసికంగా డిప్రెషన్‌కు లోనయ్యారు. ఇంటిల్లిపాది వైరస్ సోకిన కుటుంబాల్లో ఈ ఆందోళనలు, కుంగుబాటు లక్షణాలు మరింత తీవ్రమయ్యాయి. ఇప్పుడు ఇలా.. అన్‌లాక్ 4.0 తర్వాత 80 శాతానికి పైగా ఆంక్షలు తొలగిపోయాయి. అంతటా సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి. సెప్టెంబర్ నుంచి కరోనా కేసులు కొంత మేర తగ్గుముఖం పట్టాయి. జనం భయం వీడి బయటకు వచ్చారు. కరోనాతో సహజీవనం తప్పనిసరి అనే అవగాహన పెరిగింది. ఇళ్లకే పరిమితమైన వాళ్లు ఇప్పుడు ఉద్యోగ, వ్యాపారాలకు వెళ్లడమే కాకుండా వీకెండ్స్ కాలక్షేపం కోసం బయటకు వస్తున్నారు. దుర్గం చెరువు, నెక్లెస్‌రోడ్డు వంటి ప్రాంతాలు సందర్శకులతో కనిపిస్తున్నాయి. ఆన్లైన్ పాఠాలతో పిల్లల కుస్తీ.. స్కూళ్లు, విద్యాసంస్థలు తెరుచుకోకపోవడం వల్ల పిల్లలు ఆన్లైన్ చదువులతో కుస్తీ పడుతున్నారు. దీంతో పిల్లలపైన మాత్రం లాక్డౌన్ ప్రభావం కొనసాగుతోంది. స్కూళ్లు, కాలేజీ వాతావరణానికి దూరంగా ఉండటం వల్ల మానసిక వికాసానికి ఒకింత అవరోధంగానే ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. మార్పు వచ్చింది నెల రోజులుగా మానసిక సమస్యలతో వచ్చే వారి సంఖ్య చాలా వరకు తగ్గింది. కుటుంబ సంబంధాలు, సామాజిక సంబంధాలు తిరిగి సాధారణ స్థితికి చేరుకుంటున్నాయి. చాలామంది కోవిడ్ భయంతోనే ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఇప్పుడు ఆ భయం తొలగింది. కోవిడ్‌ను ఎదుర్కోగలమనే భరోసా వచ్చింది. – డాక్టర్ చల్లా గీత, మానసిక వైద్య నిపుణులు,మనోజాగృతి వ్యవస్థాపకులు. -
మానసిక ఆరోగ్య ప్రాపిరస్తు..!
ఆర్థిక కష్టాలు ఉండవు.. అయినా ఇంకా ఏదో కావాలన్న తపన నిద్రపట్టనీయదు.. కుటుంబ సభ్యులంతా ఆనందంగా ఉన్నా.. ఆ ఒక్కరిలో తెలియని వేదన, విద్యార్థి చక్కగా చదువుతాడు.. పరీక్షలంటే భయం, తెలివితేటలు పుష్కలంగా ఉన్నా సమస్య వస్తే ఎదుర్కొనలేకపోవడం.. ఆరోగ్యంగా ఉన్నా ఒంటరిగా బయటకు వెళ్లేందుకు భయపడడం... పెద్దలు, అధికారులు మందలిస్తే మానసికంగా కుంగిపోవడం.. ఇలాంటి మానసిక సమస్యలతో జిల్లాలో వేలాది మంది సతమతమవుతున్నారు. వైద్యులను ఆశ్రయించి చికిత్స పొందుతున్నారు. నేడు ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం సందర్భంగా అలాంటి వారందరికీ మానసిక ఆరోగ్యం ప్రాప్తించాలని ఆకాంక్షిద్దాం. విజయనగరం ఫోర్ట్: ‘ఎంత డబ్బు ఉన్నా ఒంటికి సుఖం లేకపోతే ఎందుకు’ అన్నది పెద్దల మాట. చాలా మంది అన్నీ ఉన్నా మానసిక ప్రశాంతత లేక బాధపడుతున్నారు. మరికొందరు ఆర్థిక పరిస్థితులు, కుటుంబ సమస్యలు, తీవ్ర పని ఒత్తిడి తదితర కారణాలతో మానసిక సమస్యల బారిన పడుతున్నారు. వీరి సంఖ్య జిల్లాలో పెరుగుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. 15 నుంచి 20 శాతం మందికే వైద్యం ఇప్పటికీ మానసిక అనారోగ్యంతో బాధపడుతున్న వారిలో కేవలం 15 నుంచి 20 శాతం మంది మాత్రమే చికిత్స పొందుతున్నారు. సమాజంలో మానసిక ఆరోగ్యంపై అవగాహన రాహిత్యం, చిన్న చూపు, అపోహలు, పేదరిక తదితర కారణాలు వారిని ఆస్పత్రికి రాకుండా నిలువరిస్తున్నాయి. మానసిక సమస్యలపై అవగాహన పెంచుకోవడం, అందుబాటులో ఉన్న వైద్యసేవలు పొందడం మంచిదని వైద్యులు చెబుతున్నారు. ఇటీవల కాలంలో కోవిడ్–19 వ్యాప్తి జనంను భయపెడుతోంది. ఆరోగ్య సమస్యలు సృష్టిస్తోంది. సామాజిక మాధ్యమాల్లో వచ్చే ప్రచారాలు అన్ని వర్గాల ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నారు. వాటిలో ఏది నమ్మాలో.. ఏది నమ్మకూడదో తెలియని పరిస్థితి. ప్రాణం తీస్తున్న కరోనా భయం.. ఇప్పుడు ప్రపంచమంతా కోవిడ్–19తో పోరాడుతోంది. భౌతిక దూరం, వ్యాధి చికిత్స, వ్యాక్సిన్ పట్ల అనిశ్చితి, ఆర్థిక చిక్కులు తదితర అంశాలు ప్రజల్లో తీవ్ర ఒత్తిడి, ఆందోళన కలిగిస్తున్నాయి. ఇవన్నీ ప్రజల మానసిక ఆరోగ్యాన్ని మరింత దెబ్బతీస్తున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాల ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా 45 కోట్ల మంది వేర్వేరు మానసిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారని అంచనా. ప్రపంచంలో ప్రతి 40 సెకన్లకు ఒకరు ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. అంతకు 20 రెట్లు మంది ఆత్మహత్యా ప్రయత్నం చేస్తున్నారు. ఏటా ప్రతి 10 మంది పిల్లలలో ఒకరు, ప్రతి నలుగురు పెద్దలలో ఒకరు కొత్తగా మానసిక ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నట్టు ఓ అంచనా. జిల్లాలో ఏడాదికి 20 వేల మంది... జిల్లాలో ఏడాదికి 20 వేల నుంచి 24 వేలు మంది వరకు మానసిక సమస్యల బారిన పడుతున్నారు. వీరిలో అనేకమంది వివిధ రకాల మానసిక సమస్యలు భారిన పడుతున్నారు. ఆర్థికంగా నష్టపోయి కొంతమంది, కుటుంబ కలహాలవల్ల కొందరు, అనారోగ్య సమస్యల వల్ల కొందరు మానసిక సమస్యలకు గురవుతున్నారు. ఒక మనిషి సాధారణ భావోద్వేగాలు, అనుభూతులు పొందుతూ అవసరమైనప్పుడు నియంత్రించుకుంటూ దైనందిన జీవితంలో ఎదురయ్యే సమస్యలను ఎదుర్కొనే శక్తి కలిగి జీవితం గడుపుతుంటే మానసికంగా ఆరోగ్యంగా ఉన్నట్టే. మంచి ఆరోగ్యం, సరిపడినంత నిద్ర, వ్యాయామం, యోగ, తమకు తాము సమయం కేటాయించుకోవడం, కుటుంబం, స్నేహితులతో మంచి బంధాలు కలిగి ఉండడం ద్వారా మానసిక ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవచ్చు. ఒత్తిడి, కుంగుబాటు, భయం లేదా మరేదైనా మానసిక సమస్య ఎదురైనప్పుడు అందుబాటులో ఉన్న మానసిక ఆరోగ్య నిపుణులను కలిస్తే సమస్య తీవ్రం కాకుండా కాపాడుకోవచ్చు. చికిత్సతో విముక్తి మానసిక సమస్యలు ఎదుర్కొనేవారి సంఖ్య ఇటీవల కాలంలో జిల్లాలో పెరుగుతోంది. ఒక్కొక్కరు ఒక్కో సమస్యతో వస్తున్నారు. మానసిక సమస్యకు సకాలంలో పరిష్కారం పొందాలి. అవసరమైతే చికిత్స చేయించుకోవాలి. లేదంటే నిద్రలేక ఆరోగ్యం దెబ్బతింటుంది. ప్రతి ఒక్కడు ఒత్తిడికి దూరం కావాలి. ప్రశాంత జీవనాన్ని అలవర్చుకోవాలి. ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించాలి. వ్యాయామం, యోగ వంటివి చేయడం అలవాటు చేసుకోవాలి. ఆరోగ్యంగా జీవించాలి. – డాక్టర్ జాగరపు రమేష్, మానసిక వైద్య నిపుణుడు -
ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవ సందర్భంగా ర్యాలీ
-
ఊప్రతి నలుగురిలో ఒకరికి..
మానసిక సమస్యలపై కేంద్ర మంత్రి ఫగ్గాన్ సింగ్ సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో మానసిక వ్యాధులకు దారి తీస్తున్న పరిస్థితులు, రుగ్మతలకు చికిత్సలపై ప్రజల్లో అవగాహన కల్పించడం అత్యవసరమని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి ఫగ్గాన్ సింగ్ అన్నారు. ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం సందర్భంగా సోమవారం ఢిల్లీలో ఏర్పాటుచేసిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. దేశంలో ప్రతి నలుగురిలో ఒకరు తమ జీవితంలో ఒక్కసారైనా మానసిక రుగ్మతల బారిన పడుతున్నారన్నారు. మానసిన వ్యాధులతో బాధపడుతున్న వారిని సమాజం ఏకాకుల్ని చేయడం, వివక్ష చూపడంతో వారు చికిత్సకు దూరమవుతున్నారని తెలిపారు. ఇలాంటి వ్యక్తుల విషయంలో సమాజం వైఖరి మారాలన్నారు. చికిత్స విషయంలో ఆరోగ్య వ్యవస్థను సున్నితంగా, ఆమోదయోగ్యంగా మార్చడంలో ఎదురయ్యే సవాళ్లను అందరూ కలసికట్టుగా అధిగమించాలన్నారు. భౌతికంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉన్నప్పుడే పరిపూర్ణ ఆరోగ్యవంతులమవుతామని కేంద్ర సహాయ మంత్రి అనుప్రియ పటేల్ అన్నారు. దేశంలో దాదాపు ఏడు శాతం ప్రజలు మానసిక రుగ్మతలతో బాధపడుతున్నారని, సమస్య పరిష్కారానికి మానసిక నిపుణుల అవసరముందన్నారు. అందుకు జాతీయ మానసిక ఆరోగ్య పథకం కింద కేంద్రం నిధులు కేటాయిస్తోందని చెప్పారు.