Trolls On Aamir Khan Daughter Ira Khan For Celebrating Birthday In Bikini, Pics Goes Viral - Sakshi
Sakshi News home page

Ira Khan: బికినీలో కేక్‌ కట్‌ చేసిన ఆమిర్‌ ఖాన్‌ కూతురు, ఫొటోలు వైరల్‌

Published Mon, May 9 2022 2:48 PM | Last Updated on Mon, May 9 2022 3:46 PM

Aamir Khan Daughter Ira Khan Birthday Celebration Photos Went Viral - Sakshi

ఆమిర్‌, ఆజాద్‌ కూడా షర్ట్‌ లేకుండా ఉండటాన్ని బట్టి వారు అప్పుడే స్విమ్మింగ్‌ పూల్‌లో నుంచి బయటకు వచ్చి బర్త్‌డే సెలబ్రేష‍న్స్‌లో పాల్గొన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు వైరల్‌గా మారాయి. 

బాలీవుడ్‌ స్టార్‌ హీరో ఆమిర్‌ ఖాన్‌ కూతురు ఇరాఖాన్‌ ఆదివారం(మే 8న) 25వ పుట్టినరోజు జరుపుకుంది. ఈ సందర్భంగా తన కుటుంబంతో కలిసి బర్త్‌డే పార్టీ చేసుకుంది. అయితే ఈ వేడుకల్లో ఇరా బికినీలో కేక్‌ కట్‌ చేయడం విశేషం. ఆమిర్‌, ఆజాద్‌ కూడా షర్ట్‌ లేకుండా ఉండటాన్ని బట్టి వారు అప్పుడే స్విమ్మింగ్‌ పూల్‌లో నుంచి బయటకు వచ్చి బర్త్‌డే సెలబ్రేష‍న్స్‌లో పాల్గొన్నట్లు తెలుస్తోంది. ఈ బర్త్‌డే పార్టీలో తల్లి రీనా దత్తా కూడా ఉంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు వైరల్‌గా మారాయి. బికినీలో కూడా బర్త్‌డే జరుపుకుంటారా? అని కొందరు సర్‌ప్రైజ్‌ అవుతుంటే పేరెంట్స్‌తో ఆ డ్రెస్‌లో వేడుక చేసుకోవడానికి కొంచెం కూడా సిగ్గు లేదా? అని మరికొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇదిలా ఉంటే ఇరా ఖాన్‌ ప్రియుడు నుపూర్‌ ప్రేయసితో కలిసి దిగిన ఫొటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తూ ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపాడు. కాగా ఇరా ఖాన్‌ ఇటీవలే యాంగ్జైటీతో బాధపడుతున్న విషయాన్ని చెప్పుకొచ్చిన విషయం తెలిసిందే! సరిగా ఊపిరి తీసుకోలేకపోతున్నానని, మాటిమాటికీ ఏడుపొస్తుందని తన మానసిక సమస్యను వివరించింది.

చదవండి: కేజీఎఫ్‌ 2: 'అమ్మ పాట' ఫుల్‌ వీడియో చూశారా ?

ఫహద్‌ ఫాజిల్ 'దొంగాట' రివ్యూ.. ఎలా ఉందంటే ?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement